అన్వేషించండి

WhatsApp New Feature: ఒక్క ట్యాప్‌తో వీడియో రికార్డింగ్‌, వాట్సాప్ నుంచి అదిరిపోయే ఫీచర్

వాట్సాప్ నుంచి మరో సరికొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. యూజర్లు హ్యాండ్స్ ఫ్రీగా వీడియోను క్యాప్చర్ చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇందుకోసం కొత్త ఫంక్షన్ ను రిలీజ్ చేసింది.

మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ ఫామ్ వాట్సాప్ తమ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. రెండు బిలియన్లకు పైగా యాక్టివ్ యూజర్లతో ప్రపంచంలో టాప్ యాప్ కొనసాగుతున్న వాట్సాన్ మరో ఉపయోగకరమైన ఫీచర్‌ను విడుదల చేసింది. ఇప్పుడు వినియోగదారులు వీడియో బటన్‌ను నొక్కి పట్టు కోకుండానే వీడియోలను రికార్డ్ చేసే అవకాశాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంతకుముందు వినియోగదారులు వాట్సాప్ వీడియో రికార్డ్ బటన్‌ను నొక్కి పట్టుకుంటేనే వీడియో రికార్డ్ అయ్యేది.  పట్టుకోవాలి. WhatsApp వీడియో మోడ్‌కు మారడం అని పిలుస్తుంది.

ఇకపై ఈజీగా వీడియో రికార్డ్ చేసే అవకాశం

వాట్సాప్ న్యూస్, ఫీచర్ రిపోర్టింగ్ వెబ్‌సైట్ WaBetaInfo నివేదిక ప్రకారం, ఈ కొత్త ఫీచర్ ప్రస్తుతం Google Play Storeలో అందుబాటులో ఉన్న Android 2.23.2.73 అప్‌ డేట్‌ తో వస్తుంది. వాట్సాప్‌ కొన్ని బీటా టెస్టర్ల కోసం కొత్త కెమెరాను కూడా విడుదల చేసింది. కెమెరా మోడ్‌లోని కొత్త హ్యాండ్స్ ఫ్రీ ఫీచర్ కేవలం ఒక ట్యాప్‌తో వీడియోను రికార్డ్ చేసే అవకాశం  కల్పిస్తుంది. కేవలం ఒక ట్యాప్‌తో వీడియో మోడ్‌ కి మారే సదుపాయంతో వాట్సాప్‌ కెమెరాను రీడిజైన్ చేసినట్లు వాట్సాప్ వెల్లడించింది. వీడియోలను రికార్డ్ చేయడానికి నొక్కి పట్టుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది.ఈ ఫీచర్‌ ద్వారా వాట్సాప్ వీడియోలను క్యాప్చర్ చేయడానికి మరింత సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపింది. వీడియో  రికార్డింగ్ చేస్తున్నప్పుడు ఫ్రంట్ నుంచి బ్యాక్ కెమెరాకు సులువుగా మారే వెసులుబాటు ఉంటుందని తెలిపింది. ఇప్పటికే పలువురు బీటా టెస్టర్లు  కొత్త కెమెరా మోడ్‌ను పరిశీలించినట్లు వెల్లడించింది.   

మరిన్ని ఫీచర్లపై వాట్సాప్ వర్కౌట్

మరోవైపు, వాట్సాప్ Ios, Android వినియోగదారుల కోసం ప్లాట్‌ఫారమ్‌లో పిక్చర్ ఇన్ ప్లేస్ మోడ్, వ్యూ వన్స్ టెక్స్ట్, కంపానియన్ మోడ్, డేట్ వారీగా మెసేజ్‌లను సెర్చ్ చేయడం, స్టేటస్‌పై వాయిస్ నోట్స్, స్క్రీన్ లాంటి మరిన్ని ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు వాట్సాప్ ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది.  WhatsApp డెస్క్‌ టాప్ కోసం లాక్,   కాల్ ట్యాబ్ లాంటి ఫీచర్లను సైతం డెవలప్ చేస్తున్నట్లు వెల్లడించింది.అటు కాలిస్టోగా, కొరియర్ ప్రైమ్, డామియన్, ఎక్సో 2, మార్నింగ్ బ్రీజ్‌ తో సహా కొత్త ఫాంట్‌లతో అప్‌డేట్‌ను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోంది.

యూజర్లు ఫోటోలు, వీడియోలు, GIFలలో తమ టెక్ట్స్ తో పాటు మరింత సృజనాత్మకతను జోడించే అవకాశం ఉంటుందని తెలిపిది. ఇకపై యూజర్లు చెప్పాలనుకున్న విషయాన్ని మరింత ఆకట్టుకునేలా చెప్పే అవకాశం ఉంటుందని వెల్లడించింది. వినియోగదారుల భద్రత విషయంలోనూ సరికొత్త అప్ డేట్స్ తీసుకొస్తున్నట్లు తెలిపింది.

Read Also: ఆండ్రాయిడ్‌కి పోటీగా భారత ఓఎస్, ‘BharOS’ రూపొందించిన మద్రాస్ ఐఐటీ

టాప్ హెడ్ లైన్స్

ABP Southern Rising Summit: కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: సీఎం రేవంత్ రెడ్డి
ABP Southern Rising Summit: కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: సీఎం రేవంత్ రెడ్డి
Rekha Naik House ED Raids: రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
Pollution Certificate: పొల్యూషన్ రూల్స్‌ పాటించని 17,000కు పైగా వాహనాలు సీజ్.. దాదాపు 26,000 ట్రాఫిక్‌ చలాన్లు జారీ, జర జాగ్రత్త!
పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుంటే తప్పదు 'జరిమానా'.. 17 రోజుల్లోనే దాదాపు 26,000 చలాన్లు జారీ
KTR On CM Revanth Reddy: 'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Southern Rising Summit: కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: సీఎం రేవంత్ రెడ్డి
ABP Southern Rising Summit: కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: సీఎం రేవంత్ రెడ్డి
Rekha Naik House ED Raids: రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
Pollution Certificate: పొల్యూషన్ రూల్స్‌ పాటించని 17,000కు పైగా వాహనాలు సీజ్.. దాదాపు 26,000 ట్రాఫిక్‌ చలాన్లు జారీ, జర జాగ్రత్త!
పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుంటే తప్పదు 'జరిమానా'.. 17 రోజుల్లోనే దాదాపు 26,000 చలాన్లు జారీ
KTR On CM Revanth Reddy: 'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
Aakasamlo Oka Tara OTT : ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Kolathur MLA VS Babu Passes Away: తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
Polavaram Maoist Dump:చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
Rahul Gandhi US Remarks Row: అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
Embed widget