By: ABP Desam | Updated at : 24 Mar 2023 11:40 PM (IST)
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ మనదేశంలో లాంచ్ అయింది.
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో శాంసంగ్ ఎక్సినోస్ ప్రాసెసర్‌ను అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 6000 ఎంఏహెచ్‌గా ఉంది. 25W ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. మూడు కలర్ ఆప్షన్లలో శాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ లాంచ్ అయింది.
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ ధర
ఇందులో రెండు వేరియంట్లు లాంచ్ అయ్యాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,990గా ఉంది. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,990గా నిర్ణయించారు. ఫ్లిప్‌కార్ట్, శాంసంగ్ అధికారిక వెబ్ సైట్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. దీనికి సంబంధించిన సేల్ మార్చి 30వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఓఎంజీ బ్లాక్, గోట్ గ్రీన్, బే పర్పుల్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ వచ్చేసింది.
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ స్మార్ట్ ఫోన్‌లో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ కూడా ఇందులో ఉంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత వన్ యూఐ 5 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. ఆక్టాకోర్ 5 ఎన్ఎం ఎక్సినోస్ 1330 చిప్‌సెట్‌ను ఇందులో అందించారు. 6 జీబీ వరకు ర్యామ్ ఇందులో ఉంది. వర్చువల్ ర్యామ్ ద్వారా మరో 6 జీబీ ర్యామ్‌ను యాడ్ చేసుకోవచ్చు.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 13 మెగాపిక్సెల్ సెన్సార్‌ను అందించారు.
దీని బ్యాటరీ సామర్థ్యం 6000 ఎంఏహెచ్ కాగా, 25W ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. యూఎస్‌బీ టైప్-సీ పోర్టు ద్వారా చార్జింగ్ పెట్టుకోవచ్చు. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. బయోమెట్రిక్ ఆథెంటికేషన్ కోసం ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా అందించారు.
శాంసంగ్ గెలాక్సీ ఏ34 5జీ స్మార్ట్ ఫోన్‌ను కంపెనీ ఇటీవలే మనదేశంలో లాంచ్ చేసింది. దీనికి సంబంధించిన సేల్ కూడా ఇప్పటికే ప్రారంభం అయింది. ఇందులో సూపర్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను కూడా అందించారు. ఈ మొబైల్‌లో 8 జీబీ ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.30,999గా నిర్ణయించారు. టాప్ ఎండ్ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధరను రూ.32,999గా ఉంది.
అసమ్ లైమ్, అసమ్ గ్రాఫైట్, అసమ్ సిల్వర్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ లాంచ్ అయింది. ప్రారంభ ఆఫర్ కింద ఈ ఫోన్ కొనుగోలు చేసే వారికి సెలెక్టెడ్ బ్యాంకు కార్డులపై రూ.3,000 వరకు క్యాష్ బ్యాక్ అందించనున్నారు.
ChatGPT నుంచి కంటెంట్ మాత్రమే కాదు, డబ్బు కూడా సంపాదింవచ్చు! ఎలాగో తెలుసా?
WWDC 2023: కొత్త ఐప్యాడ్ఓఎస్, వాచ్ఓఎస్, మ్యాక్ఓఎస్ వచ్చేశాయ్ - ఫీచర్లు ఎలా ఉన్నాయో చూశారా?
MacBook Air: ఇంటెల్ ల్యాప్‌టాప్‌ల కంటే 12 రెట్లు వేగంగా - కొత్త మ్యాక్‌బుక్ లాంచ్ చేసిన యాపిల్!
Apple Vision Pro: ప్రపంచాన్ని కళ్ల ముందుకు తెస్తున్న యాపిల్ - విజన్ ప్రో హెడ్‌సెట్ లాంచ్ - రేటు ఎంతంటే?
iOS 17 Features: ఐవోఎస్ 17లో మూడు సూపర్ ఫీచర్లు - లాంచ్ చేసిన యాపిల్!
‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్
Academic Calendar: తెలంగాణలో పాఠశాలల కొత్త అకడమిక్ క్యాలెండర్ విడుదల - పరీక్షలు, సెలవుల వివరాలు ఇలా!
Cyclone Biparjoy: అరేబియా సముద్రంలో బిపర్‌జోయ్ తుపాను, వచ్చే 5 రోజులు ఇక్కడే బీభత్సమే - ఐఎండీ హెచ్చరిక
Odisha Train Accident: రైలు ప్రమాదంలో మృతుల సంఖ్యపై ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన, మళ్లీ పాత మాటే!