Whatsapp Group Rules: వాట్సాప్ గ్రూప్ అడ్మిన్స్‌కు వార్నింగ్.. ఇవి చేస్తే జైలుకే!
మీరు వాట్సాప్ గ్రూపు అడ్మిన్‌గా ఉన్నారా? అయితే ఈ విషయాల్లో జాగ్రత్తగా లేకపోతే మీరు జైలుకు వెళ్లే అవకాశం ఉంది.
![Whatsapp Group Rules: వాట్సాప్ గ్రూప్ అడ్మిన్స్‌కు వార్నింగ్.. ఇవి చేస్తే జైలుకే! Whatsapp Group Admins May Go To Jail For These 5 Things Whatsapp Group Rules: వాట్సాప్ గ్రూప్ అడ్మిన్స్‌కు వార్నింగ్.. ఇవి చేస్తే జైలుకే!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/22/8f4bb590db38136da855815a2a79ad88_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
మీరు వాట్సాప్ ఉపయోగిస్తుంటే మీకు గ్రూపుల గురించి తెలిసే ఉంటుంది. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లకు ఆ గ్రూపుపై కొన్ని ప్రత్యేకమైన అధికారాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. అయితే దీంతోపాటే కొన్ని సమస్యలు కూడా ఉంటాయి. ఒకవేళ గ్రూపులో ఏదైనా ఇల్లీగల్ పనులు జరిగితే దానికి గ్రూపు అడ్మినే బాధ్యత వహించాల్సి ఉంటుంది.
ఒకవేళ మీరు ఏదైనా వాట్సాప్ గ్రూపుకు అడ్మిన్‌గా ఉంటే అందులో ఎటువంటి కంటెంట్ షేర్ చేయాలి, ఎటువంటి కంటెంట్ షేర్ చేయకూడదు అనే అంశాలపై పూర్తి అవగాహన ఉండాలి. ఈ అవగాహన లేకపోతే కటకటాల్లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. మీరు వాట్సాప్ గ్రూపుకు అడ్మిన్‌గా ఈ ఐదు విషయాలు జాగ్రత్తగా ఫాలో అవ్వాలి.
యాంటీ నేషనల్ కంటెంట్ షేర్ చేయకూడదు
వాట్సాప్ గ్రూపుల్లో యాంటీ నేషనల్ కంటెంట్ షేర్ చేయకూడదు. అలా జరిగితే షేర్ చేసిన వారితో పాటు గ్రూప్ అడ్మిన్ కూడా అరెస్ట్ అవుతారు. కొన్ని సందర్భాల్లో వారికి జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంటుంది. ఉత్తరప్రదేశ్‌లోని బగ్‌పట్ ప్రాంతంలో జాతీయ వ్యతిరేక పోస్టులు పెట్టినందుకు ఒక వాట్సాప్ గ్రూపు అడ్మిన్ అరెస్ట్ కూడా అయ్యాడు.
అనుమతి లేకుండా ఫొటోలు షేర్ చేయకూడదు
ఒక వ్యక్తి అనుమతి లేకుండా.. వారి వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు వాట్సాప్‌లో షేర్ చేయకూడదు. ఇది కూడా క్రిమినల్ యాక్టివిటీ కిందకే వస్తుంది. అరెస్టయ్యే అవకాశం కూడా ఉంది.
హింసను ప్రేరేపించకూడదు
హింసను ప్రేరేపించే కంటెంట్‌ను వాట్సాప్‌లో షేర్ చేయకూడదు. టెక్స్ట్, ఫొటో, వీడియో.. ఇలా ఏ రూపంలో అటువంటి కంటెంట్‌ను షేర్ చేసినా అది చట్టరీత్యా నేరమే. దానికి మీరు జైలుకు కూడా వెళ్లే అవకాశం ఉంటుంది.
పోర్న్ క్లిప్స్ షేర్ చేస్తే అంతే!
వాట్సాప్ లో పోర్న్ క్లిప్‌లను షేర్ చేయడం కూడా చట్టవిరుద్ధం. దీని కారణంగా శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్లే అవకాశం కూడా ఉంది. చైల్డ్ పోర్న్, వ్యభిచారాన్ని ప్రోత్సహించే కంటెంట్ షేర్ చేస్తే జైలు శిక్ష కూడా పడుతుంది. కాబట్టి వాట్సాప్‌లో పోర్న్‌కు దూరంగా ఉండటం మంచిది.
ఫేక్ న్యూస్ షేర్ చేయకూడదు
వాట్సాప్‌లో ఫేక్ న్యూస్ షేర్ చేసినా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. వాట్సాప్‌లో నకిలీ వార్తలు షేర్ చేసినా ఫిర్యాదు చేసేలా ఇటీవలే ఒక చట్టం తీసుకువచ్చారు.
Also Read: Realme 9i: రూ.14 వేలలోపే రియల్‌మీ కొత్త ఫోన్.. సూపర్ అనిపించే ఫీచర్లు.. లేటెస్ట్ ప్రాసెసర్ కూడా!
Also Read: Samsung Offers: గుడ్‌న్యూస్.. ఈ శాంసంగ్ ఫోన్ ధర తగ్గింపు.. ఇప్పుడు రూ.13 వేలలోపే!
Also Read: Cheapest 5G Phone: వేడెక్కుతున్న 5జీ మార్కెట్.. రూ.20 వేలలోపే మరో 5జీ ఫోన్!
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)