అన్వేషించండి

WhatsApp లోని ఈ 5 ఫీచర్లు 90 శాతం యూజర్లకు తెలియవు.. వీటిని ఎలా ఉపయోగించాలంటే

WhatsApp New Features: వాట్సాప్ యూజర్ల కోసం 5 కొత్త ఫీచర్లను అందిస్తుంది. కానీ చాలా మంది చాట్, కాల్స్ కోసం మాత్రమే వాట్సాప్ ఉపయోగిస్తారు. అదనపు ఫీచర్ల ప్రయోజనాలు తెలిస్తే కచ్చితంగా మీరు వాడతారు.

WhatsApp Features: వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తూ యూజర్లకు మరిన్ని సౌకర్యాలు అందిస్తోంది. కానీ చాలా మంది కేవలం చాట్ చేయడం, కాల్స్ చేయడానికే దీన్ని ఉపయోగిస్తుంటాం. అయితే, ఈ యాప్‌లో ఇప్పటికే మీ గోప్యత (Privacy), సౌలభ్యం, చాటింగ్ అనుభవాన్ని మెరుగుపరిచే అనేక అధునాతన ఫీచర్లు వచ్చి చేరాయని గుర్తించారా. ఈ ఫీచర్లు ఏమిటో, వాటిని ఎప్పుడు, ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆటోమేటిక్ హై-క్వాలిటీ ఫోటో షేరింగ్
సాధారణంగా చాలా మెసేజింగ్ యాప్‌లు మీరు పంపే ఫోటోలను కంప్రెస్ (Compress) చేస్తుంటాయి. కానీ వాట్సాప్‌లో మీరు ఇకపై ఫోటోలు, వీడియోలను ఎప్పుడూ HD క్వాలిటీలో పంపవచ్చు. ప్రతిసారీ HD ఐకాన్‌ను నొక్కి సెలక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా, మీరు దీన్ని డిఫాల్ట్‌గా సెట్ చేసుకోవచ్చు. ఇందుకోసం, Settings > Storage and Data > Media Upload Quality లోకి వెళ్లి HD ని సెలక్ట్ చేసుకోవాలి. దీనివల్ల స్టోరేజ్ కొంచెం ఎక్కువగా వినియోగమైనా, ఫోటో క్వాలిటీ మాత్రం అద్భుతంగా ఉంటుంది.

పాస్‌కీ (Passkey)తో అకౌంట్‌ మరింత సురక్షితం 
వాట్సాప్ ఇప్పుడు మీకు పాస్‌కీ లాగిన్ సపోర్ట్ ను అందిస్తోంది. ఇందులో మీ ముఖం (Face) లేదా వేలిముద్ర (Fingerprint) మాత్రమే మీ గుర్తింపు అవుతుంది. ఒకవేళ మీ ఫోన్ పోయినా లేదా ఎవరైనా మీ వాట్సాప్‌ను సెటప్ చేయడానికి ప్రయత్నించినా.. మీ బయోమెట్రిక్ ఐడీ లేకుండా యాప్ ఓపెన్ చేయలేరు. దీన్ని ఆన్ చేయడానికి Settings > Account > Passkeys లోకి వెళ్లండి. మీ చాట్ బ్యాకప్‌ను కూడా మరింత సురక్షితం చేయడానికి Chats > Chat Backup లో ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ బ్యాకప్ ను కూడా Activate చేసుకోవచ్చు.

ఒకే ఫోన్‌లో రెండు వాట్సాప్ ఖాతాలు
గతంలో 2 నంబర్లను ఉపయోగించాలంటే యాప్ క్లోన్ లేదా వాట్సాప్ బిజినెస్ (WhatsApp Business) వంటి అదనపు యాప్‌లు ఉపయోగించాల్సి వచ్చేది. ఇప్పుడు వాట్సాప్ మల్టీ-అకౌంట్ ఫీచర్‌ను ఆండ్రాయిడ్ యూజర్ల కోసం అందుబాటులోకి తెచ్చింది. దీని కోసం, 3 చుక్కల మెనూ (Three-dot menu) > Settings లోకి వెళ్లి, మీ పేరు పక్కన కనిపించే '+' ఐకాన్‌పై ట్యాప్ చేయాలి. కొన్ని స్టెప్స్ ఫాలో అయ్యాక, ఎటువంటి అదనపు యాప్ లేకుండా మీ రెండవ ఖాతా వెంటనే రెడీ అవుతుంది.

చాట్ లోపలే తక్షణ అనువాదం (Instant Translation)
ఒక మెసేజ్‌ను మరో భాషలో చదవాలా? ఇకపై వేరే యాప్ తెరవాల్సిన అవసరం లేదని సంస్థ తెలిపింది. మీకు కావాల్సిన మెసేజ్‌పై లాంగ్ ప్రెస్ చేయాలి, More ని ఎంచుకుని, ఆపై Translate పై ట్యాప్ చేయండి. ల్యాంగ్వేజ్ ప్యాక్‌లు డౌన్‌లోడ్ అయిన వెంటనే అనువాదం కనిపిస్తుంది. మీరు కావాలనుకుంటే, మొత్తం చాట్ థ్రెడ్‌కు ఆటో-ట్రాన్స్‌లేషన్‌ను సైతం ఆన్ చేసుకోవచ్చు, దీనివల్ల విదేశీ భాషలో ఉన్న చాట్‌ను చదవడం చాలా సులభం అవుతుంది.

గ్రూప్ చాట్‌ల కోసం AI ఆధారిత స్మార్ట్ సమ్మరీ (Smart Summary)
మీరు ఎక్కువ మెసేజ్‌లు ఉన్న గ్రూప్ చాట్‌ను మిస్ అయ్యారా? అయితే మెటా ఏఐ (Meta AI) అందించే కొత్త 'మెసేజ్ సమ్మరీస్' ఫీచర్ మీ కోసం ఆ మొత్తం చాట్‌లోని ముఖ్య విషయాలను చిన్న, స్పష్టమైన సారాంశం (Summary) గా తయారుచేసి ఇస్తుంది. మీరు చదవని మెసేజ్‌లు (Unread messages) ఉన్నప్పుడు మీకు 'Summarise Privately' అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఫీచర్ మీ ఫోన్‌లో ప్రాసెస్ అవుతుంది. అంటే మీ చాట్ వివరాలు మెటా వరకు వెళ్లవు. అయితే, ప్రస్తుతం ఈ ఫీచర్ కొన్ని పరిమిత భాషల్లో, ప్రాంతాల్లోనే అందుబాటులో ఉంది. త్వరలోనే అందరు యూజర్లకు ఇవ్వనున్నట్లు సంస్థ తెలిపింది.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Maoists Surrender: మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. గెరిల్లా ఆర్మీ చీఫ్ బర్సే దేవా లొంగుబాటు, ఆయుధాలు స్వాధీనం
మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. గెరిల్లా ఆర్మీ చీఫ్ బర్సే దేవా లొంగుబాటు, ఆయుధాలు స్వాధీనం
IndiGo Flights Diverted: శంషాబాద్‌కు రావాల్సిన రెండు ఇండిగో విమానాలు గన్నవరం విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్
IndiGo Flights Diverted: శంషాబాద్‌కు రావాల్సిన రెండు ఇండిగో విమానాలు గన్నవరం విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్
Pawan Kalyan new movies: డిప్యూటీ సీఎంగానే కాదు హీరోగానూ పవన్ బాధ్యతలు - రాజకీయంగా నైతికమేనా?
డిప్యూటీ సీఎంగానే కాదు హీరోగానూ పవన్ బాధ్యతలు - రాజకీయంగా నైతికమేనా?
Shanmukh Jaswanth : ప్రియురాలిని పరిచయం చేసిన షణ్ముఖ్ జశ్వంత్? - గాడ్స్ ప్లాన్ అంటూ పోస్ట్... ఆమె ఎవరు?
ప్రియురాలిని పరిచయం చేసిన షణ్ముఖ్ జశ్వంత్? - గాడ్స్ ప్లాన్ అంటూ పోస్ట్... ఆమె ఎవరు?
Advertisement

వీడియోలు

Rohit Sharma, Virat Kohli ODI Matches in 2026 | 2026లో రో - కో ఆడే మ్యాచులు ఇవే
India vs New Zealand Series Squad | టీమ్ సెలక్షన్ లో భారీ ట్విస్ట్
Shubman Gill in Team India BCCI | గిల్ విషయంలో సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Hardik Pandya in Test Cricket | టెస్టుల్లోకి పాండ్యా రీఎంట్రీ ఫిక్స్?
Record Liquor Sales | మద్యం అమ్మకాల్లో తెలంగాణ ఆల్ టైం రికార్డ్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Maoists Surrender: మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. గెరిల్లా ఆర్మీ చీఫ్ బర్సే దేవా లొంగుబాటు, ఆయుధాలు స్వాధీనం
మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. గెరిల్లా ఆర్మీ చీఫ్ బర్సే దేవా లొంగుబాటు, ఆయుధాలు స్వాధీనం
IndiGo Flights Diverted: శంషాబాద్‌కు రావాల్సిన రెండు ఇండిగో విమానాలు గన్నవరం విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్
IndiGo Flights Diverted: శంషాబాద్‌కు రావాల్సిన రెండు ఇండిగో విమానాలు గన్నవరం విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్
Pawan Kalyan new movies: డిప్యూటీ సీఎంగానే కాదు హీరోగానూ పవన్ బాధ్యతలు - రాజకీయంగా నైతికమేనా?
డిప్యూటీ సీఎంగానే కాదు హీరోగానూ పవన్ బాధ్యతలు - రాజకీయంగా నైతికమేనా?
Shanmukh Jaswanth : ప్రియురాలిని పరిచయం చేసిన షణ్ముఖ్ జశ్వంత్? - గాడ్స్ ప్లాన్ అంటూ పోస్ట్... ఆమె ఎవరు?
ప్రియురాలిని పరిచయం చేసిన షణ్ముఖ్ జశ్వంత్? - గాడ్స్ ప్లాన్ అంటూ పోస్ట్... ఆమె ఎవరు?
BJP Politics: కృష్ణా జలాల విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ తెలంగాణకు తీరని అన్యాయం చేశాయి: బండి సంజయ్
కృష్ణా జలాల విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ వల్లే తెలంగాణకు అన్యాయం: బండి సంజయ్
Actress Raasi: అనసూయ వివాదంలో మరో ట్విస్ట్.. హీరోయిన్ రాశి ఫైర్, పేరెత్తకుండానే చీవాట్లు !
అనసూయ వివాదంలో మరో ట్విస్ట్.. హీరోయిన్ రాశి ఫైర్, పేరెత్తకుండానే చీవాట్లు !
Amaravati Land Pooling: అమరావతి లో రెండోదశ పూలింగుకు ఏర్పాట్లు- ఏడు గ్రామాల్లో తొమ్మిది యూనిట్లు రెడీ
అమరావతి లో రెండోదశ పూలింగుకు ఏర్పాట్లు- ఏడు గ్రామాల్లో తొమ్మిది యూనిట్లు రెడీ
2025లో చరిత్ర సృష్టించిన మారుతి సుజుకీ - హోల్‌సేల్‌, రిటైల్‌ సేల్స్‌లో కొత్త రికార్డులు
డిసెంబర్‌లో బ్లాక్‌బస్టర్‌, 2025లో సేల్స్‌ సునామీ - రికార్డులు తిరగరాసిన మారుతి సుజుకీ
Embed widget