By: ABP Desam | Updated at : 05 Feb 2022 02:52 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
టెక్నో పోవా 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో త్వరలో లాంచ్ కానుంది.
టెక్నో మనదేశంలో తన మొట్టమొదటి 5జీ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయనుంది. అదే టెక్నో పోవా 5జీ. ఈ ఫోన్ మనదేశంలో వచ్చేవారం లాంచ్ కానున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ ఫోన్ అమెజాన్‌లో అందుబాటులో ఉండనుంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ట్విట్టర్‌లో ప్రకటించింది.
ఈ ఫోన్ ధర రూ.18 వేల నుంచి రూ.20 వేల మధ్యలో ఉండనుంది. ఈ విషయాన్ని ట్రాన్సిషన్ ఇండియా సీఈవో అరిజీత్ తలపాత్రా స్వయంగా ప్రకటించారు.
టెక్నో పోవా 5జీ స్పెసిఫికేషన్లు
ఈ ఫోన్ ఇప్పటికే నైజీరియాలో లాంచ్ అయింది. కాబట్టి స్పెసిఫికేషన్ల విషయంలో ఎలాంటి సీక్రసీ లేదు. ఆండ్రాయిడ్ 11 ఆధారిత హైఓఎస్ 8.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.95 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గానూ, స్క్రీన్ టు బాడీ రేషియో 82.8 శాతంగానూ ఉంది. దీని స్క్రీన్ రిజల్యూషన్ 1080 x 2460 పిక్సెల్స్‌గా ఉంది.
మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్‌పై ఈ స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా ఇంకా పెంచుకునే అవకాశం ఉంది. 6000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించడం విశేషం. 18W ఫాస్ట్ చార్జింగ్‌ను టెక్నో పోవా 5జీ సపోర్ట్ చేయనుంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 13 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్, 2 మెగాపిక్సెల్ కెమెరాలు కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా అందించారు.
ప్రైవసీ కోసం ఫోన్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందించారు. ఫేస్ అన్‌లాక్ ఫీచర్ కూడా ఇందులో ఉండటం విశేషం. 5జీ, 4జీ, బ్లూటూత్ 5.0, జీపీఎస్, ఏ-జీపీఎస్, డ్యూయల్ సిమ్, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బైదు, గ్లోనాస్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.
Airtel Best Plan: రోజుకు 8 జీబీ అందించే ఎయిర్టెల్ ప్లాన్ ఇదే - ఓటీటీ సబ్స్క్రిప్షన్లు కూడా!
Free Range Rover: రేంజ్ రోవర్ బంపర్ ఆఫర్ - ఉచితంగా స్పోర్ట్ కారు - క్లిక్ చేశారంటే?
Nothing Phone 1: నథింగ్ ఫోన్ 1 ప్రీ-ఆర్డర్లు ప్రారంభం - ఎంత చెల్లించాలంటే?
Samsung Smart Upgrade Program: ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ బంపర్ ఆఫర్ - 70 శాతం కట్టి టీవీ తీసుకెళ్లిపోవచ్చు!
Samsung Cheapest Foldable Mobiles: బడ్జెట్ ఫోల్డబుల్ ఫోన్లు తీసుకురానున్న శాంసంగ్ - ప్రస్తుతం ఉన్న వాటికంటే సగం ధరకే!
Vijya Devarakonda: 'పీకే'లో రేడియోతో ఆమిర్ - 'లైగర్'లో రోజా పూల బొకేతో విజయ్ దేవరకొండ
High Alert in Hyderabad: భద్రతా వలయంలో భాగ్యనగరం - హైదరాబాద్‌కు ప్రధాని మోదీ రాక నేపథ్యంలో హై అలెర్ట్
Breaking News Telugu Live Updates: తెలంగాణలో బీజేపీ పుంజుకుందని అనుకోవడం భ్రమ: ఎమ్మెల్యే
CM NTR Banners: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కావాలంటూ...