Samsung A03 India Launch: రూ.10 వేలలోపే శాంసంగ్ కొత్త ఫోన్... లాంచ్ త్వరలోనే!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ తన కొత్త స్మార్ట్ ఫోన్ గెలాక్సీ ఏ03ని మనదేశంలో త్వరలో లాంచ్ చేయనుంది. దీని ధర ఆన్‌లైన్‌లో లీకైంది.
![Samsung A03 India Launch: రూ.10 వేలలోపే శాంసంగ్ కొత్త ఫోన్... లాంచ్ త్వరలోనే! Samsung Galaxy A03 India Launch in February Or March Price Specifications Tipped Samsung A03 India Launch: రూ.10 వేలలోపే శాంసంగ్ కొత్త ఫోన్... లాంచ్ త్వరలోనే!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/14/5dce2e0096b17d9b6498e38070636b77_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Samsung Galaxy A03: శాంసంగ్ గెలాక్సీ ఏ03 స్మార్ట్ ఫోన్ మనదేశంలో త్వరలో లాంచ్ కానుంది. అయితే ఎప్పుడు రానుందో మాత్రం తెలియరాలేదు. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం... ఈ స్మార్ట్ ఫోన్ ఫిబ్రవరి చివర్లో లేదా మార్చి ప్రారంభంలో లాంచ్ కానుంది. ఈ ఫోన్ మిడ్‌రేంజ్‌లో లాంచ్ కానుంది. ఈ ఫోన్ గ్లోబల్ మార్కెట్‌లో గతేడాది నవంబర్‌లో లాంచ్ అయింది.
ప్రముఖ టిప్‌స్టర్ ముకుల్ శర్మ ఈ ఫోన్ లాంచ్‌కు సంబంధించిన వివరాలను టీజ్ చేశారు. దీని లాంచ్ డేట్‌తో పాటు ధర కూడా లీక్ అయింది. ఇందులో వెనకవైపు రెండు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్‌గా ఉండనుంది.
శాంసంగ్ గెలాక్సీ ఏ03 ధర (Samsung Galaxy A03 Price)
తాజా లీకుల ప్రకారం... ఈ ఫోన్ ధర మనదేశంలో రూ.10 వేల రేంజ్‌లో ఉండనుంది. ఇందులో 3 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్, 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఉండనుంది. బ్లాక్, రెడ్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.
ఈ ఫోన్ గతంలో వియత్నాంలో లాంచ్ అయింది. అక్కడ ఈ ఫోన్ 3 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 29,90,000 డాంగ్‌లుగా (సుమారు రూ.9,700) నిర్ణయించారు. ఇక 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 34,90,000 డాంగ్‌లుగా (సుమారు రూ.11,300) ఉంది.
శాంసంగ్ గెలాక్సీ ఏ03 స్పెసిఫికేషన్లు (Specifications)
ఇందులో 6.5 అంగుళాల హెచ్‌డీ+ ఇన్‌ఫినిటీ-వి డిస్‌ప్లేను అందించారు. ఆక్టాకోర్ యూనిసోక్ టీ606 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 4 జీబీ వరకు ర్యామ్, 64 జీబీ వరకు స్టోరేజ్‌ను ఇందులో అందించారు. రెండు వేరియంట్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.
ఈ స్మార్ట్ ఫోన్‌లో వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్ కాగా.. దీంతోపాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉండనుంది. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ సెన్సార్‌ను అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది.
Also Read: శాంసంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్ ప్రీ-ఆర్డర్లు ప్రారంభం, కేవలం రూ.1,999కే!
Also Read: రూ.13 వేలలోనే రియల్‌మీ కొత్త ఫోన్, 50 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఫీచర్లు!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)