By: ABP Desam | Updated at : 07 Apr 2022 08:42 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
వన్‌ప్లస్ టీవీ 43 వై1ఎస్ ప్రో స్మార్ట్ టీవీ మనదేశంలో లాంచ్ అయింది. (Image Credits: OnePlus)
వన్‌ప్లస్ తన టీవీ వై సిరీస్‌ను మనదేశంలో విస్తరిస్తుంది. వన్‌ప్లస్ టీవీ వై1ఎస్ ప్రో సిరీస్‌లో 43 అంగుళాల వేరియంట్‌ను కంపెనీ లాంచ్ చేసింది. ఇందులో వన్‌ప్లస్ వినియోగదారులకు ఎంతో యూజర్ ఫ్రెండ్లీగా ఉండే కనెక్టెడ్ ఎకో సిస్టంను అందించారు. ఇందులో అప్‌గ్రేడెడ్ 4కే యూహెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు. సరౌండ్ సౌండ్ సిస్టం, డాల్బీ ఆడియో టెక్నాలజీ ఇందులో అందుబాటులో ఉండనున్నాయి.
వన్‌ప్లస్ టీవీ వై1ఎస్ ప్రో ధర
ఈ టీవీ ధరను మనదేశంలో రూ.29,999గా నిర్ణయించారు. ఏప్రిల్ 11వ తేదీ నుంచి ఈ టీవీ సేల్ మనదేశంలో ప్రారంభం కానుంది. అమెజాన్, వన్‌ప్లస్ సైట్లలో ఈ టీవీ కొనుగోలు చేయవచ్చు. వీటితో పాటు వన్‌ప్లస్ ఎక్స్‌పీరియన్స్ స్టోర్లు, క్రోమా, రిలయన్స్ డిజిటల్, ఇతర ఆఫ్‌లైన్ పార్ట్‌నర్ స్టోర్లలో ఈ టీవీని కొనుగోలు చేయవచ్చు.
వన్‌ప్లస్ టీవీ వై1ఎస్ ప్రో స్పెసిఫికేషన్లు
ఇందులో 43 అంగుళాల 4కే యూహెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు. ఇందులో గామా ఇంజిన్‌ను అందించారు. దీని ద్వారా ఇమేజ్ క్వాలిటీ మరింత పెరగనుంది. దీంతోపాటు హెచ్‌డీఆర్10+, హెచ్‌డీఆర్10, హెచ్ఎల్‌జీ ఫార్మాట్లను ఇది సపోర్ట్ చేయనుంది. సరౌండ్ సౌండ్ సిస్టం, డాల్బీ ఆడియో టెక్నాలజీ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
ఈ కొత్త స్మార్ట్ టీవీ హోం ఎంటర్‌టైన్‌మెంట్ హబ్‌గా కూడా పనిచేయనుంది. ఆండ్రాయిడ్ టీవీ 10 ప్లాట్‌ఫాంపై ఈ టీవీ పనిచేయనుంది. ఇందులో స్మార్ట్ మేనేజర్ ఫీచర్‌ను అందించారు. వన్‌ప్లస్ కనెక్ట్ 2.0 టెక్నాలజీని కూడా ఇందులో అందించారు. దీని ద్వారా వైఫై, సెల్యులార్ కనెక్షన్ అవసరం లేకుండా వన్‌ప్లస్ ఫోన్లను టీవీకి కనెక్ట్ చేసుకోవచ్చు.
ఈ స్మార్ట్ టీవీలో గేమ్ మోడ్‌ను కూడా అందించారు. దీంతో గేమింగ్ కన్సోల్‌ను హెచ్‌డీఎంఐ ద్వారా కనెక్ట్ చేసుకుని ఆటో లో లేటెన్సీ మోడ్‌ను ఎనేబుల్ చేయవచ్చు. దీంతో గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ మరింత స్మూత్‌గా ఉండనుంది. కిడ్స్ మోడ్ ద్వారా పిల్లలు టీవీలో ఏం చూస్తున్నారో పేరెంట్స్ తెలుసుకోవచ్చు.
Also Read: యాపిల్ అత్యంత చవకైన 5జీ ఫోన్ వచ్చేసింది - లేటెస్ట్ ప్రాసెసర్‌తో - ధర ఎంతంటే?
Also Read: కొత్త ఐప్యాడ్ వచ్చేసింది - అన్నీ లేటెస్ట్ ఫీచర్లే - ధర ఎంతంటే?
Nothing Phone 1: మోస్ట్ అవైటెడ్ స్మార్ట్ ఫోన్ ధర లీక్ - లాంచ్ డేట్ కూడా!
Vivo T2x 5G: రూ.11 వేలలోనే వివో 5జీ ఫోన్ - 6000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా!
Samsung Galaxy M13: శాంసంగ్ కొత్త ఫోన్ వచ్చేసింది - ధర బడ్జెట్లోనే?
Xiaomi New TV: ఈ టీవీ ఇంట్లో ఉంటే థియేటర్‌కి వెళ్లక్కర్లేదుగా - అదిరిపోయే ఎక్స్‌పీరియన్స్!
Motorola 200MP Camera Phone: మోటొరోలా సూపర్ కెమెరా ఫోన్ వచ్చేస్తుంది... 200 మెగాపిక్సెల్ సెన్సార్‌తో!
Writer Review - 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?
Texas School Shooting : మృత్యుంజయురాలు ఆ చిన్నారి - అమెరికాలో కాల్పుల నుంచి ఎలా తప్పించుకుందంటే ?
Kishan Reddy On TRS: తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి పెట్టుబడులు కేంద్రం ఘనతే- ప్రజలు గమనిస్తున్నారన్న కిషన రెడ్డి
AP In Davos : దావోస్ నుంచి ఏపీకి రూ. 1లక్షా 25వేల కోట్ల పెట్టుబడులు - జగన్ పర్యటన విజయవంతమయిందన్న ప్రభుత్వం !