Meta Server Down: వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలు డౌన్, ప్రపంచవ్యాప్తంగా వినియోగదారుల ఇక్కట్లు
Meta Server Down:సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అకస్మాత్తుగా నిలిచిపోయాయి. సందేశాల నుంచి పోస్టులు పంపడం వరకు వినియోగదారులు సమస్యలుఎదుర్కొన్నారు.
Meta Server Down: ప్రస్తుత టెక్నాలజీ కాలంలో ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా మాధ్యమాలైన వాట్సాప్, ఫేస్‌బుక్( Facebook), ఇన్‌స్టాగ్రామ్(Instagram)లకు అలవాటు పడిపోయిన విషయం తెలిసిందే. సందేశాల నుంచి సమాచారం ఇచ్చి పుచ్చుకునే వరకు.. ఫొటోల నుంచి వీడియోలు షేర్ చేసుకునే వరకు అందరూ సోషల్ మీడియాలనే వేదికగా చేసుకుంటున్నారు. నిజానికి చెప్పాలంటే.. ఈ సామాజిక మాధ్యమాలు(Social Media) ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో భాగం అయిపోయాయి. ఇవి లేకుండా.. ఒక్క గంట కాదు.. పది నిమిషాలు కూడా..వేచి చూసే పరిస్థితి లేకుండా పోయింది. అంతేకాదు.. వృత్తిపరంగా కూడా సామాజిక మాధ్యమాల పాత్ర పెరిగిపోయింది. ఆఫీసు వర్కు(Office work) నుంచి అనేక విధాలుగా ఈ సామాజిక మాధ్యమాలు ప్రజలతో బంధాన్ని పెంచేసుకున్నాయి. దీంతో ఈ వ్యవస్థలో ఏ చిన్న లోపం వచ్చి.. ఆగిపోయినా.. ప్రపంచమే తలకిందులు అయినంత భారంగా బాధగా కూడా ఉంటోంది.
ఏం జరిగింది?
తాజాగా మెటా(Meta) సర్వర్ డౌన్‌కావడంతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ బుధవారం రాత్రి అకస్మాత్తుగా డౌన్ అయ్యాయి. సందేశాలు పంపడం నుంచి పోస్ట్‌లు చేయడం వరకు వినియోగదారులు సమస్యలను ఎదుర్కొన్నారు. దీనికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులు తమ అనుభవాలను ట్విట్టర్‌లో షేర్ చేశారు.
గతంలో కూడా
ప్రపంచ దిగ్గజ సర్వర్ సంస్థ మెటా(Meta)లోని దాదాపు అన్ని ప్లాట్‌ఫారమ్‌లలో ఈ సమస్య ఎదురవుతున్నట్లు చెబుతున్నారు. Downdetector.com ప్రకారం.. ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల వినియోగదారులు వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి నిరంతరం ఫిర్యాదు చేస్తున్నారు. అయితే.. వినియోగదారులపై ఫిర్యాదులపై.. వారి సమస్యలపై మెటా ఇప్పటి వరకు స్పందించకపోవడం గమనార్హం. వాట్సాప్‌తో పాటు, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లు మెటా యాజమాన్యంలోనే ఉన్న విషయం తెలిసిందే. తాజాగా తలెత్తిన సర్వర్ సమస్యల కారణంగా లక్షలాది మంది వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. ఈ అంతరాయానికి కారణం, ఎంతకాలం సేవ అందుబాటులో ఉండదనే విషయాలపై Meta ఇంకా ఎలాంటి అధికారిక నివేదికను విడుదల చేయలేదు. ఇదిలావుంటే, అక్టోబరులో కూడా ప్లాట్‌ఫారమ్‌లలో సమస్యలు తలెత్తాయి. అప్పట్లో సమస్యపై స్పందించిన మెటా.. ఒక గంటలోపు సేవలను పునరుద్ధరించింది.
వినియోగదారుల ఆగ్రహం
మెటా సర్వర్ నిలిచిపోయి.. సోషల్ మీడియా(Social Media)లో తలెత్తిన సమస్యలపై వినియోగదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్వీస్ యాప్ లేదా వెబ్‌సైట్‌ను ఉపయోగించలేకపోతున్నట్టు తెలిపారు. తమ కార్యకలాపాలు కూడా నిలిచిపోతున్నాయని చాలా మంది పేర్కొన్నారు. అయితే.. వీరి ఆగ్రహాన్ని గ్రహించిన ఫేస్‌బుక్(Face book).. ``వీలైనంత త్వరగా దీన్ని పరిష్కరించడానికి పని చేస్తున్నాము" అని పేర్కొంది.
వీటిలోనే సమస్యలు..
- Facebook
- Instagram
- Threads
- WhatsApp
- Facebook Messenger