Best 55 inch Smart TV: అమెజాన్‌లో బెస్ట్ 55 అంగుళాల టీవీలు - రెడ్‌మీ నుంచి సోనీ వరకు!
Amazon TV Offers: మనదేశంలో స్మార్ట్ టీవీలపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మంచి 55 అంగుళాల టీవీలు చూడవచ్చు. వీటిలో రెడ్‌మీ నుంచి సోనీ వరకు చాలా టీవీలు ఉన్నాయి.
Best 55 inch Smart TV in Amazon: భారత మార్కెట్లో స్మార్ట్ టీవీలకు డిమాండ్ వేగంగా పెరిగింది. ఇప్పుడు ప్రజలు స్మార్ట్‌ఫోన్‌లతో పాటు తమ ఇళ్లలో స్మార్ట్ టీవీలను చూడటానికి ఇష్టపడుతున్నారు. స్మార్ట్ టీవీలు మార్కెట్‌లో ప్రతి సైజులో అందుబాటులో ఉన్నాయి. ఈ ఎపిసోడ్‌లో మనం మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉన్న 55 అంగుళాల స్మార్ట్ టీవీల గురించి తెలుసుకుందాం. ఈ-కామర్స్ సైట్ అమెజాన్‌లో అనేక 55 అంగుళాల స్మార్ట్ టీవీలపై భారీ తగ్గింపు ధరలు అందుబాటులో ఉన్నాయి. ఈ జాబితాలో రెడ్‌మీ నుంచి సోనీ వరకు టీవీలు ఉన్నాయి.
రెడ్‌మీ 55 అంగుళాల ఎఫ్ సిరీస్ అల్ట్రా హెచ్‌డీ 4కే స్మార్ట్ ఎల్ఈడీ ఫైర్ టీవీ (Redmi 55 inch F Series UHD 4K Smart LED Fire TV)
ఈ టీవీ వాస్తవ ధర రూ. 54,999గా ఉంది. కానీ అమెజాన్‌లో ఈ టీవీపై 35 శాతం తగ్గింపు అందిస్తున్నారు. మీరు దీన్ని కేవలం రూ. 35,999కి కొనుగోలు చేయవచ్చు. 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉన్న 4కే అల్ట్రా HD డిస్‌ప్లేను ఇందులో అందించనున్నారు.
డ్యూయల్ బ్యాండ్ వైఫై, రెండు హెచ్‌డీఎంఐ పోర్ట్‌లు, రెండు యూఎస్‌బీ పోర్ట్‌లు, బ్లూటూత్ 5.0, ఈథర్‌నెట్, 3.5 ఎంఎం ఇయర్‌ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. డాల్బీ ఆడియో, డీటీఎస్ వర్చువల్: ఎక్స్, 30W సౌండ్ అవుట్‌పుట్‌ను అందించే డీటీఎస్-హెచ్‌డీ సౌండ్ టెక్నాలజీ.
Also Read: వన్‌ప్లస్ 11ఆర్ 5జీపై భారీ ఆఫర్ - ఏకంగా రూ.8 వేల వరకు తగ్గింపు!
టీసీఎల్ 55 అంగుళాల మెటాలిక్ బెజెల్ లెస్ స్మార్ట్ ఎల్ఈడీ గూగుల్ టీవీ (TCL 55 inches Metallic Bezel-Less Smart LED Google TV)
ఈ స్మార్ట్ టీవీ అసలు ధర రూ.77,990. కానీ అమెజాన్‌లో ఈ టీవీ కేవలం 31,990 రూపాయలకే అందుబాటులో ఉంది. అంటే దీనిపై 59 శాతం తగ్గింపు అందించనున్నారన్న మాట. 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్‌తో స్మూత్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించనుంది. 64 బిట్ క్వాడ్ కోర్ ప్రాసెసర్‌తో ఈ టీవీ పని చేయనుంది.
డ్యూయల్ బ్యాండ్ వైఫై, స్క్రీన్ మిర్రరింగ్‌లు కూడా ఇందులో ఉన్నాయి. గూగుల్ అసిస్టెంట్, ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, ఇతర స్ట్రీమింగ్ సర్వీసులను సపోర్ట్ చేయనుంది. ఈ టీవీపై రెండు సంవత్సరాల వారంటీని అందించనున్నారు. 4కే అల్ట్రా హెచ్‌డీ ప్యానెల్‌ను ఇందులో అందించారు.
సోనీ బ్రేవియా 55 అంగుళాల 4కే అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ ఎల్ఈడీ గూగుల్ టీవీ (Sony Bravia 55 inches 4K Ultra HD Smart LED Google TV)
ఈ సోనీ స్మార్ట్ టీవీ ఎమ్మార్పీ రూ. 99,900గా ఉంది. కానీ అమెజాన్‌లో ఈ టీవీపై 42 శాతం తగ్గింపు అందించారు. డిస్కౌంట్ తర్వాత ఈ టీవీని కేవలం రూ. 57,990కి కొనుగోలు చేయవచ్చు. సెట్ టాప్ బాక్స్, బ్లూ రే ప్లేయర్, గేమింగ్ కన్సోల్‌లను కనెక్ట్ చేయడానికి మూడు హెచ్‌డీఎంఐ పోర్ట్‌లు ఉన్నాయి. గూగుల్ టీవీ, వాచ్‌లిస్ట్, ఓకే గూగుల్, గూగుల్ ప్లే, క్రోమ్‌కాస్ట్, బిల్ట్ ఇన్ మైక్‌లను అందించారు. సోనీ బ్రేవియా దాని ప్రీమియం లుక్స్, అద్భుతమైన ఫీచర్లకు మంచి పేరు పొందింది.
Also Read: ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఆండ్రాయిడ్ ఫోన్లు - టాప్ మోడల్ రేటెంతో తెలుసా?