By: ABP Desam | Updated at : 29 Jun 2022 08:12 AM (IST)
స్లైస్ యాప్ యూజర్ల డేటా సేకరిస్తోందా
స్మార్ట్‌ఫోన్ యాజర్లకు కొన్ని యాప్‌లు వాడుతున్నా డేటా చోరీ జరుగుతుందని భయం ఉంటుంది. ఈ క్రమంలో క్రెడిట్ కార్డులు జారీ చేసే స్లైస్ యాప్ యూజర్ల పర్సనల్ డేటాను ట్రాక్ చేసి వివరాలు సేకరిస్తుందని గూగుల్ ఆరోపించినట్లు ప్రచారం జరిగింది. గూగుల్ ప్లే స్టోర్‌లో సైతం స్లైస్ యాప్ వినియోగదారులు ఏవేవో సందేహాస్పద మెస్సేజ్‌లు కనిపించాయి. యూజర్ల డేటాను సేకరించే యాప్‌లను గుర్తిస్తుండగా స్లైస్ యాప్ యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తుందని గుర్తించామని, ఈ యాప్ వాడవద్దని జూన్ 24న గూగుల్ ప్లే నుంచి అలర్ట్స్ వచ్చాయి. ఈ ఆరోపణలపై స్లైస్ సంస్థ స్పందించి అసలేం జరిగిందో వివరణ ఇచ్చి తమ యూజర్ల అనుమానాలకు చెక్ పెట్టింది.
జూన్ 28, 2022న స్లైస్ సంస్థ చేసిన ప్రకటన ఇదే..
జూన్ 23న ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి స్లైస్ యాప్‌ను 10.0.7.1 వెర్షన్‌కి అప్‌డేట్ చేసుకున్నారు. ఆ సమయంలో ఈ యాప్ ప్రమాదకరమని, యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నిస్తోందని యూజర్లకు అలర్ట్ వచ్చింది. ఈ హెచ్చరికపై స్పష్టత ఇవ్వడానికి తాము ప్రకటన విడుదల చేస్తున్నామని స్లైస్ సంస్థ పేర్కొంది. ఈ తాజా వెర్షన్ స్మార్ట్‌ఫోన్, SMS అనుమతులను యూపీఐ మార్గదర్శకాల ప్రకారం SIMని ధృవీకరించడానికి మాత్రమే కోరుతోంది.
యూజర్లకు అలర్ట్ వచ్చిన తరువాత స్లైస్ టీమ్ Google Play Storeతో కలిసి పనిచేసి సమస్యను గుర్తించింది. యూజర్ల లొకేషన్, కాంటాక్ట్స్, ఎస్ఎంఎస్ పర్మిషన్ కోరడంతో కొత్త వెర్షన్ అప్‌డేట్ చేసుకునే యూజర్లకు అది వార్నింగ్‌లా కనిపించింది. యూపీఐ ఫోన్, SMS అనుమతులను అప్‌డేట్ చేస్తున్న సమయంలో UPI యూజర్ కేస్ అప్‌డేట్ చేయకపోవడం వల్ల గందరగోళం నెలకొంది. మొదటి స్టెప్‌లోనే యూజర్ల అనుమతి కోరుతున్నట్లు వినియోగదారులు గుర్తించాలని, కోడ్ అప్‌డేషన్ తప్పిదాలతో గూగుల్ ప్లే ప్రొటెక్ట్ అలర్ట్ వెళ్లాయి. కానీ తమ యాప్‌లో ఎలాంటి మార్పులు తీసుకురాలేదని వెల్లడించారు.
గంటల వ్యవధిలో సమస్య పరిష్కారం..
గూగుల్ ప్లే స్టోర్ యూజర్లకు ఈ హెచ్చరికను తెలియజేసిన 4 గంటల్లోనే సమస్యను గుర్తించి పరిష్కరించాం. యూజర్లు యాప్‌ను రీ ఇన్‌స్టాల్, ఇదివరకే యూజర్లైతే 10.0.7.3 వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవాలని సూచించారు. లోపాలను సరిదిద్దుకున్నట్లు తాము తెలిపిన వెంటనే Google Play Store ఎలాంటి హెచ్చరికలను జారీ చేయలేదను యూజర్లు గ్రహించాలి. ప్రస్తుతం 10.0.7.1 అనే వెర్షన్ స్లైస్ యాప్ వినియోగిస్తున్నవారికి సైతం ఎలాంటి అలర్ట్స్ రావని సంస్థ వెల్లడించింది.
యూజర్ల డేటాకు ప్రైవసీ కల్పిస్తాం..
జూన్ 24న, జూన్ 25న Google Play Store స్లైస్ యాప్ వినియోగదారులను అలర్ట్ చేసింది. కానీ స్లైస్ యాప్ అన్ ఇన్‌స్టాల్ చేసుకోవాలని గానీ, యాప్ రిమూవ్ చేయడానికి ఎలాంటి అధికారిక ప్రకటనను గూగుల్ సంస్థ విడుదల చేయలేదు. యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని తాము ఎప్పటికీ ప్రొటెక్ట్ చేస్తామని, ఏ సందర్భంలోనూ వారి డేటాను సేకరించేది లేదన్నారు. యూజర్ల ఫోన్ కాల్ రికార్డింగ్స్, ఆడియో రికార్డింగ్స్, ఫొటోలు, వీడియోలు లాంటి ఏ వివరాలను సేకరించదని మరోసారి పునరుద్ఘాటించింది స్టైస్ టీమ్. కేవలం స్లైస్ కార్డ్ వినియోగం కోసం అవసరమైన పర్మిషన్స్ మాత్రమే యూజర్లను కోరతామని స్పష్టం చేశారు.
స్లైస్ యాప్ ప్రమాదకరమని, యూజర్ల డేటా సేకరిస్తోందని గానీ గూగుల్ ప్లే ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదని స్టైస్ యాజమాన్యం తాజా ప్రకటనలో స్పష్టం చేసింది. యూజర్లకు తమ సేవలు మరింత మెరుగ్గా కొనసాగుతాయని, తమ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలని, ఆల్రెడీ యూజర్లైతే అప్‌డేట్ చేసుకోవాలని తాజా ప్రకటనలో స్లైస్ యాజమాన్యం సూచించింది.
Vivo V25 Pro: బెస్ట్ ఫోన్లతో పోటీకి రెడీ అవుతున్న వివో - కెమెరాలు అయితే కేక!
Realme C33: రూ.10 వేలలోపే రియల్మీ కొత్త బడ్జెట్ ఫోన్ - 128 జీబీ వరకు స్టోరేజ్!
Infinix Smart 6 HD: రూ.7 వేలలోపే సూపర్ ఫీచర్లతో స్మార్ట్ ఫోన్ - 5000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో!
Moto G62 5G: మోటొరోలా చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - రూ.15 వేలలోపే!
PF Data Leak: మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా? అయితే జాగ్రత్తగా ఉండాలి - ఎందుకంటే మీ డేటా?
TS Constable Exam : తెలంగాణ కానిస్టేబుల్ రాత పరీక్ష వాయిదా, ఎగ్జామ్ ఎప్పుడంటే?
Munugodu bypoll : మునుగోడు ఉపఎన్నిక డిసెంబర్ లోనా? ఎన్నికల కమిషన్ నిర్ణయంపై ఉత్కంఠ!
Bihar Politics: BJPకి రాంరాం- కాంగ్రెస్, RJDతో నితీశ్ కుమార్ చర్చలు!
Lakshya Sen Wins Gold: బ్యాడ్మింటన్‌లో రెండో స్వర్ణం - మొదట సింధు, ఇప్పుడు లక్ష్యసేన్