By: ABP Desam | Updated at : 07 Feb 2023 04:07 PM (IST)
Edited By: anjibabuchittimalla
Photo@Samsung India/twitter
ప్రస్తుతం తక్కువ ధరలో మంచి స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. మధ్య తరగతి వినియోగదారుల బడ్జెట్ ధరలోనే అదిరిపోయే ఫీచర్లతో పలు ఫోన్లు లభిస్తున్నాయి. Samsung Galaxy F04, Oppo K10, Motorola G62 5G లాంటి లేటెస్ట్ స్మార్ట్ ఫోన్లు సైతం రూ. 15 వేలలోపే కొనుగోలు చేసే అవకాశం ఉంది. రూ.15 వేలల్లో లభించిన 5 బెస్ట్ స్మార్ట్ ఫోన్లను లిస్టు చేసి పెట్టాం. జస్ట్ చూసి, మీకు నచ్చిన స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేసుకోవచ్చు.
MediaTek P35 చిప్‌సెట్, RAM ప్లస్ ఫీచర్ తో Android 12పై రన్ అవుతోంది. 13MP+2MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ గరిష్టంగా 8GB RAMతో వస్తుంది. ఈ ఫోన్ జాడే పర్పుల్, ఒపాల్ గ్రీన్ అనే రెండు స్టైలిష్ రంగులలో లభిస్తుంది. 4GB+64GB స్టోరేజ్ వేరియంట్ ఫోన్ ధర రూ. 9,499గా కంపెనీ నిర్ణయించింది. Samsung.com, Flipkartతో పాటు ఎంపిక చేసిన రిటైల్ అవుట్‌లెట్లలో అందుబాటులో ఉంది.
It’s #F4Fast, and it’s F 4 Finally here. The new Samsung Galaxy F04 comes loaded with amazing features, and you can grab one before anyone else. Match the features correctly and leave the right answers in the comments to win the #GalaxyF04, F 4 Free. T&C apply. pic.twitter.com/FN8kosSJgT
— Samsung India (@SamsungIndia) January 4, 2023
Poco M4 Pro స్మార్ట్ ఫోన్ మూడు వేరియంట్స్ లో లభిస్తోంది. 6GB/64GB వేరియంట్ ధర రూ. 14,999, 6GB/128GB వేరియంట్ ధర రూ. 16,499, 8GB/128GB వేరియంట్ ధర రూ. 17,999గా కంపెనీ నిర్ణయించింది.
ప్రస్తుతం Oppo K10 స్మార్ట్ ఫోన్ రూ.13,990 తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది. 6GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్‌ను Flipkartలో ఎక్స్ఛేంజ్, బ్యాంక్ ఆఫర్లను ఉపయోగించి కూడా పొందవచ్చు. ఈ ఫోన్ Qualcomm Snapdragon 680 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. 6.59 అంగుళాల డిస్ ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 5000mAh బ్యాటరీ ఉంది.
Realme 9 5G స్మార్ట్ ఫోన్ 4GB RAM, 64GB స్టోరేజ్ వేరియంట్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ లో రూ. 15,999 తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది. Mediatek డైమెన్సిటీ 810 చిప్‌సెట్ ద్వారా ఈ ఫోన్ రన్ అవుతోంది. ఈ ఫోన్ 6.5 అంగుళాల డిస్‌ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 5000mAH బ్యాటరీతో పాటు పలు లేటెస్ట్ ఫీచర్లు ఉన్నాయి.
Motorola G62 5G
Motorola G62 5G స్మార్ట్ ఫోన్ 6GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్ ధర ప్రస్తుతం రూ 14,999కి Flipkartలో అందుబాటులో ఉంది. Qualcomm Snapdragon 695 చిప్‌సెట్ ద్వారా రన్ అవుతుంది. ఈ ఫోన్ 6.55 అంగుళాల డిస్‌ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 5000mAh బ్యాటరీ ఉంది.
Read Also: వాట్సాప్ నుంచి మరో చక్కటి ఫీచర్ - ఈ ఆప్షన్‌తో ఇకపై ఈజీగా కాల్ చేసుకోవచ్చు!
Samsung Galaxy M54 5G: 108 మెగాపిక్సెల్ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో శాంసంగ్ 5జీ ఫోన్ - ఎలా ఉందో చూసేయండి!
Nothing Ear 2: రేటుతో బెదరగొడుతున్న నథింగ్ - కొత్త ఇయర్‌బడ్స్ లాంచ్ - ఇంత పెడితే ఎవరైనా కొంటారా?
Data Transfer: కొత్త ఫోన్‌కు డేటా ట్రాన్స్‌ఫర్ మరింత ఈజీ - మెసేజ్‌లు, చాటింగ్‌లు, యాప్ డేటా కూడా!
Samsung A34 5G Sale: శాంసంగ్ ఏ34 5జీ సేల్ ప్రారంభించిన కంపెనీ - ఫీచర్లు చూశారా?
Samsung A54 5G Sale: శాంసంగ్ కొత్త 5జీ ఫోన్ సేల్ షురూ - మిడ్‌రేంజ్ ఫ్లాగ్‌ఫిప్‌లో విన్నర్ అవుతుందా?
TSPSC Paper Leak: ఉదాసీనతే కొంప ముంచిందా? విధులు నిర్వహిస్తూనే పరీక్షలకు హాజరైన కమిషన్ ఉద్యోగులు! అయినా నో రెస్పాన్స్!
300కార్లతో ర్యాలీ- టీడీపీలోకి వెళ్లే సమయంలో కోటంరెడ్డి బలప్రదర్శన
పేపర్ లీకేజీపై గవర్నర్ ఫోకస్ - పూర్తి వివరాలు ఇవ్వాలని సీఎస్, డీజీపీకి లేఖ
Vishnu VS Manoj: మంచు మనోజ్, విష్ణు మధ్య విభేదాలు - ఫేస్‌బుక్ పోస్ట్‌తో ఇంటి గుట్టు బయటకు