అన్వేషించండి

Poco X6 Neo: రూ.15 వేలలోపు పోకో 5జీ ఫోన్ - మొట్టమొదటి సారి నియో బ్రాండింగ్‌తో?

Poco New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ పోకో తన కొత్త ఫోన్‌ను భారతీయ మార్కెట్లో లాంచ్ చేయనుంది. అదే పోకో ఎక్స్6 నియో.

Poco X6 Neo India Launch: పోకో తన కొత్త స్మార్ట్ ఫోన్‌ను మనదేశంలో లాంచ్ చేయడానికి రెడీ అవుతోంది. ఈ స్మార్ట్ ఫోన్ నియో బ్రాండింగ్‌తో లాంచ్ అయ్యే మొదటి స్మార్ట్ ఫోన్ కానుంది. అదే పోకో ఎక్స్6 నియో. అయితే దీని గురించి ఇంతవరకు ఎటువంటి అధికారిక సమాచారం అందుబాటులో లేదు. దీనికి సంబంధించిన లాంచ్ టైమ్‌లైన్, ధర, స్పెసిఫికేషన్లు మాత్రం ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. 

ఈ లీకులను బట్టి పోకో ఎక్స్6 నియో వచ్చే నెలలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుందని తెలుస్తోంది. అలాగే 33W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీని కూడా అందించనున్నట్లు సమాచారం.

ప్రముఖ టిప్‌స్టర్ సంజు చౌదరి తెలుపుతున్న దాని ప్రకారం రూ.15 వేలలోపు ధరతోనే పోకో ఎక్స్6 నియో భారతీయ మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. 6.67 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లేను కంపెనీ ఈ ఫోన్‌లో అందించనుందని, దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉండనుందని వార్తలు వస్తున్నాయి. వాటర్ రెసిస్టెన్స్ కోసం ఐపీ54 రేటింగ్ ఉండనున్నట్లు తెలుస్తోంది. 3.5 ఎంఎం ఆడియో జాక్‌ను కూడా అందిస్తున్నారు.

గతంలో లాంచ్ అయిన రెడ్‌మీ నోట్ 13ఆర్ స్మార్ట్ ఫోన్‌కు రీబ్రాండెడ్ వెర్షన్‌గా పోకో ఎక్స్6 నియో మార్కెట్లో లాంచ్ కానుందని తెలుస్తోంది. రెడ్‌మీ నోట్ 13ఆర్ స్మార్ట్ ఫోన్ గతేడాది నవంబర్‌లో చైనాలో లాంచ్ అయింది. ఇందులో 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ అందించారు.

రెడ్‌మీ నోట్ 13ఆర్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఎంఐయూఐ 14 ఆపరేటింగ్ సిస్టంపై రెడ్‌మీ నోట్ 13ఆర్ పని చేయనుంది. ఈ ఫోన్‌లో 6.67 అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ప్రాసెసర్‌పై ఈ స్మార్ట్ ఫోన్ రన్ కానుంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 108 మెగాపిక్సెల్ కాగా, దీంతో పాటు 2 మెగాపిక్సెల్ సెన్సార్ కూడా అందుబాటులో ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా అందించడం విశేషం.

బ్లూటూత్, గ్లోనాస్, గెలీలియో, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, వైఫై, జీపీఎస్ కనెక్టివిటీ ఆప్షన్లు కూడా అందించారు. దీంతో పాటు లైట్ సెన్సార్, గ్రావిటీ సెన్సార్, డిస్టెన్స్ సెన్సార్లు ఉన్నాయి. ఫోన్ పక్కభాగంలో ఉన్న ఫింగర్ ప్రింట్ సెన్సార్ ద్వారా దీన్ని అన్‌లాక్ చేయవచ్చు. రెడ్‌మీ నోట్ 13ఆర్ బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 33W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. రెడ్‌మీ నోట్ 13ఆర్ మందం 0.77 సెంటీమీటర్లు కాగా, బరువు 175 గ్రాములుగా ఉంది.

Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!

Also Read: Oppo A2: ఎక్కువ స్టోరేజ్ ఫోన్ బడ్జెట్ ధరలో కావాలా? - 24 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఒప్పో ఫోన్ రూ.20 వేలకే!

టాప్ హెడ్ లైన్స్

Wired Earphones పెట్టుకున్నా ఫోన్‌ను ఛార్జ్ చేయొచ్చు! పోర్ట్ బ్లాక్ కాదు, ట్రిక్ తెలుసుకోండి
Wired Earphones పెట్టుకున్నా ఫోన్‌ను ఛార్జ్ చేయొచ్చు! పోర్ట్ బ్లాక్ కాదు, ట్రిక్ తెలుసుకోండి
WhatsApp AI Identifier: వాట్సప్ నుంచి సరికొత్త ఫీచర్.. ఏఐ ఫొటోలు, వీడియోలను గుర్తించేలా!
వాట్సప్ నుంచి సరికొత్త ఫీచర్.. ఏఐ ఫొటోలు, వీడియోలను గుర్తించేలా!
Tim Cook Net Worth: Apple మాజీ సీఈవో టిమ్ కుక్ నికర ఆస్తి విలువ ఎంత? సంస్థలో ఇక నుంచి కొత్త ఇన్నింగ్స్
Apple మాజీ సీఈవో టిమ్ కుక్ నికర ఆస్తి విలువ ఎంత? సంస్థలో ఇక నుంచి కొత్త ఇన్నింగ్స్
Android Apps వినియోగదారులకు అలర్ట్ ! మీ మొబైల్‌లో ఈ యాప్స్ ఉంటే రిమూవ్ చేయండి: MHA వార్నింగ్
Android Apps వినియోగదారులకు అలర్ట్ ! మీ మొబైల్‌లో ఈ యాప్స్ ఉంటే రిమూవ్ చేయండి: MHA వార్నింగ్

వీడియోలు

Ishan Kishan Century Duleep Trophy Final | సెలెక్టర్లకు గట్టి కౌంటర్ ఇచ్చిన ఇషాన్ కిషన్
Vaibhav Suryavanshi Duleep Trophy Final Knock | దులీప్ ట్రోఫీ ఫైనల్లో వైభవ్ విధ్వంసం
PCB Takes Custody Of Team Phones | పాకిస్తాన్ ప్లేయర్స్ ఫోన్లు సీజ్
Gundenininda Gudigantalu Serial September 7 | వరలక్ష్మీ వ్రతంలో రోహిణికి ట్విస్ట్
Cybercab Autonomous Robotaxi USA Public Rides | అమెరికాలో సైబర్ క్యాబ్ రైడ్స్ హల్‌చల్.. డ్రైవర్ కాదు స్టీరింగే లేని టెస్లా కార్ల విప్లవం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana High Court: తెలంగాణ అసెంబ్లీకి వెళ్లే ఎమ్మెల్యేలను పోలీసులు ఎలా అడ్డుకుంటారు: హోంశాఖకు హైకోర్టు నోటీసులు
తెలంగాణ అసెంబ్లీకి వెళ్లే ఎమ్మెల్యేలను పోలీసులు ఎలా అడ్డుకుంటారు: హోంశాఖకు హైకోర్టు నోటీసులు
Vijayasai Reddy Political Party: కమ్మ, రెడ్లే CM అవ్వాలా? మార్పు రావాలి.. విజయదశమి తరువాత పార్టీ ప్రకటన: విజయసాయిరెడ్డి
కమ్మ, రెడ్లే CM అవ్వాలా? మార్పు రావాలి.. విజయదశమి తరువాత పార్టీ ప్రకటన: విజయసాయిరెడ్డి
Man Burnt Alive In Car: దుండిగల్‌లోని బౌరంపేటలో కారులో మంటలు.. వ్యక్తి సజీవ దహనం- కేసు నమోదు
దుండిగల్‌లోని బౌరంపేటలో కారులో మంటలు.. వ్యక్తి సజీవ దహనం- కేసు నమోదు
Miss World 2027 : మిస్ వరల్డ్ 2027లో పోటీ చేయాలనుకుంటున్నారా? అర్హత, ఎంపిక ప్రక్రియ, ప్రిపరేషన్ వివరాలు ఇవే
మిస్ వరల్డ్ 2027లో పోటీ చేయాలనుకుంటున్నారా? అర్హత, ఎంపిక ప్రక్రియ, ప్రిపరేషన్ వివరాలు ఇవే
MLA Sunitha Laxma Reddy: పోలీసులు చీర పట్టి లాగారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కంటతడి
పోలీసులు చీర పట్టి లాగారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కంటతడి
Crime Thriller OTT : కేస్ ఫైల్ ఓపెన్ చేస్తే రక్తం కళ్ల చూడాల్సిందే - ఓటీటీ ట్రెండింగ్‌లో సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
కేస్ ఫైల్ ఓపెన్ చేస్తే రక్తం కళ్ల చూడాల్సిందే - ఓటీటీ ట్రెండింగ్‌లో సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
BRS MLC Tatha Madhu Disqualification: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు సభ్యత్వాన్ని రద్దు చేయాలి: మంత్రి సీతక్క డిమాండ్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు సభ్యత్వాన్ని రద్దు చేయాలి: మంత్రి సీతక్క డిమాండ్
Ranabaali Teaser Date : విజయ్ దేవరకొండ రష్మిక మూవీ నుంచి సర్‌ప్రైజ్ - రణబాలి టీజర్ అప్డేట్ వచ్చేసింది
విజయ్ దేవరకొండ రష్మిక మూవీ నుంచి సర్‌ప్రైజ్ - రణబాలి టీజర్ అప్డేట్ వచ్చేసింది
Embed widget