Best Mobiles Under Rs 20000: రూ.20 వేలలోపు బెస్ట్ ఫోన్లు ఇవే - కొనాలనుకుంటే ఓ లుక్కేయండి!
Best Mobiles Under rs 20000 in India: ప్రస్తుతం మనదేశంలో రూ.20 వేలలోపు విభాగంలో స్మార్ట్ ఫోన్లలో మంచి పోటీ నెలకొంది.
Best Smartphone Under 20000: ప్రపంచంలో ఏ టాప్ ఎండ్ ప్రీమియం మోడల్ ఫోన్ వచ్చినా అందరి దృష్టి దాని వైపు వెళ్తుంది. కానీ మనదేశంలో ఎక్కువగా అమ్ముడుపోతున్న స్మార్ట్ ఫోన్లు రూ.20 వేల ధరలోపువే. ప్రజలు బేసిక్ ఫోన్ నుంచి స్మార్ట్ ఫోన్ అనుభవంలోకి అడుగుపెట్టడానికి ఈ విభాగంలోని ఫోన్లనే ఎంచుకుంటారు. కాబట్టి ఈ డిపార్ట్‌మెంట్‌లో పోటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అద్భుతమైన డిజైన్, సూపర్ ప్రాసెసర్లు, అమోఎల్ఈడీ డిస్‌ప్లేలను కూడా ఈ విభాగంలో చూడవచ్చు.
ఈ విభాగంలో చాలా కంపెనీలు తమ ఫోన్లు లాంచ్ చేశాయి. కాబట్టి రూ.20 వేలలో మంచి ఫోన్ కొనాలనుకుంటే ఆప్షన్లు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి రూ.20 వేలలోపు మార్కెట్లో అందుబాటులో ఉన్న ఫోన్లలో బెస్ట్ ఐదు ఫోన్లు ఏవో చూద్దాం...
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ (OnePlus Nord CE3 Lite 5G)
ధర - రూ.19,999 నుంచి ప్రారంభం
డిస్‌ప్లే - 6.72 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
కెమెరా - 108 మెగాపిక్సెల్ + 2 మెగాపిక్సెల్ + 2 మెగాపిక్సెల్
సెల్ఫీ కెమెరా - 16 మెగాపిక్సెల్
ర్యామ్ - 8 జీబీ
స్టోరేజ్ - 128 జీబీ, 256 జీబీ
ప్రాసెసర్ - క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695
బ్యాటరీ - 5000 ఎంఏహెచ్
ఫాస్ట్ ఛార్జింగ్ - 67W ఫాస్ట్ ఛార్జింగ్
మోటో జీ84 5జీ (Moto G84 5G)
ధర - రూ.18,999 నుంచి ప్రారంభం
డిస్‌ప్లే - 6.55 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ పీఓఎల్ఈడీ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
కెమెరా - 50 మెగాపిక్సెల్ + 8 మెగాపిక్సెల్
సెల్ఫీ కెమెరా - 16 మెగాపిక్సెల్
ర్యామ్ - 12 జీబీ
స్టోరేజ్ - 256 జీబీ
ప్రాసెసర్ - క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695
బ్యాటరీ - 5000 ఎంఏహెచ్
ఫాస్ట్ ఛార్జింగ్ - 30W ఫాస్ట్ ఛార్జింగ్
పోకో ఎక్స్5 ప్రో (Poco X5 Pro 5G)
ధర - రూ.18,499 నుంచి ప్రారంభం
డిస్‌ప్లే - 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
కెమెరా - 108 మెగాపిక్సెల్ + 8 మెగాపిక్సెల్ + 2 మెగాపిక్సెల్
సెల్ఫీ కెమెరా - 16 మెగాపిక్సెల్
ర్యామ్ - 6 జీబీ, 8 జీబీ
స్టోరేజ్ - 128 జీబీ, 256 జీబీ
ప్రాసెసర్ - క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778జీ
బ్యాటరీ - 5000 ఎంఏహెచ్
ఫాస్ట్ ఛార్జింగ్ - 67W ఫాస్ట్ ఛార్జింగ్
శాంసంగ్ గెలాక్సీ ఎం34 5జీ (Samsung Galaxy M34 5G)
ధర - రూ.16,499 నుంచి ప్రారంభం
డిస్‌ప్లే - 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
కెమెరా - 50 మెగాపిక్సెల్ + 8 మెగాపిక్సెల్ + 2 మెగాపిక్సెల్
సెల్ఫీ కెమెరా - 13 మెగాపిక్సెల్
ర్యామ్ - 6 జీబీ, 8 జీబీ
స్టోరేజ్ - 128 జీబీ, 256 జీబీ
ప్రాసెసర్ - శాంసంగ్ ఎక్సినోస్ 1280
బ్యాటరీ - 6000 ఎంఏహెచ్
ఫాస్ట్ ఛార్జింగ్ - స్టాండర్డ్ ఛార్జింగ్
రెడ్‌మీ నోట్ 12 5జీ (Redmi Note 12 5G)
ధర - రూ.15,999 నుంచి ప్రారంభం
డిస్‌ప్లే - 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
కెమెరా - 48 మెగాపిక్సెల్ + 8 మెగాపిక్సెల్ + 2 మెగాపిక్సెల్
సెల్ఫీ కెమెరా - 13 మెగాపిక్సెల్
ర్యామ్ - 4 జీబీ, 6 జీబీ, 8 జీబీ
స్టోరేజ్ - 128 జీబీ, 256 జీబీ
ప్రాసెసర్ - క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 4 జెన్
బ్యాటరీ - 5000 ఎంఏహెచ్
ఫాస్ట్ ఛార్జింగ్ - 33W ఫాస్ట్ ఛార్జింగ్
Read Also: డైనమిక్ ఐల్యాండ్‌తో లాంచ్ అయిన ఐఫోన్ 15 సిరీస్ - ధర ఎంత పెట్టారు?
Read Also: అత్యధిక బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే యాపిల్ వాచ్ ఇదే - యాపిల్ వాచ్ అల్ట్రా 2 వచ్చేసింది!
Read Also: వేళ్లు కదిపితే ఫోన్ ఎత్తేయచ్చు - మైండ్ బ్లోయింగ్ టెక్నాలజీతో యాపిల్ వాచ్ సిరీస్ 9 - ధర ఎంత?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial