WeCool MoonWalk: రూ.1,599కే వైర్‌లెస్ ఇయర్ బడ్స్, అదిరిపోయే ఫీచర్లు!
వుయ్ కూల్ మూన్ వాక్ ఎం2 ఈఎన్‌సీ వైర్‌లెస్ ఇయర్ బడ్స్ మనదేశంలో లాంచ్ అయ్యాయి.
వుయ్ కూల్ మూన్‌వాక్ ఎం2 ఈఎన్‌సీ ట్రూ వైర్‌లెస్ స్టీరియో ఇయర్‌ఫోన్స్ మనదేశంలో లాంచ్ అయ్యాయి. ఇందులో ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ (ఈఎన్‌సీ) ఫీచర్ అందించారు. ఇందులో పంచీ బేస్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఎర్గోనోమిక్ డిజైన్ అందించారు. వీటి బరువు కూడా చాలా తక్కువగా ఉండనుంది.
వుయ్ కూల్ మూన్ వాక్ ఎం2 ఈఎన్‌సీ ఇయర్‌ఫోన్స్ ధర
వీటి ధరను మనదేశంలో రూ.1,599గా నిర్ణయించారు. కేవలం అమెజాన్‌లో మాత్రమే ఇవి అందుబాటులో ఉండనున్నాయి. బ్లాక్ కలర్‌లో వీటిని కొనుగోలు చేయవచ్చు.
వుయ్ కూల్ మూన్ వాన్ ఎం2 ఈఎన్‌సీ ఇయర్ ఫోన్స్ స్పెసిఫికేషన్లు
వీటిలో ఎర్గోనోమిక్ డిజైన్‌ను అందించారు. వీటి బరువు కూడా తక్కువగా ఉండనుంది. వీటి ఫిట్ కూడా చక్కగా ఇమడనుంది. 10 ఎంఎం డైనమిక్ డ్రైవర్లను ఇందులో కంపెనీ అందించింది. కాలింగ్, వాల్యూమ్, మ్యూజిక్ కోసం టచ్ కంట్రోల్స్ ఇందులో అందించారు. చదరపు ఆకారంలో ఉన్న కేస్‌లో వీటిని అందించారు. ఎల్ఈడీ బ్యాటరీ స్టేటస్ ఇండికేటర్ కూడా ఇందులో ఉండటం విశేషం. వీటిలో ప్రత్యేకమైన గేమింగ్ మోడ్ కూడా ఉంది.
ఇయర్‌బడ్స్‌లో ఏదైనా ఒకదాన్ని లాంగ్ ప్రెస్ చేస్తే గేమింగ్ మోడ్ యాక్టివేట్ కానుంది. గూగుల్ అసిస్టెంట్, సిరిలను ఇది సపోర్ట్ చేయనుంది. ఇందులో ఎన్విరాన్‌మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ఉండనుంది. మెరుగైన కాలింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇది అందించనుంది.
ఈ ఇయర్ బడ్స్‌లో బ్లూటూత్ వీ5.1 కనెక్టివిటీని అందించారు. క్విక్ పెయిర్ టెక్నాలజీ కూడా ఇందులో ఉంది. ఇందులో ఐపీఎక్స్5 వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ ఉండనుంది. ఇందులో మంచి ఈక్వలైజర్ ప్రీసెట్‌ను అందించారు. ఇది మొత్తంగా 32 గంటల ప్లేటైంను అందించనుంది. యూఎస్‌బీ టైప్-సీ పోర్టు ద్వారా దీన్ని చార్జ్ చేయవచ్చు.
View this post on Instagram