By: ABP Desam | Updated at : 26 Jan 2022 02:24 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
రెడ్‌మీ నోట్ 11ఎస్ 5జీ ధర, స్పెసిఫికేషన్లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి.
రెడ్‌మీ నోట్ 11ఎస్ స్మార్ట్ ఫోన్ మనదేశంలో ఫిబ్రవరి 9వ తేదీన లాంచ్ కానుంది. ఈ స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన స్పెసిఫికేషన్లు కూడా ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. ఇందులో మీడియాటెక్ జీ96 4జీ ప్రాసెసర్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది. 6 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. ఇందులో 6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని గ్లోబల్ లాంచ్ కూడా ఈ వారంలోనే జరగనుంది.
రెడ్‌మీ నోట్ 11ఎస్ ఫిబ్రవరి 9వ తేదీన లాంచ్ కానుంది. దీని స్పెసిఫికేషన్లను ప్రముఖ టిప్‌స్టర్ యోగేష్ బ్రార్ ట్వీట్ చేశారు. రెడ్‌మీ నోట్ 10ఎస్ మనదేశంలో రూ.14,999 ధరతో లాంచ్ అయింది. రెడ్‌మీ నోట్ 11ఎస్ ధర దీని కంటే రూ.1,000-రూ.2,000 ఎక్కువ ఉండే అవకాశం ఉంది. రెడ్‌మీ నోట్ 11ఎస్ అమెజాన్‌లో అందుబాటులో ఉండనుంది.
రెడ్‌మీ నోట్ 11ఎస్ స్పెసిఫికేషన్లు (అంచనా)
ఇప్పటివరకు లీకైన వివరాల ప్రకారం.. ఇందులో 6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉండనుంది. మీడియాటెక్ హీలియో జీ96 4జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 6 జీబీ వరకు ర్యామ్ ఇందులో ఉండనుంది. 128 జీబీ వరకు స్టోరేజ్ కూడా ఇందులో అందించనున్నారు.
ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 108 మెగాపిక్సెల్ కాగా.. దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, మరో రెండు 2 మెగాపిక్సెల్ సెన్సార్లు ఉండనున్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 13 మెగాపిక్సెల్ సెన్సార్ అందుబాటులో ఉండనుంది.
ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ 12.5 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. రెడ్‌మీ నోట్ 11ఎస్ బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉండనుంది. 33W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ స్మార్ట్ ఫోన్ సపోర్ట్ చేయనుంది.
రెడ్‌మీ నోట్ 11 గ్లోబల్ వేరియంట్ స్పెసిఫికేషన్లు
రెడ్‌మీ నోట్ 11 సిరీస్ గ్లోబల్ లాంచ్ కూడా జరగనుంది. లాంచ్‌కు ముంగిట దీనికి సంబంధించిన కొత్త టీజర్‌ను షియోమీ టీజ్ చేసింది. ఇందులో ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డాట్‌డిస్‌ప్లేను అందించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో స్టీరియో స్పీకర్ సెటప్ ఉండనుంది.
Also Read: iPhone 15 Series: ఐఫోన్లలో మొదటిసారి ఆ కెమెరాలు.. ఎప్పుడు రానున్నాయంటే?
Also Read: Realme 9i: రూ.14 వేలలోపే రియల్మీ కొత్త ఫోన్.. సూపర్ అనిపించే ఫీచర్లు.. లేటెస్ట్ ప్రాసెసర్ కూడా!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Lexar NM760 NVMe SSD: మీ పీసీ స్లోగా పనిచేస్తుందా - ఈ అదిరిపోయే కొత్త ఎస్ఎస్డీతో పరిగెత్తించండి!
Samsung Galaxy A23 5G: శాంసంగ్ బడ్జెట్ 5జీ ఫోన్ వచ్చేస్తుంది - సూపర్ ఫీచర్లతో!
Vivo Y72t: వివో కొత్త 5జీ ఫోన్ వచ్చేసింది - అదిరిపోయే ఫీచర్లు - ధర బడ్జెట్లోనే!
Redmi Note 11SE: రూ.13 వేలలోపే రెడ్‌మీ కొత్త 5జీ ఫోన్ - అదిరిపోయే ఫీచర్లు - ఫోన్ ఎలా ఉందో చూశారా?
Tecno Pova 3: రూ.13 వేలలోనే 7000 ఎంఏహెచ్, 11 జీబీ వరకు ర్యామ్ ఉన్న ఫోన్ - అదిరిపోయే ఫీచర్లు కూడా!
Ysrcp Bus Yatra : సామాజిక న్యాయమే సీఎం జగన్ ఫిలాసఫీ, నరసరావుపేట సభలో మంత్రులు
Redmi 11 5G Launch: రెడ్‌మీ చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - జూన్‌లోనే లాంచ్ - ధర లీక్!
Beer With Urine: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?
Tirumala News : తిరుమలకు పోటెత్తిన భక్తులు, శ్రీవారి దర్శనానికి 48 గంటలు పట్టే అవకాశం!