Threads App: సెంచరీ కొట్టిన థ్రెడ్స్ - కేవలం ఐదు రోజుల్లోనే!
థ్రెడ్స్ యాప్ 100 మిలియన్ యూజర్ల మైలురాయిని దాటింది.
మెటా ఇటీవల ప్రారంభించిన థ్రెడ్స్ యాప్ నిరంతరం వార్తల్లో ఉంటూ వస్తుంది. దీని వినియోగదారుల సంఖ్య కూడా చాలా వేగంగా పెరుగుతోంది. తాజా గణాంకాల ప్రకారం థ్రెడ్స్ వినియోగదారుల సంఖ్య 100 మిలియన్లను దాటింది.
ట్విట్టర్‌కు చెక్ పెడుతున్న థ్రెడ్స్
థ్రెడ్స్ యాప్ ట్విట్టర్‌కు అతి పెద్ద పోటీదారుగా మారుతోంది. గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌ల నుంచి థ్రెడ్స్ యాప్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. థ్రెడ్స్ కారణంగా ట్విట్టర్ ట్రాఫిక్ మీద భారీ ప్రభావం పడింది. ట్విట్టర్ ట్రాఫిక్ కొంచెంగా తగ్గడం ప్రారంభం అయింది.
ఒకేసారి 100 దేశాల్లో...
గత వారం 100 దేశాలలో ఆండ్రాయిడ్, ఐవోఎస్ యూజర్ల కోసం థ్రెడ్స్ యాప్‌ను మెటా లాంచ్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్స్‌లో కనిపించే బ్యాడ్జ్‌ల సంఖ్య ఆధారంగా చూస్తే థ్రెడ్స్ యాప్ ఇప్పటికే 100 మిలియన్ యూజర్ల మార్కును దాటేసింది.
ఈ కొత్త యాప్ లాంచ్ అయిన రెండు గంటల్లోనే 2 మిలియన్ల యూజర్లను దక్కించుకుంది. ఇక కేవలం ఏడు గంటల్లో 10 మిలియన్ మార్కును కూడా దాటేసింది. అలాగే కేవలం 12 గంటల్లో 30 మిలియన్ల యూజర్‌లను చేరుకుంది.
ట్విట్టర్ డొమైన్ నేమ్ సిస్టమ్ (డీఎన్ఎస్) ర్యాంకింగ్ జనవరి నుంచి క్షీణిస్తుందని ఐటీ సర్వీస్ మేనేజ్‌మెంట్ కంపెనీ క్లౌడ్‌ఫ్లేర్ సీఈవో మాథ్యూ ప్రిన్స్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కాబట్టి దీని మీద థ్రెడ్స్ ఎఫెక్ట్ భారీగా పడే ఎఫెక్ట్ ఉంది.
వార్తల ప్రకారం, IT సర్వీస్ మేనేజ్‌మెంట్ కంపెనీ క్లౌడ్‌ఫ్లేర్ యొక్క CEO మాథ్యూ ప్రిన్స్ ఆదివారం ట్విట్టర్ యొక్క డొమైన్ నేమ్ సిస్టమ్ (DNS) ర్యాంకింగ్‌ను జనవరి నుండి క్షీణిస్తున్నట్లు చూపించే గ్రాఫ్‌ను ట్వీట్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మోస్సేరి గత వారం ట్విట్టర్‌కు థ్రెడ్స్ యాప్ ఆల్టర్నేటిక్ కాదని స్పష్టం చేశారు. ట్విట్టర్‌ను ఉపయోగించని యూజర్ల కోసం థ్రెడ్స్ యాప్‌ను క్రియేట్ చేశామని తెలిపారు.
థ్రెడ్స్ యాప్‌లో ప్రస్తుతం డైరెక్ట్ మెసేజ్‌లు, ఫాలోయింగ్ ఫీడ్, పూర్తి వెబ్ వెర్షన్, క్రోనాలాజికల్ ఫీడ్ వంటి మరెన్నో ఫీచర్లు థ్రెడ్స్‌లో ప్రస్తుతానికి అందుబాటులో లేవు. కానీ ఆ ఫీచర్లన్నీ థ్రెడ్స్ యాప్‌లో త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
View this post on Instagram
✨ Threads is here – a new app where you can share updates and join convos ✨
— Instagram (@instagram) July 5, 2023
Use your Instagram account to log in and get started 🎉 https://t.co/eEyTigO7WB pic.twitter.com/mCNsx33ZVg
Read Also: ట్విట్టర్ చరిత్రలోనే అత్యధిక వ్యూస్ పొందిన మస్క్ ట్వీట్ - ఎంత రీచ్ వచ్చింది?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial