Samsung Fab Grab Fest: ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లకు పోటీగా శాంసంగ్ స్పెషల్ సేల్స్.. స్టార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్స్, స్మార్ట్ వాచ్‌లపై భారీ డిస్కౌంట్
Samsung Fab Grab Fest Sale Updates | దక్షిణ కొరియా కంపెనీ శాంసంగ్ స్పెషల్ సేల్ తీసుకొచ్చింది. కస్టమర్లు స్మార్ట్‌ఫోన్‌లు, వాచ్‌లు, రింగ్‌లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లపై భారీ డిస్కౌంట్‌కు కొనేయండి.

Samsung Fab Grab Fest Sale: ఈకామర్స్ దిగ్గజాలు Flipkart, అమెజాన్ (Amazon)తో పాటు దక్షిణ కొరియాకు చెందిన సాంకేతిక సంస్థ Samsung సైతం తన వినియోగదారుల కోసం ప్రత్యేకమైన సేల్ తీసుకువచ్చింది. Samsung ఈ Fab Grab Festలో కస్టమర్‌లకు అనేక ఉత్పత్తులపై డిస్కౌంట్స్, బ్యాంక్ క్యాష్‌బ్యాక్ ఆఫర్స్, EMI ద్వారా కొనుగోలు చేయవచ్చు. సెప్టెంబర్ 22న ప్రారంభమైన ఈ సేల్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. సేల్ సమయంలో కస్టమర్‌లు Galaxy వేర్బుల్ డివైజ్2లపై రూ. 18,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. దీంతో పాటు టాబ్లెట్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లపై కూడా భారీ డిస్కౌంట్‌లు లభిస్తున్నాయి.
Galaxy స్మార్ట్‌ఫోన్‌లపై 53 శాతం వరకు డిస్కౌంట్
సేల్ సమయంలో కొన్ని Galaxy స్మార్ట్‌ఫోన్‌లపై కస్టమర్‌లు 53 శాతం వరకు తగ్గింపు పొందవచ్చని Samsung తెలిపింది. దీంతో పాటు కొన్ని రకాల కార్డ్‌లపై రూ. 12,000 వరకు బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఆఫర్‌లు Galaxy Z Fold 7 గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7 (Galaxy Z Flip 7), Galaxy S25 Ultra, Galaxy S25, గెలాక్సీ ఎస్25 ఎడ్జ్ (Galaxy S25 Edge), Galaxy S24 Ultra, Galaxy S24, Galaxy S24 FE, గెలాక్సీ ఏ56 (Galaxy A56), Galaxy A55తో సహా అనేక మోడల్‌లకు వర్తిస్తాయి.
తక్కువ ధరకే లభిస్తున్న ల్యాప్‌టాప్‌లు
శాంసంగ్ తీసుకొచ్చిన ఈ Fab Grab Festలో కస్టమర్‌లు ఎంచుకున్న ల్యాప్‌టాప్ మోడల్‌లపై 59 శాతం వరకు తగ్గింపు ఇస్తున్నారు. కస్టమర్స్ రూ. 17,490 వరకు బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఆఫర్ Galaxy Book 5 Pro 360, గెలాక్సీ బుక్ 5 ప్రో (Galaxy Book 5 Pro), Galaxy Book 5 360, Galaxy Book 5, గెలాక్సీ బుక్ 4 (Galaxy Book 4) మోడల్‌లకు వర్తిస్తుంది. ల్యాప్‌టాప్‌లతో పాటు, Galaxy Tab S11 Ultra, Galaxy Tab S11, గెలాక్సీ ట్యాబ్ ఎస్10 ఎఫ్ఈ ప్లస్ (Galaxy Tab S10 FE+), Galaxy Tab S10 FE వంటి టాబ్లెట్‌లు కూడా తక్కువ ధరకు లభిస్తున్నాయి.
వేర్బుల్ గాడ్జెట్‌లపై భారీ తగ్గింపు
ఫెస్టివల్ ఆఫర్ కింద Samsung కంపెనీ స్మార్ట్ వాచ్‌లు తీసుకొచ్చింది. అందులో Galaxy Watch8 సిరీస్ ఇప్పుడు రూ. 32,999 ప్రారంభ ధరతో కాకుండా రూ. 22,999కి లభిస్తుంది. అంటే దీనిపై మీకు 10 వేల రూపాయల డిస్కౌంట్ పొందవచ్చు. Galaxy Watch Ultraపై అత్యధికంగా రూ. 18,000 వరకు తగ్గింపు లభిస్తుంది. మొన్నటివరకు దీని ధర రూ. 59,999, కానీ ఆఫర్‌లో ఇది రూ. 41,999కి కొనేయండి. అదేవిధంగా Galaxy Ring రూ. 38,999కి బదులుగా రూ. 23,999కి, Galaxy Buds3 FE రూ. 12,999కి బదులుగా రూ. 8,999కి మీకు లభిస్తుంది. ఇక Buds3 Pro రూ. 19,999కి బదులుగా డిస్కౌంట్ ధర రూ. 13,999కి కొనుగోలు చేయవచ్చు.






















