Twitter Down: ట్విట్టర్ పిట్టకు ఏమైంది, సేవలు నిలిచిపోవడంతో యూజర్లు గగ్గోలు, సారీ చెప్పినా తగ్గలేదు !
Twitter Back online: ట్విట్టర్ సేవలు అందుబాటులో లేకపోవడంతో నెటిజన్లు గగ్గోలుపెట్టారు. దాదాపు లక్ష వరకు ఫిర్యాదులు ట్విట్టర్ సంస్థకు మెయిల్ రూపంలో ఇతర రూపంలో అందాయి.

Twitter Outage: గత కొన్ని నెలల నుంచి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు ఏదో ఓ సమయంలో మొరాయిస్తున్నాయి. సేవల్లో అంతరాయం తలెత్తుతోంది. శుక్రవారం రాత్రి మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ పనిచేయలేదు. ట్విట్టర్ సేవలు అందుబాటులో లేకపోవడంతో నెటిజన్లు గగ్గోలుపెట్టారు. దాదాపు లక్ష వరకు ఫిర్యాదులు ట్విట్టర్ సంస్థకు మెయిల్ రూపంలో ఇతర రూపంలో అందాయి. గత ఏడాది ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్ సేవలు నిలిచిపోగా నెటిజన్లు మొత్తం ఒక్కసారిగా ట్విట్టర్‌కు వచ్చేసి ట్వీట్లు చేశారు. కొందరు నెటిజన్లు ట్విట్టర్ వేదికగా ఇతర సోషల్ మీడియా సర్వీసులపై ట్రోల్ చేశారు.
భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 11 గంటల తరువాత ట్విట్టర్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. దాదాపు గంట సమయం దేశంలో ట్విట్టర్ పనిచేయలేదు. నెటిజన్ల నుంచి ఫిర్యాదులు అందిన వెంటనే ట్విట్టర్ సంస్థ స్పందించింది. సాంకేతిక సమస్యలు (Twitter Down With Technical Issue) తలెత్తడంతో ట్విట్టర్ సేవలకు అంతరాయం తలెత్తిందని తెలిపింది. తమ వల్ల కలిగిన ఈ అసౌకర్యానికి యూజర్లకు క్షమాపణ చెబుతూ ట్టిట్టర్ సపోర్ట్ అధికారిక ఖాతా నుంచి ట్వీట్ చేసింది. టెక్నికల్ ప్రాబ్లమ్‌ను రెక్టిఫై చేశాం, ఇక మీరు ఏ ఇబ్బంది లేకుండా ట్వీట్లు చేసుకోవచ్చునని ట్విట్టర్ ఓ ప్రకటనలో తెలిపింది.
We’ve fixed a technical bug that was preventing timelines from loading and Tweets from posting. Things should be back to normal now. Sorry for the interruption!
— Twitter Support (@TwitterSupport) February 11, 2022
శుక్రవారం ఉదయం ఎయిర్ టెల్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోతే యూజర్లు ఎలా గగ్గోలుపెట్టారో.. రాత్రి ట్విట్టర్ పనిచేయని సమయంలోనూ దాదాపు అలాంటి పరిస్థితి కనిపించింది. మొబైల్, డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్ లోనూ ట్విట్టర్ సడన్‌గా డౌన్ అయింది. దాదాపు రాత్రి పదకొండు గంటల నుంచి 50 నిమిషాల పాటు సేవలు నిలిచిపోయాయి. ట్వీట్లు చేస్తుంటే మధ్యలోనే ఆగిపోయిందని కొందరు , ట్విట్టర్ లాగిన్ కావడం లేదని మరికొందరు యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్విట్టర్ సేవలు అందుబాటులోకి వచ్చిన తరువాత యూజర్లు ట్విట్టర్‌ను ట్రోల్ చేస్తూ పోస్టులు చేశారు.
Also Read: Samsung Galaxy S22 Series: శాంసంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్ ప్రీ-ఆర్డర్లు ప్రారంభం, కేవలం రూ.1,999కే!
Also Read: OnePlus Nord CE 2 5G: వన్‌ప్లస్ బడ్జెట్ ఫోన్ వచ్చేది ఆరోజే.. తక్కువ ధరలోనే బ్రాండెడ్ ఫోన్!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

