Dating APP: యూత్ కోసం టిండర్ సూపర్ అప్డేట్, సేఫ్టీకి ప్రయారిటీ, గ్రీన్ ప్లాగ్ క్వాలిటీస్‌తో ప్రో డేటింగ్
Dating APP:యూత్ కోసం టిండర్ సూపర్ అప్డేట్ తీసుకొచ్చింది. భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ గ్రీన్ ప్లాగ్ క్వాలిటీస్ యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.

Dating APP: ఇంటర్నెట్లో సేఫ్‌గా ఓ జోడిని వెతుకుదామనుకుంటున్నారా? ఇప్పటికే చాలా డేటింగ్ యాప్స్ యూజ్ చేశావా? ఆల్రెడీ టిండర్ ఉపయోగిస్తున్నావా? మీ కోసం ఓ అదిరిపోయే న్యూస్ తెచ్చేసింది టిండర్. ప్రస్తుతమున్న సాంకేతిక మాయాజాలంలో తెలియని వారితో డేట్ చేయాలంటే సేఫ్టీ అవసరం. ఇలాంటి తరుణంలో మీ సేఫ్టీ మాకు ముఖ్యమంటోంది టిండర్. ఇందుకోసం సెంటర్ ఫర్ సోషల్ రీసెర్చ్ తో కలిసి డేటింగ్ సేఫ్టీ గైడ్నుతీసుకువచ్చింది. హిందీ, మరాఠీ, కన్నడ, బెంగాలీలో అందుబాటులో ఉంది. బెంగళూరులో చాయ్ డేట్ వెళ్లాలన్నా... ముంబైలో వడపావ్ మీట్ సెట్ చేయాలన్నా.. సింపుల్ అండ్ సేఫ్ గా టిండర్ ను ఉపయోగించవచ్చని చెబుతోంది.
సెఫ్టీకి ఎందుకు ప్రాధాన్యత
దేశంలో యువత ఎలాంటి ఇబ్బంది లేకుండా ఓ సూపర్ జోడీ కోసమే వెతుకుతోంది. తన పార్ట్ నర్‌ను కలిసే ముందే సెఫ్టీ అండ్ సెక్యూరిటీని చూసుకుంటున్నారని టిండర్ యాప్ సర్వేలో తేలింది. ఇక 37 శాతం మంది తన మ్యాచ్ తో వీడియో కాల్ మాట్లాడిన తర్వాతే ఫస్ట్ డేట్ ను లాక్ చేసుకుంటున్నారని గుర్తించింది టిండర్.
ఇప్పుడు డేటింగ్ సేఫ్టీ గైడ్ ను వివిధ భాషల్లో తీసుకురావడం ద్వారా టిండర్ యూజర్స్ కు డేటింగ్ టిప్స్ ఇవ్వనుంది. పక్కా కాన్ఫిడెన్సియల్‌గా మీ డేట్‌తో మాట్లాడటాన్ని మరింత ఈజీ చేస్తోంది. ఇక సీఎస్ఆర్ మీరు ఎలాంటి టిప్స్ ఫాలో కావాలో మిమ్మల్ని గైడ్ చేయనుంది.
అసలు టిండర్ గైడ్ లో ఏముంది?
రెడ్ ఫ్లాగ్స్ వర్సెస్ గ్రీన్ ఫ్లాగ్స్: మీ మ్యాచ్ ప్రవర్తన ఎలా ఉంటుందో ముందుగానే పసిగట్టే అవకాశం ఉంది. అసలు నిజంగా ఇంట్రెస్ట్ ఉందా అనే విషయాన్ని ఓ బెస్ట్ ఫ్రెండ్ మాదిరిగా మిమ్నల్ని గైడ్ చేస్తోంది.
కన్సెంట్ 101: డేట్ కి అనుమతి అనేది ముఖ్యం. కుదరదు అని చెప్పారంటే దాని అర్థం అస్సలు కుదరదని..ఒకవేళ ఎస్ చెప్పారంటే ఉత్సాహంతో ముందుకు వెళ్లొచ్చు. దీనికి టిండర్ గైడ్ అనుమతి ఎంత అవసరమో చెబుతోంది. ఇక మీరు మరింత లోతుగా డైవ్ చేయాలంటి కర్సెరా కోర్సు ఉంది.
స్మార్ట్ సేఫ్టీ టూల్స్ : మ్యాచ్ పెట్టిన ప్రొఫైల్ పిక్ కరెక్టేనా అని తెలుసుకోవాలంటే టిండర్ ఫొటో వెరిఫికేషన్ ఆప్షన్ ఇస్తోంది. ఒక వేళ మ్యాచ్ మీకు నచ్చలేదా సింపుల్ గా అన్ మ్యాచ్ చేయుచ్చు.
Also Read: 2024లో ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్ ఇదే - టాప్ 10 జాబితా ఇదే
కంప్లైంట్స్ : యాప్‌లో ఏదైనా సరిగా లేదని మీరు ఫీల్ అయితే... ఈజీగా కంప్లైంట్ చేసేందుకు గైడ్ ఉపయోగపడుతోంది.
టిండర్ గ్రీన్ ఫ్లాగ్స్ ఏంటి?
- మీ కోసం సమయం కేటాయించేవారు.
- ఓపెన్ మైండ్ తో మీకు నమ్మకం కలిగించేవాళ్లు
- చిన్న చిన్న విషయాలను గుర్తుపెట్టుకొనేవారు
- హద్దుల గురించి మొహమాటం లేకుండా మాట్లాడేవాళ్లు
- ఆసక్తికరంగా మీతో ముచ్చటించే వ్యక్తులు
- ఏం కోరుకుంటున్నారో నిజాయితీగా చెప్పేవ్యక్తులు
- మిమ్మల్ని పూర్తి కంఫర్టబుల్గా ఉంచేవారు
ఇక ఈ మార్పులను టిండర్ ఈ ఫిబ్రవరి నుంచే అందుబాటులోకి తెచ్చింది. మరి లేట్ ఎందుకు అసలు ఇందులో ఏముందో ఓసారి మీరు చూడండి.
Also Read: డేటా లేకుండా కేవలం కాల్స్, మెసేజ్‌ల కోసం Airtel, Jio, Vi, BSNL అందించే ప్లాన్‌లలో ఏది బెటర్?





















