By: ABP Desam | Updated at : 28 Feb 2022 12:23 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
రియల్‌మీ 9 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో త్వరలో లాంచ్ కానుంది.
Realme 9 5G Launch: రియల్‌మీ 9 ప్రో సిరీస్ ఇటీవలే మనదేశంలో లాంచ్ అయింది. రియల్‌మీ 9 ప్రో, రియల్‌మీ 9 ప్రో ప్లస్ స్మార్ట్ ఫోన్లు ఈ సిరీస్‌లో లాంచ్ అయ్యాయి. ఇప్పుడు ఇందులో రియల్‌మీ 9 5జీ స్మార్ట్ ఫోన్ త్వరలో లాంచ్ కానుందని తెలుస్తోంది. మార్చిలో ఈ ఫోన్ లాంచ్ కానుందని వార్తలు వస్తున్నాయి.
లాంచ్‌కు ముంగిట ఈ ఫోన్‌కు సంబంధించిన ర్యామ్, స్టోరేజ్ ఆప్షన్ వివరాలు లీకయ్యాయి. దీంతో పాటు కలర్ ఆప్షన్ వివరాలు కూడా బయటకు వచ్చాయి. ప్రైస్ బాబా కథనం ప్రకారం... 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్, 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్లు ఇందులో ఉండనున్నట్లు తెలుస్తోంది. స్టార్‌గేజ్ వైట్, సూపర్ సోనిక్ బ్లూ, సూపర్ సోనిక్ బ్లాక్, మీటియోర్ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ లాంచ్ కానుంది.
గతంలో లాంచ్ అయిన రియల్‌మీ 8 5జీకి తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ కానుంది. రియల్‌మీ 8 5జీలో మూడు వేరియంట్లు లాంచ్ అయ్యాయి. వీటిలో 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్, 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. రియల్‌మీ 8 5జీ ధర మనదేశంలో రూ.15,499 నుంచి ప్రారంభం అవుతోంది. రియల్‌మీ 9 5జీ ధర రూ.15 వేలలోపే ఉండే అవకాశం ఉంది.
రియల్‌మీ 9 5జీ స్పెసిఫికేషన్లు
ఇప్పటివరకు లీకైన స్పెసిఫికేషన్ల ప్రకారం... ఇందులో 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉండనుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుందని తెలుస్తోంది. 8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో అందించనున్నారు.
ఇక కెమెరా విషయానికి వస్తే... ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి.వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 2 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉండనున్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా అందించనున్నారు.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉండనుంది. 18W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. ఆండ్రాయిడ్ 12 ఆధారిత రియల్‌మీ యూఐ 3 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. స్టీరియో స్పీకర్ సెటప్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ కూడా ఇందులో అందించనున్నారు. చార్జింగ్ పెట్టుకోవడానికి యూఎస్‌బీ టైప్-సీ పోర్టు కూడా ఇందులో ఉండనుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించనున్నారు.
Also Read: శాంసంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్ ప్రీ-ఆర్డర్లు ప్రారంభం, కేవలం రూ.1,999కే!
Also Read: రూ.13 వేలలోనే రియల్‌మీ కొత్త ఫోన్, 50 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఫీచర్లు!
Infinix Hot 12 Play: 7 జీబీ ర్యామ్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్న ఫోన్ రూ.9 వేలలోపే - సూపర్ ఫీచర్లు కదా!
Whatsapp End Support: ఈ ఫోన్లకు వాట్సాప్ ఇక పనిచేయదు - అధికారికంగా తెలిపిన మెటా - మీ మొబైల్స్ ఉన్నాయేమో చూసుకోండి!
Moto G52j: మోటొరోలా కొత్త ఫోన్ వచ్చేసింది - అదిరిపోయే ఫీచర్లు - ఫోన్ ఎలా ఉందో చూశారా?
Jio Free Data: ఉచితంగా డేటా, కాల్స్ అందిస్తున్న జియో - ఎవరికంటే?
Realme New Tablet: రియల్‌మీ కింగ్ ఆఫ్ ట్యాబ్లెట్స్ వచ్చేది అప్పుడే - ఫీచర్లు కూడా లీక్!
Konaseema Police Intelligence Failure : మరోసారి ఏపీ పోలీస్ ఇంటలిజెన్స్ ఫెయిల్ అయిందా ! కోనసీమ ఆందోళనలను లైట్ తీసుకున్నారా ?
Babu Pawan Reaction : పాలనా వైఫల్యాన్ని మా మీద నెడతారా ? ప్రభుత్వంపై పవన్, చంద్రబాబు ఆగ్రహం!
Quad Meet Tension : క్వాడ్ దేశాధినేతలను రెచ్చగొడుతున్న చైనా, రష్యా - మీటింగ్ సమీపంలో యుద్ధ విన్యాసాలు !
Cooking Oil Prices: వంట నూనెలపై గుడ్ న్యూస్ చెప్పనున్న కేంద్రం! సన్‌ఫ్లవర్ ఆయిల్ ధరపై..!