X

Redmi Laptop: ప్రొఫెషనల్స్ కోసం రెడ్ మీ బుక్ ప్రో….స్టూడెంట్స్ కోసం రెడ్ మీ బుక్ ఈ-లెర్నింగ్… రెడ్ మీ నుంచి భారత మార్కెట్లోకి తొలి ల్యాప్ టాప్

షియోమి సబ్ బ్రాండ్ రెడ్ మీ తన మొదటి ల్యాప్ టాప్ ని భారత మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఆగస్టు 3 మద్యాహ్నం 12 గంటల సమయంలో రిలీజ్ చేసింది. ఈ ల్యాప్ టాప్ స్పెసిఫికేషన్లు, ధర గురించి ఫుల్ డీటేల్స్ చూద్దాం…

FOLLOW US: 

షియోమి సబ్​బ్రాండ్​ రెడ్‌మీ తన మొట్టమొదటి ల్యాప్‌టాప్‌ను భారత మార్కెట్​లోకి లాంచ్​ చేసింది. ఈ ల్యాప్‌టాప్‌లను 'వర్క్ ఫ్రమ్ హోమ్' చేసే ఉద్యోగులకు, ఈ–లెర్నింగ్​లో విద్యాబోధన చేసే ఉపాధ్యాయలు, విద్యార్థుల కోసం ప్రత్యేకంగా డిజైన్​ చేసినట్లు రెడ్​మీ స్పష్టం చేసింది. 2019 నుంచి చైనా మార్కెట్​లో ఈ ల్యాప్​టాప్​లను విక్రయిస్తోంది. అయితే దాదాపు రెండేళ్ల తర్వాత గ్లోబల్​ మార్కెట్​లోకి వీటిని విడుదల చేసింది.Redmi Laptop: ప్రొఫెషనల్స్ కోసం రెడ్ మీ బుక్ ప్రో….స్టూడెంట్స్ కోసం రెడ్ మీ బుక్ ఈ-లెర్నింగ్… రెడ్ మీ నుంచి భారత మార్కెట్లోకి తొలి ల్యాప్ టాప్

వర్క్ ఫ్రంహోం చేసే ఉద్యోగులు, ఇతర ప్రొఫెషనల్స్ కోసం రెడ్ మీ బుక్ ప్రో, ఆన్ లైన్ క్లాసులు వినే విద్యార్థులకు రెడ్ మీ ఈ-బుక్ ఈ లెర్నింగ్ ఎడిషన్ డిజైన్ చేశారు. ఈ రెండింటిలో స్పెసిఫికేషన్లు చూద్దాం..

రెడ్‌మీ బుక్ ప్రో లో 15.6-అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే ఇస్తున్నారు. విండోస్ 10 ఓఎస్‌తో పనిచేస్తుంది. సిస్సర్ మెకానిజమ్ కీ బోర్డు ఇస్తున్నారు. దీని సాయంతో యూజర్ మరింత సౌకర్యవంతంగా, సులభంగా, వేగంగా టైప్ చెయ్యొచ్చు. అలానే ఈ ల్యాప్‌టాప్‌లో 100సెంటీమీటర్ ట్రాక్‌పాడ్ అమర్చారు. ఇది విండోస్ ప్రిసెషన్ డ్రైవర్స్‌, మల్టీ-టచ్‌ ఇన్‌పుట్స్‌ని సపోర్ట్ చేస్తుంది. ఇంటెల్‌ కోర్ ఐ5 11వ జనరేషన్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది 4.4 గిగాహెడ్జ్‌ స్పీడ్‌తో ఇంటెల్ ఐరిస్‌ ఎక్స్ఈ గ్రాఫిక్స్‌ను అందిస్తుంది. 8జీబీ డీడీఆర్‌4 ర్యామ్‌ /512జీబీ ఎస్‌ఎస్‌డీ హార్డ్‌డిస్క్‌ ఇస్తున్నారు. బ్లూటూత్, వైఫై కనెక్టివిటీ, రెండు యూఎస్‌బీ 3.2 జెన్‌1, ఒక యూస్‌బీ 2.0, హెచ్‌డీఎమ్‌ఐ, గిగాబైట్ ఈథర్‌నెట్, 3.5 ఎమ్‌ఎమ్‌ ఆడియోజాక్‌ పోర్టులు ఉన్నాయి. ఈ ల్యాప్‌టాప్ కేవలం 12 సెకన్లలో బూట్ అవుతుంది. అలానే 25 సెకన్లలో రీబూట్ అవుతుందని రెడ్‌మీ తెలిపింది. ఆన్‌లైన్‌ మీటింగ్, వీడియో కాల్స్ కోసం 720 పిక్సెల్ వెబ్‌ కెమెరా ఉంది. డ్యూయల్ మైక్రోఫోన్స్, డీటీఎస్‌ ఆడియోతో రెండు  2వాట్ స్పీకర్స్ ఉన్నాయి. రెడ్‌మీ బుక్‌ ప్రో ల్యాప్‌టాప్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 10 గంటలు నిరంతరాయంగా పనిచేస్తుంది. 30 నిమిషాల్లో 50 శాతం, 50 నిమిషాల్లో 80 శాతం బ్యాటరీ ఛార్జ్‌ అవుతుందట. ఈ ల్యాప్‌టాప్ ధర రూ. 49,999.Redmi Laptop: ప్రొఫెషనల్స్ కోసం రెడ్ మీ బుక్ ప్రో….స్టూడెంట్స్ కోసం రెడ్ మీ బుక్ ఈ-లెర్నింగ్… రెడ్ మీ నుంచి భారత మార్కెట్లోకి తొలి ల్యాప్ టాప్

రెడ్‌మీ బుక్ ఈ-లెర్నింగ్ ఎడిషన్  ల్యాప్‌టాప్ కూడా విండోస్ 10 ఓఎస్‌తో పనిచేస్తుంది. 15.6-అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఇందులో ఇంటెల్ కోర్ ఐ3 11వ జనరేషన్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. సిస్సర్ మెకానిజమ్‌ కీ బోర్డు అమర్చారు. 720 పిక్సెల్ హెచ్‌డీ వెబ్‌ కెమెరా ఇస్తున్నారు. బ్లూటూత్, వైఫై కనెక్టివిటీ, రెండు యూఎస్‌బీ 3.2 జెన్‌1, ఒక యూస్‌బీ 2.0, హెచ్‌డీఎమ్‌ఐ, గిగాబైట్ ఈథర్‌నెట్, 3.5 ఎమ్‌ఎమ్‌ ఆడియోజాక్‌ పోర్టులు ఉన్నాయి. ల్యాప్‌టాప్‌ బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే పది గంటలు నిరంతరాయంగా పనిచేస్తుంది. రెండు వేరియంట్లలో ఈ ల్యాప్‌టాప్‌ను తీసుకొచ్చారు.

రెడ్​మీ భారతీయ పీసీ మార్కెట్​లోకి ప్రవేశిస్తుండటంతో ఇప్పటికే హవా కొనసాగిస్తున్న హెచ్​పి, లెనెవో, డెల్​, ఏసర్​ వంటి ప్రముఖ బ్రాండ్లకు గట్టి పోటీనివ్వనుంది.

Tags: Redmi launched First Laptop In India Features Specifications Redmi Book Pro Redmi Book E-Learning Edition

సంబంధిత కథనాలు

Redmi Note 11T 5G: రూ.17 వేలలోనే రెడ్‌మీ సూపర్ 5జీ ఫోన్.. రెండు రోజుల్లో మార్కెట్లోకి!

Redmi Note 11T 5G: రూ.17 వేలలోనే రెడ్‌మీ సూపర్ 5జీ ఫోన్.. రెండు రోజుల్లో మార్కెట్లోకి!

Google Search: గూగుల్ సెర్చ్‌లో కొత్త ఫీచర్.. కళ్లకు ఊరటనిచ్చేలా.. ఇలా ఆన్ చేసుకోండి!

Google Search: గూగుల్ సెర్చ్‌లో కొత్త ఫీచర్.. కళ్లకు ఊరటనిచ్చేలా.. ఇలా ఆన్ చేసుకోండి!

DL Renewal: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!

DL Renewal: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!

Samsung A03: శాంసంగ్ కొత్త బడ్జెట్ ఫోన్ వచ్చేసింది... ధర రూ.10 వేలలోపే?

Samsung A03: శాంసంగ్ కొత్త బడ్జెట్ ఫోన్ వచ్చేసింది... ధర రూ.10 వేలలోపే?

Budget Mobile: రూ.6 వేలలోనే స్మార్ట్ ఫోన్.. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, సూపర్ ఫీచర్లు!

Budget Mobile: రూ.6 వేలలోనే స్మార్ట్ ఫోన్.. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, సూపర్ ఫీచర్లు!

టాప్ స్టోరీస్

Bimbisara Teaser: పొగరుతో రాజ్యం మీసం మెలేస్తే... బింబిసారుడిగా కత్తి దూసిన కల్యాణ్ రామ్! చూశారా?

Bimbisara Teaser: పొగరుతో రాజ్యం మీసం మెలేస్తే... బింబిసారుడిగా కత్తి దూసిన కల్యాణ్ రామ్! చూశారా?

Shiva Shankar Master: అవకాశాలు రాక... నృత్య ప్రదర్శనలకు డబ్బుల్లేక...  సినిమాల్లోకి! ఇదీ శివ శంకర్ మాస్టర్ జర్నీ!

Shiva Shankar Master: అవకాశాలు రాక... నృత్య ప్రదర్శనలకు డబ్బుల్లేక...  సినిమాల్లోకి! ఇదీ శివ శంకర్ మాస్టర్ జర్నీ!

In Pics: డాలర్ శేషాద్రి లేని వీఐపీ ఫోటోనే ఉండదు.. రాష్ట్రపతి నుంచి సీజేఐ దాకా.. అరుదైన ఫోటోలు

In Pics: డాలర్ శేషాద్రి లేని వీఐపీ ఫోటోనే ఉండదు.. రాష్ట్రపతి నుంచి సీజేఐ దాకా.. అరుదైన ఫోటోలు

Telangana Cabinet Meet: నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. చర్చకు వచ్చే అంశాలివే..

Telangana Cabinet Meet: నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. చర్చకు వచ్చే అంశాలివే..