అన్వేషించండి

కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసిన వివో - ధర ఎంతంటే?

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో తన కొత్త 5జీ ఫోన్‌ను చైనాలో లాంచ్ చేసింది. అదే వివో వై75ఎస్ 5జీ.

వివో వై75ఎస్ 5జీ స్మార్ట్ ఫోన్ చైనాలో బుధవారం లాంచ్ అయింది. ఇందులో 6.58 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్సీడీ స్క్రీన్‌ను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్‌గా ఉంది. ఈ ఫోన్‌లో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్‌గా ఉంది.

వివో వై75ఎస్ 5జీ ధర
ఈ ఫోన్‌లో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధర 1,899 యువాన్లుగా (సుమారు రూ.22,000) ఉంది. టాప్ ఎండ్ వేరియంట్ అయిన 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 2,199 యువాన్లుగా (సుమారు రూ.25,000) నిర్ణయించారు. బ్లాక్, గ్రేడియంట్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ త్వరలో మనదేశంలో కూడా లాంచ్ కానుంది.

వివో వై75ఎస్ 5జీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఇందులో 6.58 అంగుళాల కర్వ్‌డ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్‌గా ఉంది. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో 700 5జీ ప్రాసెసర్ ద్వారా ఈ ఫోన్ రన్ అవ్వనుంది.12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరాను కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది.

ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఆరిజిన్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ రన్ అవ్వనుంది. డ్యూయల్ 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5.1, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌లను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.85 సెంటీమీటర్లు కాగా, బరువు 179 గ్రాములుగా ఉంది.

వివో వై52టీ స్మార్ట్ ఫోన్ ఇటీవలే చైనాలో లాంచ్ అయింది. ఇందులో రెండు వేరియంట్లు మార్కెట్లోకి వచ్చాయి. వీటిలో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 1,299 యువాన్లుగానూ (సుమారు రూ.14,900), 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,499 యువాన్లుగానూ (సుమారు రూ.17,000) ఉంది.

ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టంపై వివో వై52టీ పని చేయనుంది. ఇందులో 6.56 అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 10W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు. మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.

ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ సెన్సార్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా అందించారు.

Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?

Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
Telangana Rising Global Summit: 'తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2.0' కు చురుగ్గా ఏర్పాట్లు.. డిసెంబరు 7 నుంచి 9 వరకు నిర్వహణ
'తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2.0' కు చురుగ్గా ఏర్పాట్లు.. డిసెంబరు 7 నుంచి 9 వరకు నిర్వహణ
Ambani vs Elon Musk: భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
బతుకమ్మ 2026: తీరొక్క పూల జాతర.. ఏ రోజు ఏ బతుకమ్మ, నైవేద్యం?
బతుకమ్మ 2026: తీరొక్క పూల జాతర.. ఏ రోజు ఏ బతుకమ్మ, నైవేద్యం?

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
Telangana Rising Global Summit: 'తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2.0' కు చురుగ్గా ఏర్పాట్లు.. డిసెంబరు 7 నుంచి 9 వరకు నిర్వహణ
'తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2.0' కు చురుగ్గా ఏర్పాట్లు.. డిసెంబరు 7 నుంచి 9 వరకు నిర్వహణ
Ambani vs Elon Musk: భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
బతుకమ్మ 2026: తీరొక్క పూల జాతర.. ఏ రోజు ఏ బతుకమ్మ, నైవేద్యం?
బతుకమ్మ 2026: తీరొక్క పూల జాతర.. ఏ రోజు ఏ బతుకమ్మ, నైవేద్యం?
ACB Raids Civil Supplies DM: సివిల్ సప్లైస్ డీఎం ఇళ్లపై ఏసీబీ దాడులు.. రూ.40 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు , గతంలో రెండు సార్లు సస్పెండ్
సివిల్ సప్లైస్ డీఎం ఇళ్లపై ఏసీబీ దాడులు.. రూ.40 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు , గతంలో రెండు సార్లు సస్పెండ్
కేవలం రూ.21,000తో Renault Duster hybrid బుకింగ్స్ ప్రారంభం.. లీటర్‌కు 29 కి.మీ. అదిరిపోయే మైలేజ్!
లీటర్‌కు 29 కి.మీ. మైలేజ్ ఇచ్చే సూపర్‌ SUV.. రెనాల్ట్‌ డస్టర్ హైబ్రిడ్ బుకింగ్స్ ప్రారంభం, రూ.21,000 చాలు
Abhijeet Dipke Detained: విమానం నుంచే అభిజీత్ దీప్కేను అదుపులోకి తీసుకున్న మహిళా పోలీసులు.. సీజేపీ వీడియోలు వైరల్
విమానం నుంచే అభిజీత్ దీప్కేను అదుపులోకి తీసుకున్న మహిళా పోలీసులు.. సీజేపీ వీడియోలు వైరల్
Vijay TVK Win: తమిళనాడు ఉపపోరులో విజయ్ టీవీకే విజయం - ద్రవిడ పార్టీల ఓట్ల చీలికే కాపాడిందా?
తమిళనాడు ఉపపోరులో విజయ్ టీవీకే విజయం - ద్రవిడ పార్టీల ఓట్ల చీలికే కాపాడిందా?
Embed widget