అన్వేషించండి

Oppo Reno 7 Series 5G: ఒప్పో రెనో సిరీస్ ఫోన్లు వచ్చేశాయ్, అదిరిపోయే కెమెరాలు, 5జీ కూడా! ధర ఎంతంటే?

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో మనదేశంలో కొత్త స్మార్ట్ ఫోన్ సిరీస్‌ను లాంచ్ చేసింది.

ఒప్పో రెనో 7 5జీ, ఒప్పో రెనో 7 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్లు మనదేశంలో లాంచ్ అయ్యాయి. చైనాలో లాంచ్ అయిన మోడళ్ల ఫీచర్ల కంటే వీటి స్పెసిఫికేషన్లు కొంచెం వేరుగా ఉన్నాయి. ఎంఐ 11ఎక్స్, రియల్‌మీ జీటీ మాస్టర్ ఎడిషన్, వన్‌ప్లస్ నార్డ్ 2లతో ఒప్పో రెనో 7 5జీ పోటీ పడనుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ, ఎంఐ 11ఐ హైపర్‌చార్జ్, రియల్‌మీ జీటీలతో రెనో 7 ప్రో 5జీ పోటీ పడనుంది.

ఒప్పో రెనో 7 5జీ, ఒప్పో రెనో 7 ప్రో 5జీ ధర
ఒప్పో రెనో 5జీ ధరను రూ.28,999గా నిర్ణయించారు. ఇందులో 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ఫోన్ సేల్ ఫిబ్రవరి 17వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.

ఒప్పో రెనో ప్రో 5జీ ధర రూ.39,999గా ఉంది. 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ సేల్ ఫిబ్రవరి 8వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. స్టార్‌లైట్ బ్లాక్, స్టార్‌ట్రయల్స్ బ్లూ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

ప్రారంభ ఆఫర్ కింద ఐసీఐసీఐ, కొటక్ మహీంద్రా బ్యాంకు, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకు, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫెడరల్ బ్యాంకు కార్డులతో కొనుగోలు చేస్తే 10 శాతం క్యాష్‌బ్యాక్ అందించనున్నారు. ఈఎంఐ క్యాష్‌బ్యాక్, నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా ఇందులో ఉన్నాయి.

ఒప్పో రెనో 7 5జీ స్పెసిఫికేషన్లు
ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత కలర్ఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనుంది. ఇందులో 6.4 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ యాస్పెక్ట్ రేషియో 20:9గానూ, రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గానూ ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ కూడా ఇందులో అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్‌గా ఉంది. 65W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ స్మార్ట్ ఫోన్ సపోర్ట్ చేయనుంది.

8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్‌ను ఈ స్మార్ట్ ఫోన్‌లో అందించారు. మీడియాటెక్ డైమెన్సిటీ 900 5జీ ప్రాసెసర్‌పై ఒప్పో రెనో 7 5జీ పనిచేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్ మందం 0.78 సెంటీమీటర్లు కాగా, బరువు 173 గ్రాములుగా ఉంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఈ స్మార్ట్ ఫోన్‌లో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ షూటర్, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కూడా ఇందులో అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్709 సెన్సార్‌ను అందించారు.

5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్, యాక్సెలరోమీటర్, మ్యాగ్నెటోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్‌లు కూడా ఇందులో అందించారు.

ఒప్పో రెనో 7 ప్రో 5జీ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 ఆధారిత కలర్ఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టంపైనే ఒప్పో రెనో 7 ప్రో 5జీ కూడా పనిచేయనుంది. ఇందులో 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది. ఇందులో కూడా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌నే అందించారు. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 1200 మ్యాక్స్ ప్రాసెసర్‌పై ఒప్పో రెనో 7 ప్రో 5జీ పనిచేయనుంది. 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు.

ఇందులో కూడా వెనకవైపు మూడు కెమెరాలే ఉన్నాయి. 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 766 సెన్సార్‌ను ప్రధాన కెమెరాగా అందిస్తుండగా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్‌లు కూడా ఇందులో ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరా అందించనున్నారు. 65W ఫాస్ట్ చార్జింగ్‌ను ఒప్పో రెనో 7 ప్రో 5జీ సపోర్ట్ చేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్ బరువు 0.75 సెంటీమీటర్లు కాగా.. బరువు 180 గ్రాములుగా ఉంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 CSK VS MI Result Update: చెన్నైదే పైచేయి.. ముంబైపై ఉత్కంఠ భ‌రిత విజ‌యం.. రుతురాజ్ కెప్టెన్స్ ఇన్నింగ్స్
చెన్నైదే పైచేయి.. ముంబైపై ఉత్కంఠ భ‌రిత విజ‌యం.. రుతురాజ్ కెప్టెన్స్ ఇన్నింగ్స్
AP Police: బెట్టింగ్లు ప్రమోట్ చేసేవాళ్లనే కాదు.. ఆడేవాళ్ళనీ వదిలేది లేదు: ఏపీ డీజీపీ వార్నింగ్
బెట్టింగ్లు ప్రమోట్ చేసేవాళ్లనే కాదు.. ఆడేవాళ్ళనీ వదిలేది లేదు: ఏపీ డీజీపీ వార్నింగ్
KTR Comments: బీఆర్ఎస్ ఓటమిలో ప్రజల తప్పు లేదు, కానీ సీఎం కుర్చీలో దొంగ !: కేటీఆర్
బీఆర్ఎస్ ఓటమిలో ప్రజల తప్పు లేదు, కానీ సీఎం కుర్చీలో దొంగ !: కేటీఆర్
Robinhood Trailer: నేను వస్తే లైఫ్ లాంగ్ క్వారంటైన్ - నితిన్ 'రాబిన్ హుడ్' ట్రైలర్ వేరే లెవల్ అంతే.. వార్నర్ ఎంట్రీ అదుర్స్..
నేను వస్తే లైఫ్ లాంగ్ క్వారంటైన్ - నితిన్ 'రాబిన్ హుడ్' ట్రైలర్ వేరే లెవల్ అంతే.. వార్నర్ ఎంట్రీ అదుర్స్..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

CSK vs MI Match Highlights IPL 2025 | ముంబైపై 4 వికెట్ల తేడాతో చెన్నై జయభేరి | ABP DesamSRH vs RR IPL 2025 Match Highlights | రాజస్థాన్ పై 44 పరుగుల తేడాతో సన్ రైజర్స్ ఘన విజయం | ABP DesamSRH vs RR IPL 2025 Match Highlights | ఉప్పల్ లో తన రికార్డును తనే బ్రేక్ చేసిన సన్ రైజర్స్ | ABP DesamCSK vs MI IPL 2025 Match Preview | నేడు చెన్నైతో తలపడుతున్న ముంబై | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 CSK VS MI Result Update: చెన్నైదే పైచేయి.. ముంబైపై ఉత్కంఠ భ‌రిత విజ‌యం.. రుతురాజ్ కెప్టెన్స్ ఇన్నింగ్స్
చెన్నైదే పైచేయి.. ముంబైపై ఉత్కంఠ భ‌రిత విజ‌యం.. రుతురాజ్ కెప్టెన్స్ ఇన్నింగ్స్
AP Police: బెట్టింగ్లు ప్రమోట్ చేసేవాళ్లనే కాదు.. ఆడేవాళ్ళనీ వదిలేది లేదు: ఏపీ డీజీపీ వార్నింగ్
బెట్టింగ్లు ప్రమోట్ చేసేవాళ్లనే కాదు.. ఆడేవాళ్ళనీ వదిలేది లేదు: ఏపీ డీజీపీ వార్నింగ్
KTR Comments: బీఆర్ఎస్ ఓటమిలో ప్రజల తప్పు లేదు, కానీ సీఎం కుర్చీలో దొంగ !: కేటీఆర్
బీఆర్ఎస్ ఓటమిలో ప్రజల తప్పు లేదు, కానీ సీఎం కుర్చీలో దొంగ !: కేటీఆర్
Robinhood Trailer: నేను వస్తే లైఫ్ లాంగ్ క్వారంటైన్ - నితిన్ 'రాబిన్ హుడ్' ట్రైలర్ వేరే లెవల్ అంతే.. వార్నర్ ఎంట్రీ అదుర్స్..
నేను వస్తే లైఫ్ లాంగ్ క్వారంటైన్ - నితిన్ 'రాబిన్ హుడ్' ట్రైలర్ వేరే లెవల్ అంతే.. వార్నర్ ఎంట్రీ అదుర్స్..
SRH Vs RR Result Update:  స‌న్ రైజ‌ర్స్ గ్రాండ్ విక్ట‌రీ.. ఈ సీజ‌న్లో సొంత‌గ‌డ్డ‌పై గెలిచిన‌ తొలి జ‌ట్టు.. పోరాడి ఓడిన రాజ‌స్థాన్.. జురెల్, శాంస‌న్ పోరాటం వృథా 
స‌న్ రైజ‌ర్స్ గ్రాండ్ విక్ట‌రీ.. పోరాడి ఓడిన రాజ‌స్థాన్.. జురెల్, శాంస‌న్ పోరాటం వృథా 
David Warner: శ్రీవల్లి స్టెప్ వేసిన డేవిడ్ భాయ్... 'రాబిన్‌హుడ్‌' ప్రీ రిలీజ్‌లో వార్నర్ మెరుపుల్
శ్రీవల్లి స్టెప్ వేసిన డేవిడ్ భాయ్... 'రాబిన్‌హుడ్‌' ప్రీ రిలీజ్‌లో వార్నర్ మెరుపుల్
Rohit Sharma Duck Outs: రోహిత్ శర్మ ఖాతాలో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు
రోహిత్ శర్మ ఖాతాలో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు
CM Chandrababu: అన్న క్యాంటీన్ కు రూ.1 కోటి విరాళం, చంద్రబాబుకు చెక్ అందించిన నార్నే రంగారావు ఫ్యామిలీ
అన్న క్యాంటీన్ కు రూ.1 కోటి విరాళం, చంద్రబాబుకు చెక్ అందించిన నార్నే రంగారావు ఫ్యామిలీ
Embed widget