News
News
X

Twitter Down: రెండు గంటల పాటు పని చేయని ట్విట్టర్, మస్క్‌తో ఆటాడుకున్ననెటిజన్స్

ఇవాళ ఉదయం ప్రపంచ వ్యాప్తంగా ట్విట్టర్ సేవలకు అంతరాయం కలిగింది. సుమారు 2 గంటల పాటు లాగిన్ సమస్య తలెత్తింది. వెంటనే ట్విట్టర్ సమస్యను సరిద్దింది.

FOLLOW US: 
Share:

సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ట్విట్టర్ లో లాగిన్ సమస్య తలెత్తింది. ఇవాళ ఉదయం సుమారు రెండు గంటల పాటు వినియోగదారులు లాగిన్ కాలేకపోయారు. సైన్ ఇన్ చేస్తే ఎర్రర్ చూపించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వినియోగదారులు ఈ సమస్యను ఎదుర్కొన్నారు.  

రెండు గంటల వ్యవధిలోనే సమస్య పరిష్కారం

ట్విట్టర్ ఈ సమస్యను వెంటనే పరిష్కరించింది. లోపం ఎక్కడుందో తెలుసుకుని సుమారు రెండు గంటల వ్యవధిలోనే ట్విట్టర్ టెక్ నిపుణులు ప్లాబ్లమ్ సాల్వ్ చేశారు. సమస్య పరిష్కారం కాగానే వినియోగదారులు యథావిధిగా లాగిన్ అయ్యారు. అప్పటికే ట్విట్టర్ అకౌంట్లో లాగిన్ కాలేకపోతున్నామంటూ ప్రపంచ వ్యాప్తంగా ట్విట్టర్ కు వేల సంఖ్యలో రిపోర్టులు అందాయి. భారత్, అమెరికా, జపాన్, కెనడా నుంచి ఎక్కువగా కంప్లైంట్స్ వెళ్లాయి.  సమస్య పరిష్కారం అయ్యాక మస్క్ స్పందించారు. ట్విట్టర్ సర్వర్ ప్రాబ్లం తొలగిపోయిందని చెప్పారు. గతంతో పోల్చితే ట్విట్టర్ మరింత ఫాస్ట్ గా పనిచేస్తున్నట్లు వెల్లడించారు.

ట్విట్టర్ సీఈవో పై నెటిజన్ల ఆగ్రహం

రెండు గంటల్లోనే ట్విట్టర్ సేవలు యథావిధిగా కొనసాగినా నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మీమ్స్ తో మస్క్ మామను ఆడుకున్నారు. వాస్తవానికి ట్విట్టర్ మస్క్ చేతికి వెళ్లిన తర్వాత ట్విట్టర్ సేవలకు అంతరాయం కలగడం ఇది మూడోసారి. ఈ నెలలో ఇది రెండోసారి కావడం విశేషం. ఈ నేపథ్యంలో నెటిజన్లు మీమ్స్ తో ట్విట్టర్ సీఈవో ఆటపట్టించారు. ట్విట్టర్ ను కొనుగోలు చేయడం మాత్రమే కాదు, సరిగా మెయింటెయిన్ చేయడం నేర్చుకోవాలని మరికొంత మంది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.  

Published at : 29 Dec 2022 04:04 PM (IST) Tags: Twitter Down Twitter Users Twitter Notifications Twitter sign in

సంబంధిత కథనాలు

Twitter Ad Revenue Share: ట్విట్టర్ ద్వారా సంపాదన కూడా - కానీ అది మాత్రం కంపల్సరీ!

Twitter Ad Revenue Share: ట్విట్టర్ ద్వారా సంపాదన కూడా - కానీ అది మాత్రం కంపల్సరీ!

Samsung Galaxy Unpacked 2023: 200 మెగాపిక్సెల్ కెమెరాతో శాంసంగ్ ఫోన్ - అదిరిపోయే స్మార్ట్ ఫోన్ సిరీస్!

Samsung Galaxy Unpacked 2023: 200 మెగాపిక్సెల్ కెమెరాతో శాంసంగ్ ఫోన్ - అదిరిపోయే స్మార్ట్ ఫోన్ సిరీస్!

WhatsApp New Features: సూపర్ ఆప్షన్స్‌తో టెక్స్ట్ ఎడిటర్, త్వరలో వాట్సాప్ నుంచి సరికొత్త ఫీచర్!

WhatsApp New Features: సూపర్ ఆప్షన్స్‌తో టెక్స్ట్ ఎడిటర్,  త్వరలో వాట్సాప్ నుంచి సరికొత్త ఫీచర్!

Netflix: పాస్‌వర్డ్ షేరింగ్‌ను నిలిపివేయనున్న నెట్‌ఫ్లిక్స్ - ఎలా కనిపెడతారో చెప్పేసిన స్ట్రీమింగ్ కంపెనీ!

Netflix: పాస్‌వర్డ్ షేరింగ్‌ను నిలిపివేయనున్న నెట్‌ఫ్లిక్స్ - ఎలా కనిపెడతారో చెప్పేసిన స్ట్రీమింగ్ కంపెనీ!

Budget 2023: స్మార్ట్ ఫోన్లు, కెమెరా లెన్స్‌లు కొనాలనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్ - మరింత చవకగా!

Budget 2023: స్మార్ట్ ఫోన్లు, కెమెరా లెన్స్‌లు కొనాలనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్ - మరింత చవకగా!

టాప్ స్టోరీస్

Government Websites Hacked: ప్రభుత్వ వెబ్‌సైట్‌లను టార్గెట్ చేస్తున్న హ్యాకర్లు,అలెర్ట్ అవుతున్న అధికారులు

Government Websites Hacked: ప్రభుత్వ వెబ్‌సైట్‌లను టార్గెట్ చేస్తున్న హ్యాకర్లు,అలెర్ట్ అవుతున్న అధికారులు

Amigos Pre Release - NTR Jr : అన్నయ్య కోసం వస్తున్న ఎన్టీఆర్ - రేపే కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ప్రీ రిలీజ్

Amigos Pre Release - NTR Jr : అన్నయ్య కోసం వస్తున్న ఎన్టీఆర్ - రేపే కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ప్రీ రిలీజ్

Pawan Kalyan Latest Stills : 'హరి హర వీర మల్లు' సెట్స్‌లో పవన్ కళ్యాణ్ నవ్వులు చూశారా?

Pawan Kalyan Latest Stills : 'హరి హర వీర మల్లు' సెట్స్‌లో పవన్ కళ్యాణ్ నవ్వులు చూశారా?

Leo Movie Shooting: దళపతి ‘లియో’లో ఏజెంట్ టీనా కీలక పాత్ర, చిత్ర బృందంతో స్పెషల్ ఫ్లైట్ లో కశ్మీర్ కు పయనం!

Leo Movie Shooting: దళపతి ‘లియో’లో ఏజెంట్ టీనా కీలక పాత్ర, చిత్ర బృందంతో స్పెషల్ ఫ్లైట్ లో కశ్మీర్ కు పయనం!