అన్వేషించండి

Playstation 5 Sale: పీఎస్5 కోసం వెయిటింగ్‌లో ఉన్నారా? అయితే గుడ్ న్యూస్!

ప్లేస్టేషన్ 5 స్టాక్ భారతదేశంలో మళ్లీ అందుబాటులోకి రానుంది. అక్టోబర్ 12వ తేదీ నుంచి దీనికి సంబంధించిన సేల్ జరగనుంది.

మనదేశంలో ప్లేస్టేషన్ 5 స్టాక్ మళ్లీ అందుబాటులోకి రానుంది. అంటే సేల్ మళ్లీ జరుగుతుందన్న మాట. అక్టోబర్ 12వ తేదీన మధ్యాహ్నం 12 గంటల నుంచి దీనికి సంబంధించిన సేల్ జరుగుతుందని సోనీ పేర్కొంది. 2021 ఫిబ్రవరిలో ఇవి మనదేశంలో లాంచ్ అయ్యాయి. ఇవి మొట్ట మొదటి సారి ప్రీ-ఆర్డర్లకు వచ్చినప్పుడు కేవలం ఐదు నిమిషాల్లోనే పూర్తిగా అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయాయి. తర్వాత ఎన్నిసార్లు సేల్‌కి వచ్చినా వెంటనే స్టాక్ అవుట్ సమస్య వచ్చేది. వినియోగదారులకు ఈ గేమింగ్ కన్సోల్‌పై ఉన్న క్రేజ్ అలాంటిది మరి.

సోనీ సెంటర్, గేమ్స్ ది షాప్ మాత్రమే ఇప్పుడు ప్రకటన ఇచ్చాయి. కాబట్టి వీటి సేల్ ఇందులో మాత్రమే జరిగే అవకాశం ఉంది. సేల్‌కు ఇంకా రెండు రోజుల సమయం ఉంది కాబట్టి ఇవి మిగతా ప్లా‌ట్‌ఫాంల్లో కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఆసక్తి గల వినియోగదారులకు ఇప్పుడు మళ్లీ వీటిని కొనుగోలు చేసేందుకు అవకాశం లభించింది. సోనీ అధికారిక ఆన్‌లైన్ స్టోర్ Shopatsc.com వెబ్‌సైట్లో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇచ్చారు.

ప్లేస్టేషన్ 5 ధర మనదేశంలో రూ.49,990గా ఉంది. ప్లేస్టేషన్ 5 డిజిటల్ ఎడిషన్ ధరను రూ.39,990గా నిర్ణయించారు. అమెరికాలో పీఎస్5 ధర 499.99 డాలర్లుగానూ(సుమారు రూ.36,700), పీఎస్5 డిజిటల్ ఎడిషన్ ధరను 399.99 డాలర్లుగానూ(సుమారు రూ.29,400) ఉంది. యాపిల్ తరహాలోనే పీఎస్5 ధర కూడా అమెరికా కంటే మనదేశంలోనే ఎక్కువగా ఉంది.

వీటికి సంబంధించిన డ్యూయల్ సెన్స్ కంట్రోలర్ ధరను రూ.5,990గానూ, హెచ్‌డీ కెమెరా ధరను రూ.5,190గానూ, పల్స్ 3డీ వైర్‌లెస్ హెడ్‌సెట్ ధరను రూ.2,590గానూ నిర్ణయించారు. దీని ద్వారా గేమ్‌ను లైవ్ స్ట్రీమింగ్ చేయవచ్చు. ఇక డ్యూయల్ సెన్స్ చార్జింగ్ స్టేషన్ ధర రూ.2,590గా ఉంది. అయితే కన్సోల్ కొన్న వారికి డ్యూయల్ సెన్స్ కంట్రోలర్ కూడా బాక్స్‌లో లభిస్తుంది.

సోనీ ప్లేస్టేషన్‌కు పోటీగా మైక్రోసాఫ్ట్ కూడా ఎక్స్‌బాక్స్ సిరీస్‌లో కొన్ని గేమింగ్ కన్సోల్స్‌ను మార్కెట్లో అందుబాటులోకి తీసుకువచ్చింది. వీటిలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌బాక్స్ సిరీస్ ఎస్ ధర రూ.34,990గానూ, ఎక్స్‌బాక్స్ సిరీస్ ఎక్స్ రూ.49,990గానూ ఉంది.

Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?

Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by PlayStation (@playstation)

టాప్ హెడ్ లైన్స్

WhatsApp User ID:వాట్సాప్ యూజర్ ఐడీతో చిక్కుల్లో మెటా! నోటీసులు పంపేందుకు సిద్ధమవుతున్న కేంద్ర ప్రభుత్వం!
వాట్సాప్ యూజర్ ఐడీతో చిక్కుల్లో మెటా! నోటీసులు పంపేందుకు సిద్ధమవుతున్న కేంద్ర ప్రభుత్వం!
New WhatsApp Subscription Plan: వాట్సాప్‌లో సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్ కాస్ట్ ఎంత? దీని వల్ల యూజ్ ఏంటీ? ఏయే ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి?
వాట్సాప్‌లో సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్ కాస్ట్ ఎంత? దీని వల్ల యూజ్ ఏంటీ? ఏయే ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి?
WhatsApp Hacks:వాట్సాప్‌లో పంపిన ఫోటోలు బ్లర్ అవుతున్నాయా? క్వాలిటీ పెంచే చిట్కాలు ఇవే! 
వాట్సాప్‌లో పంపిన ఫోటోలు బ్లర్ అవుతున్నాయా? క్వాలిటీ పెంచే చిట్కాలు ఇవే! 
WhatsApp Username: యూజర్‌నేమ్‌ను రిజర్వ్ చేసుకున్న తర్వాత వాట్సాప్ నుంచి నంబర్‌ను తీసేయవచ్చా?
యూజర్‌నేమ్‌ను రిజర్వ్ చేసుకున్న తర్వాత వాట్సాప్ నుంచి నంబర్‌ను తీసేయవచ్చా?

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Latest News:సవాళ్లు విసిరి పారిపోయారు, అసెంబ్లీలోనైనా చర్చ పెట్టండి! ప్రభుత్వానికి కేటీఆర్ ఛాలెంజ్‌ 
సవాళ్లు విసిరి పారిపోయారు, అసెంబ్లీలోనైనా చర్చ పెట్టండి! ప్రభుత్వానికి కేటీఆర్ ఛాలెంజ్‌ 
Breaking News: అమరావతి ఆపడం ఎవరితరం కాదు, గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది: ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి ఆపడం ఎవరితరం కాదు, గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది: ముఖ్యమంత్రి చంద్రబాబు
Amarnath Yatra 2026 : అమర్‌నాథ్ యాత్ర 2026.. ఈ డాక్యుమెంట్స్ లేకపోతే అనుమతి ఉండదు, కచ్చితంగా తీసుకెళ్లాల్సిందే
అమర్‌నాథ్ యాత్ర 2026.. ఈ డాక్యుమెంట్స్ లేకపోతే అనుమతి ఉండదు, కచ్చితంగా తీసుకెళ్లాల్సిందే
Telangana Police vs AP Police:హైదరాబాద్‌లో ఏపీ పోలీసులపై క్రిమినల్‌ కేసు! కేవీ రెడ్డి అరెస్టుతో రేగిన వివాదం!
హైదరాబాద్‌లో ఏపీ పోలీసులపై క్రిమినల్‌ కేసు! కేవీ రెడ్డి అరెస్టుతో రేగిన వివాదం!
Super Subbu OTT : ఓటీటీలోకి వచ్చేసిన సందీప్ కిషన్ కామెడీ సిరీస్ - సూపర్ సుబ్బు ఎందుకు చూడాలంటే?
ఓటీటీలోకి వచ్చేసిన సందీప్ కిషన్ కామెడీ సిరీస్ - సూపర్ సుబ్బు ఎందుకు చూడాలంటే?
Jana Nayagan Release Date : జన నాయగన్‌కు సెన్సార్ బోర్డ్ A సర్టిఫికెట్ - సీఎం విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
జన నాయగన్‌కు సెన్సార్ బోర్డ్ A సర్టిఫికెట్ - సీఎం విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
Gurthukosthunnayi Web Series Review - 'గుర్తుకొస్తున్నాయి' రివ్యూ: ETV Winలో కొత్త వెబ్ సిరీస్... నవ్వుల నోస్టాల్జియా బావుందా?
'గుర్తుకొస్తున్నాయి' రివ్యూ: ETV Winలో కొత్త వెబ్ సిరీస్... నవ్వుల నోస్టాల్జియా బావుందా?
Isakapatnam Web Series Review - 'ఇసకపట్నం' రివ్యూ: ప్రైమ్ వీడియోలో సముద్రఖని, ఐశ్వర్య రాజేష్‌ల వెబ్ సిరీస్ - ఎలా ఉందంటే?
'ఇసకపట్నం' రివ్యూ: ప్రైమ్ వీడియోలో సముద్రఖని, ఐశ్వర్య రాజేష్‌ల వెబ్ సిరీస్ - ఎలా ఉందంటే?
Embed widget