అన్వేషించండి

Samsung Galaxy Tab A8: రూ.18 వేలలోపే అదిరిపోయే ట్యాబ్లెట్.. భారీ డిస్‌ప్లే, పెద్ద బ్యాటరీ.. లాంచ్ చేసిన శాంసంగ్!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ మనదేశంలో కొత్త ట్యాబ్లెట్‌ను లాంచ్ చేసింది. అదే శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఏ8.

శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఏ8 మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో 10.5 అంగుళాల డబ్ల్యూయూఎక్స్‌జీఏ డిస్‌ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 16:10గా ఉంది. ఆక్టాకోర్ ప్రాసెసర్‌పై ఈ ట్యాబ్లెట్ పనిచేయనుంది. 4 జీబీ వరకు ర్యామ్ ఇందులో ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం ఏకంగా 7040 ఎంఏహెచ్ కావడం విశేషం.

శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఏ8 ధర
ఇందులో 3 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వైఫై వేరియంట్ ధర రూ.17,999గా ఉంది. ఈ స్టోరేజ్‌లో వైఫై + ఎల్టీఈ ధర రూ.21,999గా నిర్ణయించారు. ఇక 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్‌లో వైఫై వేరియంట్ ధర రూ.19,999గా ఉంది. వైఫై + ఎల్టీఈ వేరియంట్ ధరను రూ.23,999గా నిర్ణయించారు. గ్రే, పింక్ గోల్డ్, సిల్వర్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. జనవరి 17వ తేదీ నుంచి దీని సేల్ ప్రారంభం కానుంది. ప్రారంభ ఆఫర్ కింద ఐసీఐసీఐ బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.2,000 క్యాష్ బ్యాక్ లభించనుంది.

శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఏ8 స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఏ8లో 10.5 అంగుళాల డబ్ల్యూయూఎక్స్‌జీఏ డిస్‌ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 16:10 కాగా, స్క్రీన్ టు బాడీ రేషియో 80 శాతంగా ఉంది. దీని స్క్రీన్ రిజల్యూషన్ 1920 x 1200 పిక్సెల్స్‌గా ఉండనుంది. ఇందులో 4 జీబీ వరకు ర్యామ్, 64 జీబీ వరకు స్టోరేజ్ ఉన్నాయి.

ఇందులో వెనకవైపు 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఇక ముందువైపు 5 మెగాపిక్సెల్ సెన్సార్‌ను అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 7040 ఎంఏహెచ్‌గా ఉంది. 4జీ ఎల్టీఈ, వైఫై 5, బ్లూటూత్ 5, జీపీఎస్, గ్లోనాస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు ఇందులో ఉన్నాయి. యాక్సెలరోమీటర్, కంపాస్, గైరోస్కోప్, లైట్, హాల్ సెన్సార్, జీపీఎస్, గ్లోనాస్, బైదు, గెలిలీయో సెన్సార్లు కూడా ఇందులో ఉన్నాయి. ఇందులో క్వాడ్ స్టీరియో స్పీకర్ సిస్టంను శాంసంగ్ అందించింది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంది. దీని మందం 0.69 సెంటీమీటర్లు గానూ, బరువు 508 గ్రాములుగానూ ఉంది.

Also Read: Vivo Y01 Price Leaked: వివో కొత్త ఫోన్ ధర, ఫీచర్లు లీక్.. రూ.10 వేలలోపే!

Also Read: Samsung Offers: గుడ్‌న్యూస్.. ఈ శాంసంగ్ ఫోన్ ధర తగ్గింపు.. ఇప్పుడు రూ.13 వేలలోపే!

Also Read: Cheapest 5G Phone: వేడెక్కుతున్న 5జీ మార్కెట్.. రూ.20 వేలలోపే మరో 5జీ ఫోన్!

Also Read: రెండు 50 మెగాపిక్సెల్ కెమెరాలు, ఒక 60 మెగాపిక్సెల్ కెమెరా.. మోటో సూపర్ ఫోన్ వచ్చేస్తుంది.. మనదేశంలో త్వరలో లాంచ్!

Also Read: Asus Rog Phone 5 Ultimate: 18 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్.. ల్యాప్‌టాప్ కాదు స్మార్ట్‌ఫోనే.. సేల్ ఎప్పుడంటే?

Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

టాప్ హెడ్ లైన్స్

Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Embed widget