అన్వేషించండి

Vivo X90 Pro: ఎనిమిది నిమిషాల్లోనే 50 శాతం చార్జింగ్ - వివో ఎక్స్90 ప్రో వచ్చేసింది!

వివో ఎక్స్-సిరీస్‌లోని టాప్ ఎండ్ మోడల్స్‌లో ఎక్స్90 మొబైల్ లాంచ్ అయింది.

వివో ఎక్స్90 ప్రో స్మార్ట్ ఫోన్‌ను బ్రాండ్ బుధవారం చైనాలో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9200 ప్రాసెసర్‌పై పని చేయనుంది. ఈ ఫోన్ షావోమీ 12 ప్రో, వన్‌ప్లస్ 10 ప్రో ఫోన్లతో పోటీ పడనుంది. 512 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో అందించారు

వివో ఎక్స్90 ప్రో ధర
ఇందులో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 4,999 యువాన్లుగానూ (సుమారు రూ.57,000), 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 5,499 యువాన్లుగానూ (సుమారు రూ.62,000) ఉంది. ఇక టాప్ ఎండ్ వేరియంట్ అయిన 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 5,999 యువాన్లుగా (సుమారు రూ.68,000) నిర్ణయించారు. చైనా రెడ్, ఒరిజినల్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ త్వరలో ఇండియాలో కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

వివో ఎక్స్90 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఆరిజిన్ ఓఎస్ 3 ఆపరేటింగ్ సిస్టంతో వివో ఎక్స్90 ప్రో లాంచ్ అయింది. ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.78 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని డిస్‌ప్లే యాస్పెక్ట్ రేషియో 20:09గా ఉంది. ఈ ఫోన్ స్క్రీన్ టు బాడీ రేషియో 93.53 శాతంగానూ, రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గానూ ఉంది. ఆక్టాకోర్ 4ఎన్ఎం మీడియాటెక్ డైమెన్సిటీ 9200 ప్రాసెసర్‌పై ఈ స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది. 12 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ కూడా ఇందులో అందించారు.

ఇక కెమెరాల విషయానికి వస్తే... వివో ఎక్స్90 ప్రోలో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరాగా 50 మెగాపిక్సెల్ జీస్ వన్ ఇంచ్ సెన్సార్‌ను అందించారు. ఈ సెన్సార్‌తో పాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 12 మెగాపిక్సెల్ పొర్‌ట్రెయిట్ సెన్సార్ కూడా అందుబాటులో ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరా కూడా అందించారు.

దీని బ్యాటరీ సామర్థ్యం 4870 ఎంఏహెచ్‌గా ఉంది. 120W ఫాస్ట్ చార్జింగ్‌, 50W వైర్‌లెస్ ఫాస్ట్ చార్జింగ్ కూడా వివో ఎక్స్90 ప్రో సపోర్ట్ చేయనుంది. 0 నుంచి 50 శాతం చార్జింగ్ కేవలం 8 నిమిషాల్లోనే చార్జింగ్ ఎక్కనుంది. 5జీని కూడా వివో ఎక్స్90 ప్రో సపోర్ట్ చేయనుంది. వైఫై 6, బ్లూటూత్ వీ5.3, ఎన్ఎఫ్ఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి. దీని బరువు 214.85 గ్రాములుగా ఉంది.

Also Read: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: సంక్రాంతి సంబరాల్లో సీఎం చంద్రబాబు ఫ్యామిలీ - సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా దేవాన్ష్, అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన
సంక్రాంతి సంబరాల్లో సీఎం చంద్రబాబు ఫ్యామిలీ - సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా దేవాన్ష్, అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన
Publicity gold:  కోటి రూపాయల పతంగి అంట  - నమ్మేద్దామా ?
కోటి రూపాయల పతంగి అంట - నమ్మేద్దామా ?
Cockfight: కోళ్ల పందెంలో గెలిస్తే విజేతకు మహేంద్ర థార్ - పందెల బరులకు వెళ్లిన రఘురామ, గంటా
కోళ్ల పందెంలో గెలిస్తే విజేతకు మహేంద్ర థార్ - పందెల బరులకు వెళ్లిన రఘురామ, గంటా
Rayudu Vs Kohli: రాయుడుని సాగనంపింది కోహ్లీనే.. తనకిష్టం లేదని ప్రపంచ కప్ నుంచి ఔట్.. త్రీడీ ప్లేయర్ వివాదంపై మాజీ క్రికెటర్ సరికొత్త వాదన
రాయుడుని సాగనంపింది కోహ్లీనే.. తనకిష్టం లేదని ప్రపంచ కప్ నుంచి ఔట్.. త్రీడీ ప్లేయర్ వివాదంపై మాజీ క్రికెటర్ సరికొత్త వాదన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Haimendorf Museum Tour Marlawai | గిరిజనుల పాలిట దేవుడు హైమన్ డార్ఫ్ జీవిత ప్రయాణం ఒకచోటే | ABPKhanapur MLA Vedma Bojju Interview | Haimendorf చేసిన సేవలు ఎన్ని తరాలైన మర్చిపోలేం | ABP DesamSobhan Babu Statue In Village | చిన నందిగామ లో శోభన్ బాబుకు చిన్న విగ్రహం పెట్టుకోలేమా.? | ABP DesamAjith Kumar Team Wins in 24H Dubai Race | దుబాయ్ కార్ రేసులో గెలిచిన అజిత్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: సంక్రాంతి సంబరాల్లో సీఎం చంద్రబాబు ఫ్యామిలీ - సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా దేవాన్ష్, అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన
సంక్రాంతి సంబరాల్లో సీఎం చంద్రబాబు ఫ్యామిలీ - సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా దేవాన్ష్, అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన
Publicity gold:  కోటి రూపాయల పతంగి అంట  - నమ్మేద్దామా ?
కోటి రూపాయల పతంగి అంట - నమ్మేద్దామా ?
Cockfight: కోళ్ల పందెంలో గెలిస్తే విజేతకు మహేంద్ర థార్ - పందెల బరులకు వెళ్లిన రఘురామ, గంటా
కోళ్ల పందెంలో గెలిస్తే విజేతకు మహేంద్ర థార్ - పందెల బరులకు వెళ్లిన రఘురామ, గంటా
Rayudu Vs Kohli: రాయుడుని సాగనంపింది కోహ్లీనే.. తనకిష్టం లేదని ప్రపంచ కప్ నుంచి ఔట్.. త్రీడీ ప్లేయర్ వివాదంపై మాజీ క్రికెటర్ సరికొత్త వాదన
రాయుడుని సాగనంపింది కోహ్లీనే.. తనకిష్టం లేదని ప్రపంచ కప్ నుంచి ఔట్.. త్రీడీ ప్లేయర్ వివాదంపై మాజీ క్రికెటర్ సరికొత్త వాదన
Viral Video: రూ.10 కోసం ఇంత దారుణమా? - విశ్రాంత ఐఏఎస్‌పై బస్ కండక్టర్ దాడి, వైరల్ వీడియో
రూ.10 కోసం ఇంత దారుణమా? - విశ్రాంత ఐఏఎస్‌పై బస్ కండక్టర్ దాడి, వైరల్ వీడియో
Kumbh mela: గత జన్మలో భారత్‌లో పుట్టానేమో- కుంభమేళాలో విదేశీ భక్తురాలి ఆసక్తికర వ్యాఖ్యలు
గత జన్మలో భారత్‌లో పుట్టానేమో- కుంభమేళాలో విదేశీ భక్తురాలి ఆసక్తికర వ్యాఖ్యలు
TTD News: 'సోషల్ మీడియాలో వస్తోన్న వార్తలు నమ్మొద్దు' - సమన్వయ లోపం ప్రచారం ఖండించిన టీటీడీ ఛైర్మన్, ఈవో
'సోషల్ మీడియాలో వస్తోన్న వార్తలు నమ్మొద్దు' - సమన్వయ లోపం ప్రచారం ఖండించిన టీటీడీ ఛైర్మన్, ఈవో
Sobhan Babu Birthday: సొంత ఊరికి ఎంతో చేసిన శోభన్ బాబు... కనీసం ఒక్క విగ్రహం కూడా లేదు, ఎక్కడో తెల్సా?
సొంత ఊరికి ఎంతో చేసిన శోభన్ బాబు... కనీసం ఒక్క విగ్రహం కూడా లేదు, ఎక్కడో తెల్సా?
Embed widget