అన్వేషించండి

Vivo X90: వావ్ అనిపించే కెమెరాలో వివో ఎక్స్90 - వన్‌ప్లస్ 10, షావోమీ 12లకు గట్టిపోటీ!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో తన కొత్త ఫోన్ అయిన ఎక్స్90ని లాంచ్ చేసింది.

వివో ఎక్స్90 స్మార్ట్ ఫోన్‌ను కంపెనీ చైనాలో లాంచ్ చేసింది. లైవ్ స్ట్రీమ్ ఈవెంట్ ద్వారా ఈ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 9200 ప్రాసెసర్‌ను అందించారు. ఈ ఫోన్ షావోమీ 12, వన్‌ప్లస్ 10 సిరీస్ ఫోన్లతో పోటీ పడనుంది. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉంది.

వివో ఎక్స్90 ధర
ఇందులో నాలుగు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 3,699 యువాన్లుగా (సుమారు రూ.42,000) నిర్ణయించారు. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 3,999 యువాన్లుగానూ (సుమారు రూ.45,000), 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 4,499 యువాన్లుగానూ (సుమారు రూ.51,000) ఉంది.

ఇక టాప్ ఎండ్ వేరియంట్ అయిన 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ 4,999 యువాన్లుగా (సుమారు రూ.57,000) నిర్ణయించారు. చైనా రెడ్, ఒరిజినల్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఈ సిరీస్ ఫోన్లకు మనదేశంలో కూడా మంచి ఆదరణ ఉంది కాబట్టి త్వరలో ఇండియాలో కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

వివో ఎక్స్90 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఆరిజిన్ ఓఎస్ 3 ఆపరేటింగ్ సిస్టంతో ఈ ఫోన్ లాంచ్ అయింది. ఇందులో 6.78 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:09గా ఉంది. దీని స్క్రీన్ టు బాడీ రేషియో 93.53 శాతంగానూ, రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గానూ ఉంది. ఆక్టాకోర్ 4ఎన్ఎం మీడియాటెక్ డైమెన్సిటీ 9200 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 12 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ కూడా ఇందులో ఉంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 12 మెగాపిక్సెల్ పొర్‌ట్రెయిట్ సెన్సార్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరా అందించారు.

దీని బ్యాటరీ సామర్థ్యం 4810 ఎంఏహెచ్‌గా ఉంది. 120W ఫాస్ట్ చార్జింగ్‌ కూడా ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే 22.2 రోజుల స్టాండ్‌బై టైంను ఈ ఫోన్ అందించనుందని కంపెనీ తెలిపింది. 5జీని కూడా ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. వైఫై 6, బ్లూటూత్ వీ5.3, ఎన్ఎఫ్ఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. దీని బరువు 196 గ్రాములుగా ఉంది.

Also Read: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?

టాప్ హెడ్ లైన్స్

Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
Madhapur Road Accident: మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
Madhapur Road Accident: మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Irumudi Twitter Review - 'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
Ameer Log Twitter Review - 'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Embed widget