(Source: ECI/ABP News/ABP Majha)
Vivo V29e: కొత్త ఫోన్‌తో రానున్న వివో - లాంచ్ రేపే - ధర ఎంత ఉండవచ్చు?
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో తన కొత్త ఫోన్ వీ29ఈని మనదేశంలో లాంచ్ చేయనుంది.
వివో వీ29ఈ మనదేశంలో ఆగస్టు 28వ తేదీన లాంచ్ అయింది. దీనికి సంబంధించిన కలర్ ఆప్షన్లు, స్టోరేజ్ వేరియంట్ వివరాలు కూడా ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. దీంతోపాటు ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన ప్రొడక్ట్ పేజీ కూడా లైవ్ అయింది. దీని ధర కూడా రూ.25 వేల నుంచి రూ.30 వేల మధ్యలో ఉండనుంది.
టెక్అవుట్‌లుక్ కథనం ప్రకారం... ఈ ఫోన్‌లో రెండు స్టోరేజ్ ఆప్షన్లు ఉండనున్నాయి. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.26,999గానూ, 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.28,999గానూ ఉండనుందని సమాచారం. అయితే దీని అసలు ధర మాత్రం కంపెనీ అధికారికంగా వెల్లడించే వరకు తెలియరాలేదు.
ఈ స్మార్ట్ ఫోన్‌లో 3డీ కర్వ్‌డ్ డిస్‌ప్లేను అందించనున్నారు. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కూడా ఉండనుంది. పంచ్ హోల్ కూడా ఫోన్ మధ్యలో అందుబాటులో ఉండనుంది. ఆర్కిటిక్ రెడ్, ఆర్కిటిక్ బ్లూ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాల సెటప్ ఉండనుంది. ఇందులో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా, దీంతో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా అందించనున్నట్లు తెలుస్తోంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 50 మెగాపిక్సెల్ కెమెరా ఉండే అవకాశం ఉంది.
ఈ ఫోన్‌కు సంబంధించిన మిగతా ఫీచర్లు కూడా ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. వీటి ప్రకారం ఇందులో 6.78 అంగుళాల కర్వ్‌డ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లే ఉండనుంది. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా, పీక్ బ్రైట్‌నెస్ 1300 నిట్స్‌గానూ, స్క్రీన్ టు బాడీ రేషియో 93.3 శాతంగానూ ఉండనుంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. దీంతోపాటు 8 జీబీ ర్యామ్ కూడా అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 44w ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది.
వివో వై02 బడ్జెట్ స్మార్ట్ ఫోన్ గతేడాది మనదేశంలో లాంచ్ అయింది. ఇది ఒక ప్రారంభ లెవల్ స్మార్ట్ ఫోన్. ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.51 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. ఆక్టాకోర్ మీడియాటెక్ ప్రాసెసర్‌పై వివో వై02 పని చేయనుంది. ఫుల్ వ్యూ డిస్‌ప్లేను ఇందులో అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. వివో వై02లో స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. ఈ మొబైల్‌లో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే మనదేశంలో లాంచ్ అయింది. 3 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధర రూ.8,999గా ఉంది. ఆర్చిడ్ బ్లూ, కాస్మిక్ గ్రే కలర్ ఆప్షన్లలో వివో వై02 కొనుగోలు చేయవచ్చు.
Read Also: సెకండ్ హ్యాండ్ ఐఫోన్ కొంటున్నారా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!
Read Also: మీ స్మార్ట్ ఫోన్ ఊరికే స్లో అయిపోతుందా? - అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial