Nokia Affordable Phone: రూ.6 వేలలోనే నోకియా కొత్త ఫోన్ - ఫీచర్లు ఎలా ఉన్నాయి?
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ నోకియా తన కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. అదే నోకియా సీ2 సెకండ్ ఎడిషన్. దీని ధర రూ.7 వేలలోపే ఉంది.
Nokia C2 2nd Edition: నోకియా కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో లాంచ్ అయింది. అదే నోకియా సీ2 సెకండ్ ఎడిషన్. ఇందులో 5.7 అంగుళాల ఎఫ్‌డబ్ల్యూవీజీఏ డిస్‌ప్లేను అందించారు. ఆక్టాకోర్ మీడియాటెక్ ప్రాసెసర్‌ను అందించారు. వెనకవైపు ఒక కెమెరానే అందించారు.
నోకియా సీ2 సెకండ్ ఎడిషన్ ధర (Nokia C2 2nd Edition Price)
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 2 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్‌తో ఉన్న ఈ వేరియంట్ ధరను 79 యూరోలుగా (సుమారు రూ.6,700) నిర్ణయించారు. ఈ ఫోన్ మనదేశంలో ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు. ఒకవేళ లాంచ్ అయితే రూ.ఆరు వేలలోపే దీని ధర ఉండే అవకాశం ఉంది.
నోకియా సీ2 సెకండ్ ఎడిషన్ స్పెసిఫికేషన్లు (Nokia C2 2nd Edition Specifications)
ఆండ్రాయిడ్ 11 (గో ఎడిషన్) ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 5.7 అంగుళాల ఎఫ్‌డబ్ల్యూవీజీఏ డిస్‌ప్లేను అందించారు. క్వాడ్‌కోర్ మీడియాటెక్ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 2 జీబీ వరకు ర్యామ్, 32 జీబీ వరకు స్టోరేజ్‌ను ఇందులో అందించారు. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 256 జీబీ వరకు పెంచుకోవచ్చు.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఇందులో వెనకవైపు 5 మెగాపిక్సెల్ సెన్సార్ ఉండనుంది. ఇది ఒక ఫిక్స్‌డ్ ఫోకస్ లెన్స్. దీంతోపాటు ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 2 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.
4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5, జీపీఎస్/ఏ-జీపీఎస్, వైర్‌లెస్ ఎఫ్ఎం రేడియో, మైక్రో యూఎస్‌బీ, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో అందించారు. యాక్సెలరో మీటర్ కూడా ఇందులో ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 2400 ఎంఏహెచ్‌గా ఉంది. రెండు కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
Here are the new budget Nokias #NokiaC21 #NokiaC21Plus #NokiaC22ndEdition #MWC2022 #NokiaMobile #NewLaunch #LoveNokia pic.twitter.com/mZ4Vll586A
— LoveNokia (@LoveNokiaBlog) February 27, 2022
Nokia C2 2nd Edition,
— DaTechPro (@DaTechPro1) February 27, 2022
Nokia C21,
Nokia C21 Plus Launched....#nokia #nokiaC2 #nokiaC21 #nokiaC21plus pic.twitter.com/jkMnYprea9