అన్వేషించండి

OnePlus 12: వన్‌ప్లస్ 12 భారతీయ వెర్షన్ ధర లీక్ - ఎంతగా ఉండనుందంటే?

OnePlus 12 Expected Price: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ త్వరలో వన్‌ప్లస్ 12ను లాంచ్ చేయనుంది. దీని ధర ఇప్పుడు ఆన్‌లైన్‌లో లీక్ అయింది.

OnePlus 12 Price Leak: వన్‌ప్లస్ 12 స్మార్ట్ ఫోన్‌ను కంపెనీ త్వరలో మనదేశంలో లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ 2023 చివర్లో చైనాలో లాంచ్ అయింది. జనవరి 23వ తేదీన ఈ ఫోన్ భారతదేశ మార్కెట్లో ఎంట్రీ ఇవ్వనుంది. అనుకోకుండా అమెజాన్ ఇండియా పేజీలో దీని ధర బయటకు వచ్చింది. వన్‌ప్లస్ 12 మొబైల్‌లో అమోఎల్ఈడీ డిస్‌ప్లే ఉండనుంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2కే రిజల్యూషన్ ఫీచర్లు వన్‌ప్లస్ 12 డిస్‌ప్లేలో ఉండనున్నాయి. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌ను ఇందులో అందించనున్నారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5400 ఎంఏహెచ్ కాగా, 100W వైర్డ్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది.

ప్రముఖ టిప్‌‌స్టర్ ఇషాన్ అగర్వాల్ వన్‌ప్లస్ 12కు సంబంధించిన అమెజాన్ లిస్టింగ్‌ను కనుగొన్నాడు. ఇషాన్ షేర్ చేసిన స్క్రీన్ షాట్ ప్రకారం దీని ధర రూ.69,999గా ఉండనుంది. ఇది 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధర.

ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 14 ఆపరేటింగ్ సిస్టంపై పని చేయనుంది. ఇందులో 6.82 అంగుళాల క్వాడ్ హెచ్‌డీ+ ఎల్టీపీవో అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు. క్వాల్‌కాం లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్ 8 జెన్ 3 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. 24 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్ ఇందులో ఉండనుంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు హాజిల్‌బ్లాడ్ బ్రాండెడ్ మూడు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 50 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 64 మెగాపిక్సెల్ టెలిఫొటో కెమెరా అందించనున్నారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ సెన్సార్ ఉండనుంది. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, అలెర్ట్ స్లైడర్ కూడా ఈ ఫోన్‌లో చూడవచ్చు. 1 టీబీ వరకు స్టోరేజ్ ఈ ఫోన్‌లో అందించనున్నారు.

వన్‌ప్లస్ నార్డ్ 3 బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఇటీవలే మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో రెండు వేరియంట్లు మార్కెట్లోకి ఎంట్రీ వచ్చాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.29,999గా ఉంది. ఇక టాప్ ఎండ్ వేరియంట్ అయిన 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.34,999గా నిర్ణయించారు. మిస్టీ గ్రీన్, టెంపెస్ట్ గ్రే కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 13 ఆపరేటింగ్ సిస్టంపై ఈ స్మార్ట్ ఫోన్ పని చేయనుంది. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 9000 ప్రాసెసర్‌ వన్‌ప్లస్ నార్డ్ 3లో ఉంది. 16 జీబీ ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్ అందించారు. 6.74 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లే కూడా ఇందులో ఉంది. హెచ్‌డీఆర్10+ ఫీచర్‌ను కూడా సపోర్ట్ చేయనుంది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో హెచ్‌డీఆర్ కంటెంట్‌ను ఇందులో స్ట్రీమ్ చేయవచ్చు.

ఈ స్మార్ట్ ఫోన్‌లో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. ప్రధాన కెమెరాగా 50 మెగాపిక్సెల్‌ సామర్థ్యమున్న సోనీ ఐఎంఎక్స్890 సెన్సార్‌ ఉంది. 8 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్355 సెన్సార్‌ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాగా అందించారు. వీటితో పాటు 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపు 16 మెగా పిక్సెల్ కెమెరా అందించారు.

Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!

Also Read: Oppo A2: ఎక్కువ స్టోరేజ్ ఫోన్ బడ్జెట్ ధరలో కావాలా? - 24 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఒప్పో ఫోన్ రూ.20 వేలకే!

టాప్ హెడ్ లైన్స్

Laptop Overheating : ల్యాప్‌టాప్ వేడెక్కుతోందా? ఎలాంటి సాఫ్ట్‌వేర్ లేకుండా ఈ సింపుల్ టిప్స్‌తో తగ్గించేయండి
ల్యాప్‌టాప్ వేడెక్కుతోందా? ఎలాంటి సాఫ్ట్‌వేర్ లేకుండా ఈ సింపుల్ టిప్స్‌తో తగ్గించేయండి
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
WhatsApp update: పాత ఫోన్‌లలో వాట్సాప్ సేవలు బంద్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!
పాత ఫోన్‌లలో వాట్సాప్ సేవలు బంద్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!
Smart TVs : స్మార్ట్ టీవి కొనాలనుకుంటున్నారా ? అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 40 నుంచి 50 వేల లోపు బెస్ట్ టీవీలు ఇవే
స్మార్ట్ టీవి కొనాలనుకుంటున్నారా ? అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 40 నుంచి 50 వేల లోపు బెస్ట్ టీవీలు ఇవే

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
Tiger Rescue Operation: దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
IndiGo Flight Emergency Landing: విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
Supreme Court On CJP Protest: శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
RT78 Movie : వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
PM Modi Chennai Tour: సీఎం విజయ్‌తో కలిసి చెన్నై మెట్రోలో ప్రధాని మోదీ ప్రయాణం- రూ.13 వేల కోట్ల ప్రాజెక్టుల ప్రారంభం!
సీఎం విజయ్‌తో కలిసి చెన్నై మెట్రోలో ప్రధాని మోదీ ప్రయాణం- రూ.13 వేల కోట్ల ప్రాజెక్టుల ప్రారంభం!
Durga Idol Immersion: దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
Embed widget