Vi Hotstar Plan: రూ.151కే మూడు నెలల హాట్‌స్టార్ - డేటా కూడా - వీఐ సూపర్ ప్లాన్!
వొడాఫోన్ ఐడియా రూ.151 ప్లాన్ ద్వారా మూడు నెలల డిస్నీప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను అందించనుంది.
వొడాఫోన్ ఐడియా కొత్త రీచార్జ్ ప్లాన్‌ను లాంచ్ చేసింది. అదే రూ.151 ప్లాన్. దీని ద్వారా మూడు నెలల డిస్నీప్లస్ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ లభించనుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులు కాగా, వినియోగదారులకు 8 జీబీ డేటా కూడా లభించనుంది.
వొడాఫోన్ ఇటీవలే రూ.499, రూ.1,066 ప్రీపెయిడ్ ప్లాన్లను కూడా లాంచ్ చేసింది. ఈ రెండు ప్లాన్ల ద్వారా డిస్నీప్లస్ హాట్‌స్టార్ ఉచిత సబ్‌స్క్రిప్షన్ లాంచ్ చేయనుంది. డిస్నీప్లస్ హాట్ స్టార్ ఓటీటీని తక్కువ ధరకే ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఇది ఉపయోగపడుతుంది.
దీంతోపాటు వినియోగదారులు తమకు నచ్చిన కాలర్ ట్యూన్‌ను ఎంచుకోవచ్చు. వీఐ యాప్‌లోని మ్యూజిక్ సెక్షన్‌లో ఈ కాలర్ ట్యూన్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. అయితే దీనికి రూ.69 సబ్‌స్క్రిప్షన్ చెల్లించాల్సి ఉంటుంది. సబ్‌స్క్రైబ్ చేసుకుంటే వీఐ యాప్‌లోని మ్యూజిక్‌ను యాడ్స్ లేకుండా ఎంజాయ్ చేయవచ్చు. 2జీ వినియోగదారులు 4జీకి అప్‌గ్రేడ్ అయితే
రిలయన్స్ జియో కూడా ఇటీవలే రూ.149 ప్లాన్‌ను లాంచ్ చేసింది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 20 రోజులుగా ఉంది. రోజుకు 1 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్, జియో యాప్స్‌కు ఉచిత యాక్సెస్ లభించనుంది. 2జీ నుంచి 4జీకి మారాలనుకునే వారికి రూ.100 క్యాష్‌బ్యాక్‌ను వీఐ అందిస్తుంది.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!
View this post on Instagram