Vivo V60e 5G Mobile: ఫొటోగ్రఫీ ఇష్టపడే వారికి వివో గుడ్‌న్యూస్, ఏకంగా 200MP కెమెరాతో స్మార్ట్‌ఫోన్
Vivo V60e 5G phone | వివో కంపెనీ ఏకంగా 200 MP స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీరు ఓ లుక్కేయండి.

Vivo V60e 5G: టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ల వినియోగం భారీగా పెరిగింది. కొత్త సిరీస్, మోడల్స్ ఇలా మార్కెట్లోకి వస్తే అలా కొనేస్తున్నారు. అయితే ఫొటోగ్రఫీని ఇష్టపడేవారికి వివో గుడ్ న్యూస్ చెప్పింది. అద్భుతమైన ఫొటోలు తీయాలనుకునే వారి కోసం ఓ మొబైల్ లాంచ్ కానుంది. Vivo కంపెనీ త్వరలో V సిరీస్ కింద భారతదేశంలో Vivo V60e 5G ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపింది. లాంచ్‌కు ముందు, వీవో కంపెనీ దీనికి సంబంధించిన కొన్ని వివరాలను షేర్ చేసుకుంది. త్వరలో లాంచ్ కానున్న ఫోన్‌లో 200MP లెన్స్ కెమెరా ఉంటుందని వెల్లడించింది. దీంతో పాటు ఫోన్ బ్యాటరీ, క్వాలిటీ, ఫీచర్లు ఇతర విషయాలు కొన్ని లీక్ అయ్యాయి. వివో వీ60e 5G ఫోన్ ఫీచర్లు స్పెసిఫికేషన్‌ల గురించి తెలుసుకుందాం.
Vivo V60e 5G ఫీచర్లు ఇవే
Vivo V60e 5G డిజైన్ V60 5G మోడల్ లాగానే కనిపిస్తుంది. అయితే కొత్త మోడల్ సరికొత్త రంగులలో రిలీజ్ చేయనున్నారు. వాటర్, డస్ట్ ప్రూఫ్, రెసిస్టెన్స్ కోసం ఈ ఫోన్ IP68, IP69 రేటింగ్‌తో వస్తుంది. ఈ ఫోన్ 6.77 అంగుళాల 3D కర్వ్ AMOLED డిస్‌ప్లేతో మార్కెట్లోకి రానుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ బ్రైట్ నెస్‌ను సపోర్ట్ చేస్తుంది.
బ్యాటరీ, కెమెరా వివరాలు
Vivo నుంచి త్వరలో విడుదల కానున్న వీ60ఈ 5జీ ఫోన్ 6500mAh బ్యాటరీని కలిగి ఉంటుందని సమాచారం. కెమెరా విషయానికి వస్తే దాని వెనుక భాగంలో 200MP మెయిన్ లెన్స్, 8MP అల్ట్రావైడ్ లెన్స్ ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం ఇది 50MP కెమెరాతో వస్తుంది. ఇది MediaTek Dimensity 7400 ప్రాసెసర్ కలిగి ఉండటంతో పాటు దీనిని 8GB RAMతో మార్కెట్లోకి తేనున్నారు.
లాంచ్, అంచనా ధర
నివేదికల ప్రకారం, ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 28,749 ఉంటుంది. అయితే వివో కంపెనీ ఇంకా లాంచ్ డేట్ ప్రకటించలేదు. కానీ ఇది త్వరలో మార్కెట్‌లోకి రానుందని తెలిపింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం ఇది వచ్చే వారం, లేదా 2 వారాల్లో విడుదలయ్యే అవకాశం ఉంది.
Redmi Note 14 Pro 5Gకి పోటీ
Vivo నుంచి వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్ REDMI Note 14 Pro 5Gకి కాంపిటీషన్ ఇస్తుంది. Redmi ఈ ఫోన్ 6.67 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఫోన్ వెనుక భాగంలో 50MP + 8MP + 2MP ట్రిపుల్ కెమెరా సెటప్, సెల్ఫీ ఫొటోలు, వీడియోల కోసం ముందు భాగంలో 20MP లెన్స్ ఉన్నాయి. Dimensity 7300 Ultra ప్రాసెసర్ ఉన్న ఈ రెడ్‌మీ ఫోన్ బ్యాటరీ 5500 mAh. ప్రస్తుతం ఈ కామర్స్ వెబ్‌సైట్ Flipkartలో డిస్కౌంట్ తర్వాత ఈ ఫోన్ రూ. 23,999కి కొనుగోలు చేయవచ్చు అని సమాచారం.






















