అన్వేషించండి

Instagram:ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లకు గుడ్ న్యూస్- అందుబాటులోకి మరో ఫీచర్

Instagram:ఇన్‌స్టాగ్రామ్‌ కంటెంట్ క్రియేటర్లకు సరికొత్త పీచర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై ఫొటోలను 3:4 రేషియోలో అప్‌లోడ్ చేసుకోవచ్చు.

Instagram: ఫొటో, వీడియో షేరింగ్‌ ప్లాట్‌ఫామ్‌ అయిన ఇన్‌స్ట్రాగ్రామ్‌ తాజాగా మరో కొత్త వెసులుబాటు ఇన్‌స్టాగ్రామ్‌. ఇప్పటి వరకు యూజర్లు తమ ఫొటోలను పోస్టు చేయాలంటే 1:1 స్క్వేర్‌ లేదా 4:5 రెక్టాంగిల్‌ ఫార్మాట్‌లోనే వీడియోలు, ఫొటోలు పోస్టు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు మరో వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. ఇకపై 3:4 యాస్పెక్ట్ రేషియోలో ఫొటోలను పోస్టు చేయవచ్చు. 
ఇన్‌స్టాగ్రామ్ హెడ్ అడమ్‌ మోస్సెరి సోషల్ మీడియాలో ఈ అప్‌డేట్‌ను అధికారికంగా ప్రకటించారు. ఇకపై ఇన్‌స్ట్రాగ్రామ్‌లో 3:4 యాస్పెక్ట్‌ రేషియోలో ఫొటోలను నేటివ్‌గా ఫోటోలు- అంటే ప్రతి ఫోన్ కెమెరా డిఫాల్ట్‌గా తీసే పార్మాట్‌- సపోర్ట్‌ చేస్తుంది. మీరు 3:4 ఫొటోను అప్‌లోడ్ చేస్తే అది మీ కెమెరాలో కనిపించినట్టే ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా కనిపిస్తుంది. అని మోస్సెరీ తెలిపారు. 

క్రాప్ చేయాల్సి అవసరం లేదు
ఇంతకు ముందు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలను పోస్టు చేయాలంటే వాటిని తప్పనిసరిగా  స్క్వేర్‌ లేదా 4:5 ఫార్మాట్‌కు క్రాప్ చేయాల్సి వచ్చిది. ఇప్పుడు 3:4 ఫార్మాట్‌తో యూజర్లు తమ ఫొటోలను ెలాంటి మార్పులు చేయకుండా, ఒరిజినల్‌ డైమెన్షన్స్‌లోనే పోస్టు చేయవచ్చు. ఒకే ఫొటో అయినా మల్టిపుల్ ఇమేజ్‌ అయినా, ఇప్పుడు అవి నేటివ్‌ వర్టికల్‌ ఫార్మాట్‌లోనే డిస్‌ప్లే అవుతాయి. 

వెర్టికల్ కంటెంట్‌కు మరింత అనుకూలం
రీల్స్, ఫుల్ స్క్రీన్‌ స్టోరీస్ వంటివి వచ్చిన తర్వాత ఫార్మాట్‌ కంటెంట్‌కు డిమాండ్ పెరుగుతోంది. అందుకే ఇన్‌స్టాగ్రామ్‌ కూడా తన ప్రొఫైల్‌ గ్రిడ్‌ను మారుస్తూ, పోస్టులకు స్క్వేర్ కాకుండా రెక్టాంగులరర్‌ ప్రివ్యూలు చూపిస్తోంది. ఇప్పుడు 3:4 ఫార్మాట్‌ రావడంతో, ఫొటోగ్రాఫర్లు తమ ఫొటోలను మరింత నేచురల్‌గా, మొబైల్‌ స్క్రీన్‌కు అనుగుణంగా ప్రదర్శించుకోవచ్చు. 

మొబైల్ ఫొటోగ్రాఫర్‌కు అనుకూలం
ఈ అప్‌డేట్‌ వల్ల సాధారణ యూజర్లు, ప్రొఫెషనల్‌ ఫొటోగ్రాఫర్లు అందరూ తమ మొబైల్‌ ఫొటోలు హై క్వాలిటీ, ఒరిజినల్‌ ఫార్మాట్‌లో షేర్‌ చేయవచ్చు. ఫాలోవర్లకు కూడా మరింత అందంగా, అసలైన ఫొటో అనుభూతి లభిస్తుంది. 

3:4 ఫీచర్‌ను ఎలా ఉపయోగించాలి?

  • మీ ఫోన్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ ఓపెన్ చేయండి 
  • 3:4 ఫార్మాట్‌లో తీసిన ఫొటోను అప్‌లోడ్ చేయండి
  • ఇన్‌స్టాగ్రామ్‌ మీ ఫొటోను అదే ఫార్మాట్‌లో ప్రివ్యూలో, ఫీడ్‌లో చూపిస్తుంది. 
  • ఇకపై మాన్యువల్‌గా క్రాప్‌ చేయాల్సిన అవసరం లేదు.

ఇన్‌స్టాగ్రామ్‌ తాజా అప్‌డేట్‌ 3:4 ఫోటో ఫార్మాట్‌కు పూర్తి సపోర్ట్‌ వచ్చింది. యూజర్లు తమ మొబైల్‌ ఫొటోలను అసలైన డైమెన్షన్స్‌లో, ఎలాంటి మార్పులు లేకుండా పోస్ట్ చేయొచ్చు. ఇది ఫొటోగ్రాఫర్లకు, కంటెంట్‌ క్రయేటర్లకు నిజంగా సూపర్ న్యూస్‌.  

 క్రియేటివ్ ఫ్రీడమ్‌కు మార్గం 
ఈ మార్పుతో ఫొటోగ్రాఫర్లు తమ క్రియేటివిటీని మరింత స్వేచ్చగా ప్రదర్శించుకోవచ్చు. ఫొటోలో ఉన్న అసలైన కాంపోజిషన్, ఆర్టిస్టిక్‌ టచ్, ఫ్రేమింగ్‌ అని సెట్  చేసుకోవచ్చు. క్రియేటర్లకు ఇది ఒక పెద్ద ఊరట. ఇకపై ఫొటోను పోస్టు చేయాలంటి ఎడిటింగ్‌, క్రాప్‌, రీసైజ్‌ వంటి పనులు చేయాల్సిన అవసరం లేదు. 

యూజర్‌లకు సరికొత్త అనుభూతి 

ఈ ఫీచర్‌తో యూజర్‌ల అనుభవం మరింత మెరుగు అవుతుంది. ఫీడ్‌లో స్క్రోల్ చేస్తుంటే, ఫొటోలు పూర్తిస్థాయిలో అసలైన రూపంలో కనిపిస్తాయి. ఇది ఫాలోవర్లకు కూడ కొత్త అనుభూతిని ఇస్తుంది. 

టాప్ హెడ్ లైన్స్

SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
OTP Tip To Check Call History: పూర్తి కాల్ హిస్టరీ చేయడానికి OTPని ఎలా ఉపయోగించాలి?
పూర్తి కాల్ హిస్టరీ చేయడానికి OTPని ఎలా ఉపయోగించాలి?
iPhone Sypware Alert: ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
Microsoft Alert: హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
Embed widget