News
News
X

Twitter: మార్చి 20 తర్వాత ట్విట్టర్‌లో భారీ మార్పు - అలా చేయాలంటే బ్లూ సబ్‌‌స్క్రిప్షన్ తప్పనిసరి!

ట్విట్టర్‌లో మార్చి 20వ తేదీ తర్వాత టెక్స్ట్ మెసేజ్ ద్వారా టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ఫీచర్‌ను తొలగించనున్నారు.

FOLLOW US: 
Share:

Twitter Two factor authentication: మీరు Twitterని ఉపయోగిస్తుంటే ఈ కొత్త అప్‌డేట్ మీకు ఉపయోగకరంగా ఉంటుంది. 2023 మార్చి 20వ తేదీ తర్వాత ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్ లేని వాళ్లు టెక్స్ట్ మెసేజ్ ఆధారిత టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ సదుపాయాన్ని ఉపయోగించుకోలేరని ట్విట్టర్ బ్లాగ్ పోస్ట్ ద్వారా ప్రకటించింది. మీరు ఇంకా ట్విట్టర్ బ్లూ సేవను తీసుకోకపోతే ఈ అప్‌డేట్ మీకు ముఖ్యమైనది. ఎందుకంటే మీరు మార్చి 20వ తేదీ తర్వాత టెక్స్ట్ మెసేజ్ ద్వారా మీ ఖాతాను వెరిఫై చేయలేరు.

మీరు టెక్స్ట్ మెసేజ్ ద్వారా టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ చేయాలనుకుంటే దీని కోసం మీరు ట్విట్టర్ బ్లూ సర్వీస్ తీసుకోవాలి. మీరు ట్విట్టర్ బ్లూ సేవను తీసుకోకూడదనుకుంటే మార్చి 20కి ముందు మీ సెట్టింగ్‌ని మార్చాలి. టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ కోసం ఆథెంటికేషన్ యాప్ లేదా సెక్యూరిటీ కీ ఎంపికలలో ఒకదాన్ని ఎంచుకోవాలి.

మీరు దీన్ని చేయకపోతే మార్చి 20వ తేదీ తర్వాత మీ Twitter ఖాతా నుంచి టెక్స్ట్ మెసేజ్ ఆధారిత టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆటోమేటిక్‌గా తీసేస్తారు. మీ మొబైల్ నంబర్ కూడా Twitter నుంచి రిమూవ్ అవుతుంది. దీన్ని నివారించడానికి వెంటనే టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఎంపికను మార్చండి లేదా Twitter బ్లూ సేవను తీసుకోండి. అది కూడా కుదరకపోతే కొత్త మొబైల్ నంబర్‌ను జోడించండి తద్వారా మొబైల్ నంబర్ మీ ఖాతాతో అసోసియేట్ అవుతుంది.

ట్విట్టర్ బ్లూ వినియోగదారుల కోసం టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఫీచర్ దేశం, టెలికాం ఆపరేటర్‌ల వారీగా మారుతుంది.

2FA ఎందుకు ముఖ్యమైనది?
మీరు సాధారణంగా ఉపయోగించే అన్ని యాప్‌లలో కంపెనీ టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ సేవను అందిస్తుంది, తద్వారా మీ డేటా, ప్రైవసీకి రహస్యంగానే ఉంటుంది. మీరు కొత్త డివైస్‌లో లాగిన్ చేసినప్పుడు లేదా మీ స్వంత మొబైల్ ఫోన్‌లో మళ్లీ మీ ఖాతాను తెరిచినప్పుడు, ట్విట్టర్ లేదా ఏదైనా ఇతర యాప్ మీరు అదనపు భద్రతా కోడ్‌ను నమోదు చేయాల్సిన పాస్‌వర్డ్‌తో పాటు టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్  కోసం మిమ్మల్ని అడుగుతుంది.

ఇది మీ మెయిల్‌లో వస్తుంది లేదా మీరు ఏదైనా యాప్ ద్వారా లేదా టెక్స్ట్ మెసేజ్ ద్వారా ఖాతాను వెరిఫై చేయవచ్చు. ప్రతి ప్లాట్‌ఫారమ్ వివిధ మార్గాల్లో టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ సేవను అందిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఉపయోగించే టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్  పద్ధతిలో ఎక్కువ భాగం టెక్స్ట్ మెసేజ్ ఆధారితమైనది ఎందుకంటే ఇది చాలా సులభం. అయితే ఇప్పుడు ట్విటర్ దీన్ని ఉచిత సర్వీస్ నుంచి తొలగించబోతోంది.

ట్విట్టర్‌లో 2FA కోసం మూడు ఆప్షన్లు
Twitterలో ఇప్పటి వరకు టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్  కోసం మూడు ఆప్షన్లు అందించారు. వీటిలో మొదటిది టెక్స్ట్ మెసేజ్, రెండోది యాప్ ద్వారా. అంటే ఇక్కడ మీరు ట్రస్టెడ్ ద్వారా ఖాతాను ధృవీకరించాలి. ఇక మూడోది సెక్యూరిటీ కీ. అంటే ఒక కోడ్ అన్న మాట. ఆ పాస్‌వర్డ్ ద్వారా అకౌంట్‌ను సెక్యూర్ చేయవచ్చన్న మాట.

Published at : 18 Feb 2023 06:45 PM (IST) Tags: Tech News TWITTER Twitter 2FA

సంబంధిత కథనాలు

Nokia C12 Pro: రూ.ఏడు వేలలోపే నోకియా కొత్త ఫోన్ - ఫీచర్లు ఎలా ఉన్నాయో చూశారా?

Nokia C12 Pro: రూ.ఏడు వేలలోపే నోకియా కొత్త ఫోన్ - ఫీచర్లు ఎలా ఉన్నాయో చూశారా?

iQoo Z7 5G: భారతదేశం కోసం స్పెషల్ ఫోన్ లాంచ్ చేసిన ఐకూ - బడ్జెట్ 5జీ ఫోన్ ఇదే!

iQoo Z7 5G: భారతదేశం కోసం స్పెషల్ ఫోన్ లాంచ్ చేసిన ఐకూ - బడ్జెట్ 5జీ ఫోన్ ఇదే!

WhatsApp: మొబైల్ నంబర్ లేకుండానే వాట్సాప్ వాడొచ్చు, జస్ట్ ఈ ట్రిక్ ఉపయోగిస్తే చాలు?

WhatsApp: మొబైల్ నంబర్ లేకుండానే వాట్సాప్ వాడొచ్చు,  జస్ట్ ఈ ట్రిక్ ఉపయోగిస్తే చాలు?

Best Drones: ఫొటోగ్రఫీ కోసం డ్రోన్ కొనాలని అనుకుంటున్నారా? రూ.10 వేల లోపు లభించే బెస్ట్ డ్రోన్స్ ఇవే!

Best Drones: ఫొటోగ్రఫీ కోసం డ్రోన్ కొనాలని అనుకుంటున్నారా? రూ.10 వేల లోపు లభించే బెస్ట్ డ్రోన్స్ ఇవే!

Apple iPhone 12 Mini: రూ.22 వేలకే Apple iPhone 12 Mini కొనుగోలు చెయ్యొచ్చు, ఎలాగో తెలుసా?

Apple iPhone 12 Mini: రూ.22 వేలకే Apple iPhone 12 Mini కొనుగోలు చెయ్యొచ్చు, ఎలాగో తెలుసా?

టాప్ స్టోరీస్

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన గంటా, టీడీపీ గెలుస్తుందంటూ ధీమా

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన గంటా, టీడీపీ గెలుస్తుందంటూ ధీమా

KCR Tour: నేడు 4 జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన - పూర్తి షెడ్యూల్ ఇదీ

KCR Tour: నేడు 4 జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన - పూర్తి షెడ్యూల్ ఇదీ

New Contraceptive Tool: గర్భనిరోధకానికి కొత్త సాధనం - తెలుగు రాష్ట్రాల్లో అమలుకు ప్రయత్నాలు

New Contraceptive Tool: గర్భనిరోధకానికి కొత్త సాధనం - తెలుగు రాష్ట్రాల్లో అమలుకు ప్రయత్నాలు

NTR 30 Muhurtham : మృగాలను భయపెట్టే మగాడిగా ఎన్టీఆర్ - స్టోరీలైన్ చెప్పేసిన కొరటాల

NTR 30 Muhurtham : మృగాలను భయపెట్టే మగాడిగా ఎన్టీఆర్ - స్టోరీలైన్ చెప్పేసిన కొరటాల