(Source: ECI/ABP News/ABP Majha)
Twitter Update: ట్వీటర్‌లో ఈ సూపర్ ఫీచర్ ఇంక అందరికీ.. ఆడియో చాట్ కూడా.. ఎలా వాడాలంటే?
Twitter Spaces Rollout: ప్రముఖ సోషల్ మీడియా సర్వీస్ ట్వీటర్ తన కొత్త స్పేసెస్ ఫీచర్‌ను అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చింది.
ట్వీటర్ స్పేసెస్ వినియోగదారులందరికీ అందుబాటులోకి వచ్చాయి. ఈ విషయాన్ని స్పేసెస్ టీమ్ అధికారికంగా ప్రకటించింది. ఇకపై ఆండ్రాయిడ్, ఐవోఎస్ వినియోగదారులు తమ సొంత చాట్‌రూంను క్రియేట్ చేసుకోవచ్చు. ఈ క్లబ్ హౌస్ తరహా ఫీచర్‌తో వినియోగదారులు.. పబ్లిక్, ప్రైవేట్ ఆడియో చాట్ రూమ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. దీన్ని మొదట కొందరికి మాత్రమే అందించారు. ఇప్పుడు అందరికీ ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. మొదట్లో 600కు పైగా ఫాలోయర్స్ ఉన్నవారు మాత్రమే స్పేసెస్ క్రియేట్ చేసే అవకాశం ఉండేది. అయితే ఇప్పుడు అందరికీ ఈ ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది.
ట్వీటర్ టైమ్‌లైన్‌లో ఉన్న కంపోజ్ బటన్‌పై లాంగ్ ప్రెస్ చేయడం ద్వారా వినియోగదారులు స్పేస్‌లు ప్రారంభించవచ్చు. దానిపై లాంగ్ ప్రెస్ చేస్తే.. అక్కడ మీకు కొన్ని ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో మీరు స్పేస్‌ను ఎంచుకుని, మైక్‌ను ఆన్ చేయాలి. స్పేసెస్‌లో ఒకేసారి 11 మంది స్పీకర్లు మాట్లాడే అవకాశం ఉంటుంది.
మీరు ఫాలో అయ్యేవారు ఎవరైనా స్పేస్‌ని ప్రారంభించినా, స్పేస్‌లో మాట్లాడుతున్నా.. అది మీ టైమ్‌లైన్ పైభాగంలో కనిపిస్తుంది. వారు ఆ స్పేస్‌లో ఉన్నంతవరకు మీరు దాన్ని పైన చూడవచ్చు. మీరు స్పేస్‌లో జాయిన్ అయితే.. మీరు ఎమోజీలతో రియాక్ట్ అవ్వవచ్చు. పిన్డ్ ట్వీట్లు చూడవచ్చు. స్పేస్ హోస్ట్‌కు ట్వీట్ లేదా డైరెక్ట్ మెసేజ్ చేయడం ద్వారా లేకపోతే కిందనున్న రిక్వెస్ట్ బటన్‌పై క్లిక్ చేయడం ద్వారా స్పేస్‌లో మాట్లాడవచ్చు.
గత సంవత్సరం చివరిలో ట్వీటర్ స్పేసెస్‌ను రోల్ అవుట్ చేయడం ప్రారంభించింది. దీంతో ట్వీటర్‌కు పెద్ద సంఖ్యలో యూజర్లు పెరిగారు. మొదట ఈ టెస్టింగ్‌ను ఐవోఎస్‌కే పరిమితం చేసినా.. తర్వాత ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా దీన్ని అందించారు. అప్పటినుంచి ట్వీటర్ క్లబ్‌హౌస్ యాప్‌కు పోటీగా కొత్త ఫీచర్లను అందిస్తూనే ఉంది.
ఈ సంవత్సరం మేలో స్పేసెస్ వెబ్ ఫీచర్‌ను కూడా అందించారు. రికార్డింగ్, రీప్లే ఫీచర్లు కూడా ట్వీటర్‌లో ఉన్నాయి. సంభాషణలు పూర్తయ్యాక కూడా.. ఇందులో జరిగిన ఆడియా కాన్వర్జేషన్‌ను వినవచ్చు. అయితే కొన్ని ఫీచర్లు స్పేసెస్ మొబైల్ యాప్స్‌కు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ట్వీటర్ వెబ్ యాప్‌కు కూడా కొత్త ఫీచర్లను కంపెనీ అందిస్తుంది.
Also Read: వాట్సాప్ చాటింగ్‌లు పర్మినెంట్‌గా హైడ్ చేయాలనుకుంటున్నారా.. ఇలా చేస్తే సరిపోతుంది!
Also Read: అత్యంత చవకైన 5జీ ఫోన్ లాంచ్ చేసిన నోకియా.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?