Realme C31 India Launch: రియల్‌మీ కొత్త బడ్జెట్ ఫోన్ వచ్చేస్తుంది - త్వరలో మనదేశంలో లాంచ్!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ తన కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్‌ను మనదేశంలో లాంచ్ చేయనుంది. మార్చి 31వ తేదీన ఈ స్మార్ట్ ఫోన్ ఎంట్రీ ఇవ్వనుంది.
రియల్‌మీ సీ31 స్మార్ట్ ఫోన్ మనదేశంలో మార్చి 31వ తేదీన లాంచ్ కానుంది. ఈ ఫోన్ ఇటీవలే ఇండోనేషియాలో ఎంట్రీ ఇచ్చింది. ఇందులో 6.5 అంగుళాల హెచ్‌డీ+ స్క్రీన్, యూనిసోక్ టీ612 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, ఆండ్రాయిడ్ 11 వంటి ఫీచర్లను కంపెనీ అందించింది.
రియల్‌మీ సీ31 ధర (అంచనా)
ఈ ఫోన్ ఇండోనేషియాలో రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 3 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 15,99,000 ఇండోనేషియా రూపాయలుగా (సుమారు రూ.8,500) నిర్ణయించారు. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 16,49,000 ఇండోనేషియా రూపాయలుగా (సుమారు రూ.8,700) ఉంది. లైట్ సిల్వర్, డార్క్ గ్రీన్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ మనదేశంలో మార్చి 31వ తేదీన లాంచ్ కానుందని తెలుస్తోంది. ఈ ఫోన్ ధర మనదేశంలో రూ.10 వేలలోపే ఉండే అవకాశం ఉంది.
రియల్‌మీ సీ31 స్పెసిఫికేషన్లు
ఇందులో 6.5 అంగుళాల హెచ్‌డీ+ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్ కాగా... స్క్రీన్ టు బాడీ రేషియో 88.7 శాతంగా ఉంది. ఆక్టాకోర్ యూనిసోక్ టీ612 ప్రాసెసర్‌ను ఇందులో అందించారు. 4 జీబీ వరకు ర్యామ్, 64 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా... దీంతోపాటు 2 మెగాపిక్సెల్ మాక్రో, డెప్త్ సెన్సార్లు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా... 10W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో ఉంది. ఆండ్రాయిడ్ 11 ఆధారిత రియల్‌మీ యూఐ ఆర్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. దీని మందం 0.84 సెంటీమీటర్లు కాగా... బరువు 197 గ్రాములుగా ఉంది.
View this post on Instagram