అన్వేషించండి

Smartphone Privacy: ఏదైనా కొనాలనుకోగానే యాడ్ ఫోన్‌లో కనిపిస్తుందా? - అయితే ఈ సెట్టింగ్స్ ఆఫ్ చేయండి!

Smartphone Privacy Tips: స్మార్ట్ ఫోన్‌లో కొన్ని సార్లు మనం ఏదైనా కొనాలని అనుకోగానే దానికి సంబంధించిన యాడ్స్ ప్రత్యక్షం అవ్వడం చూడవచ్చు. అది ప్రైవసీ సమస్య.

Smartphone Privacy Problems: కొన్ని సార్లు మనం ఏదైనా వస్తువు కొనాలని నిర్ణయించుకున్నప్పుడు లేదా దాని గురించి ఎవరికైనా చెప్పినప్పుడు, ఆ ప్రొడక్ట్‌కు సంబంధించిన ప్రకటనలు ఫోన్‌లలో కనిపించడాన్ని మీరు చాలాసార్లు గమనించి ఉండవచ్చు. మన ఫోన్ ద్వారా మనం మాట్లాడుకునే మాటలను ఎవరైనా వింటున్నారా అనేది మన మదిలో వచ్చే మొదటి ప్రశ్న. స్మార్ట్ ఫోన్లలో ఉండే మైక్రోఫోన్‌లు వినియోగదారులపై 24 గంటలు స్పైయింగ్ చేస్తున్నారని ఒక నివేదికలో బయటకు వచ్చింది.

కొన్ని సార్లు మీరు ఫోన్‌లో సెర్చ్ చేయని ఉత్పత్తుల ప్రకటనలు సోషల్ మీడియాలో కనిపించడం తరచుగా జరుగుతుంది. ఈ నివేదిక ప్రకారం ఇటువంటి ప్రకటనలు స్మార్ట్ గాడ్జెట్‌ల సహాయంతో మీకు కనిపిస్తాయి. అవి మీరు చెప్పేది వింటాయి. యాడ్ ఏజెన్సీలు ఇటువంటి వాటిని లక్ష్యంగా చేసుకుంటాయి.

ఇలా ఎందుకు జరుగుతుంది?
కాక్స్ మీడియా గ్రూప్ కథనం ప్రకారం స్మార్ట్‌ఫోన్‌లు మాత్రమే కాకుండా, మైక్రోఫోన్‌లను కలిగి ఉన్న టీవీలు లేదా స్పీకర్‌లు కూడా వ్యక్తుల సంభాషణలను వింటాయి. ఇవి మీరు మాట్లాడుకునే మాటలను వింటాయి. ఆపై మీకు సంబంధించిన డేటా బ్యాంక్ రెడీ అవుతుంది. ఈ డేటా కారణంగానే మీరు రియల్ టైమ్ యాడ్స్‌ను చూడటం ప్రారంభిస్తారు. ఇంటర్నల్ మైక్రోఫోన్ కారణంగా మీ వీకెండ్ ప్లాన్స్ నుంచి ఫ్యూచర్ ప్లాన్స్ వరకు మీరు చెప్పే ప్రతిదాన్ని మీ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ వింటోంది.

Read Also: ఎండలతో సతమతమవుతున్న జనాలకు కూల్ న్యూస్, సోనీ నుంచి సరికొత్త పాకెట్ ఏసీ వచ్చేస్తోంది!

స్మార్ట్ టీవీలో వాయిస్ కమాండ్‌ల వల్ల కూడా ఇది కనిపిస్తుంది. వాయిస్ కమాండ్ అంటే మీరు మాట్లాడటం ద్వారా టీవీలో ఏదైనా సెర్చ్ చేయవచ్చు. ఇది టీవీలో ఉన్న మైక్రోఫోన్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అనుమతి లేకుండా ఏ పరికరం మైక్రోఫోన్‌ను ఉపయోగించదని గూగుల్, యాపిల్ పేర్కొన్నాయి. మీ డివైస్ మైక్రోఫోన్‌ని యాక్టివేట్ చేసినప్పుడల్లా స్టేటస్ బార్‌లో ఐకాన్ కనిపిస్తుందని, దానికి మీ అనుమతి అవసరమని గూగుల్ ఒక ప్రకటనలో తెలిపింది.

మీ పర్మిషన్ లేకుండా ఐఫోన్ లేదా ఐప్యాడ్ మైక్రోఫోన్ లేదా కెమెరాను ఏ యాప్ యాక్సెస్ చేయలేదని కూడా యాపిల్ పేర్కొంది. ఐవోఎస్, ఐప్యాడ్ఓఎస్ అన్ని వెర్షన్‌లలో యాప్స్ మైక్రోఫోన్ లేదా కెమెరాను ఉపయోగించినప్పుడు మీకు ప్రాంప్ట్ కనిపిస్తుంది.

దీని నుంచి ఎలా తప్పించుకోగలం?
ఆండ్రాయిడ్ యూజర్లు ముందుగా మీ ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి సెక్యూరిటీ అండ్ ప్రైవసీ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. దీని తర్వాత మళ్లీ ప్రైవసీ ఆప్షన్‌లోకి వెళ్లాలి. ఇక్కడ మీరు మైక్రోఫోన్, కెమెరా, ఇతర సెన్సార్ల గురించి సమాచారాన్ని పొందుతారు. మీరు ఏ యాప్‌కు పర్మిషన్ ఇచ్చారో తెలుసుకోవచ్చు. ఈ పర్మిషన్‌ను బ్లాక్ చేయవచ్చు లేదా తీసివేయవచ్చు.

ఐవోఎస్‌లో సెక్యూరిటీ అండ్ ప్రైవసీ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. ఇక్కడ మీరు మైక్రోఫోన్ లేబుల్‌ని చూస్తారు. దానిపై క్లిక్ చేయడం ద్వారా మీరు మైక్రోఫోన్ యాక్సెస్ ఏ యాప్‌కు అయితే వద్దనుకుంటున్నారో ఆ యాప్‌కు తీసేయవచ్చు.

Read Also: ‘మదర్స్ డే’ గిఫ్ట్ ఐడియాస్ - ఈ మ్యూజిక్ గ్యాడ్జెట్స్‌తో అమ్మను సర్ ప్రైజ్ చెయ్యండి!

టాప్ హెడ్ లైన్స్

iPhone 3 Whats App Accounts: ఐఫోన్ వాట్సాప్ యూజర్లకు బిగ్ అప్‌డేట్.. ఒకే యాప్‌లో 3 వాట్సాప్ అకౌంట్స్!
ఐఫోన్ వాట్సాప్ యూజర్లకు బిగ్ అప్‌డేట్.. ఒకే యాప్‌లో 3 వాట్సాప్ అకౌంట్స్!
Apple iPhone 18 Pro Sales EMI: ఐఫోన్ 18 ప్రో, 18 ప్రో మ్యాక్స్ సేల్స్ షురూ.. EMI, క్యాష్‌బ్యాక్ వివరాలు ఇవే!
ఐఫోన్ 18 ప్రో, 18 ప్రో మ్యాక్స్ సేల్స్ షురూ.. EMI, క్యాష్‌బ్యాక్ వివరాలు ఇవే!
Laptop Keyboard Cleaning : ల్యాప్‌టాప్ కీబోర్డ్ క్లీన్ చేయాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి
ల్యాప్‌టాప్ కీబోర్డ్ క్లీన్ చేయాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి
భారత్‌లో iPhone 18 సేల్స్ ప్రారంభం.. అర్ధరాత్రి నుంచే యాపిల్ సెంటర్ల వద్ద భారీ క్యూ లైన్లు
భారత్‌లో iPhone 18 సేల్స్ ప్రారంభం.. అర్ధరాత్రి నుంచే యాపిల్ సెంటర్ల వద్ద భారీ క్యూ లైన్లు

వీడియోలు

Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం
Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Janasena Politics: జనసేన సంస్థాగతంగా బలంగా లేదు.. కూటమిలో ఇబ్బందులు సహజం..! నాదెండ్ల మనోహర్
జనసేన సంస్థాగతంగా బలంగా లేదు.. కూటమిలో ఇబ్బందులు సహజం..! నాదెండ్ల మనోహర్
KTR Janwada Farmhouse: నాలా కబ్జా చేసి జన్వాడ ఫామ్‌హౌస్‌ కట్టారు, హైడ్రా చర్యలు తీసుకోవాలి: ఎంపీ చామల
నాలా కబ్జా చేసి జన్వాడ ఫామ్‌హౌస్‌ కట్టారు, హైడ్రా చర్యలు తీసుకోవాలి: ఎంపీ చామల
CM Chandrababu In Vizag: పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు, 28,445 కుటుంబాలకు లబ్ధి
పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు, 28,445 కుటుంబాలకు లబ్ధి
Dorothy Trailer: మగాళ్ళు ఏడ్చారు... కీర్తీ సురేష్ ఎంట్రీతో ఫ్రెండ్స్ మధ్య గొడవ - తమిళ్ సినిమా 'డోరతీ' ట్రైలర్ రివ్యూ
మగాళ్ళు ఏడ్చారు... కీర్తీ సురేష్ ఎంట్రీతో ఫ్రెండ్స్ మధ్య గొడవ - తమిళ్ సినిమా 'డోరతీ' ట్రైలర్ రివ్యూ
MS Subbulakshmi: భారతరత్న అందుకున్న తొలి కర్ణాటక సంగీతకారిణి... భర్త మరణంతో కచేరీలు ఫుల్ స్టాప్... ఎవరీ ఎంఎస్ సుబ్బలక్ష్మి?
భారతరత్న అందుకున్న తొలి కర్ణాటక సంగీతకారిణి... భర్త మరణంతో కచేరీలు ఫుల్ స్టాప్... ఎవరీ ఎంఎస్ సుబ్బలక్ష్మి?
iPhone 3 Whats App Accounts: ఐఫోన్ వాట్సాప్ యూజర్లకు బిగ్ అప్‌డేట్.. ఒకే యాప్‌లో 3 వాట్సాప్ అకౌంట్స్!
ఐఫోన్ వాట్సాప్ యూజర్లకు బిగ్ అప్‌డేట్.. ఒకే యాప్‌లో 3 వాట్సాప్ అకౌంట్స్!
Viral Video: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన కానిస్టేబుల్.. హైదరాబాద్‌లో దారుణం
మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన కానిస్టేబుల్.. హైదరాబాద్‌లో దారుణం
Romantic Comedy OTT : సాయంత్రం 6 తర్వాత లవర్‌ను చూడకూడదు - ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ... తెలుగులోనూ స్ట్రీమింగ్
సాయంత్రం 6 తర్వాత లవర్‌ను చూడకూడదు - ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ... తెలుగులోనూ స్ట్రీమింగ్
Embed widget