అన్వేషించండి

50 మెగాపిక్సెల్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 7 జీబీ ర్యామ్ - ధర మాత్రం రూ.10 వేలలోపే!

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ టెక్నో తన కొత్త స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ చేసింది. అదే టెక్నో స్పార్క్ 9టీ.

టెక్నో మనదేశంలో స్పార్క్ 9టీ అనే కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. ఈ ఫోన్‌లో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్ ఇందులో ఉంది. ఫోన్ వెనకవైపు 50 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది.

టెక్నో స్పార్క్ 9టీ ధర
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ ఉన్న ఈ వేరియంట్ ధరను రూ.9,799గా నిర్ణయించారు. టర్కోయిస్ సియాన్, అట్లాంటిక్ బ్లూ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. అమెజాన్ ఈ ఫోన్ సేల్‌కు ఉంచారు.

టెక్నో స్పార్క్ 9టీ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 ఆధారిత హైఓఎస్ 7.6 ఆపరేటింగ్ సిస్టంపై టెక్నో స్పార్క్ 9టీ పనిచేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ357 ప్రాసెసర్ కూడా ఇందులో అందించారు. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఉంది. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా పెంచుకోవచ్చు. స్టోరేజ్‌లో నుంచి 3 జీబీని వర్చువల్ ర్యామ్‌గా ఉపయోగించుకోవచ్చు. అంటే 7 జీబీ వరకు ర్యామ్ ఉండనుంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, ఏఐ లెన్స్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.

4జీ, వైఫై, బ్లూటూత్, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి. యాక్సెలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ఈ-కంపాస్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఫింగర్ ప్రింట్ సెన్సార్లను కూడా అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా... 18W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.88 సెంటీమీటర్లుగా ఉంది.

టెక్నో కామోన్ 19 ప్రో 5జీ కూడా ఇటీవలే లాంచ్ అయింది. ఇందులో 6.8 అంగుళాల భారీ డిస్‌ప్లే, 64 మెగాపిక్సెల్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు అందించారు. ఈ ఫోన్‌కు సంబంధించిన సేల్ రిటైల్ స్టోర్లలో ఇప్పటికే ప్రారంభం అయింది. ఈ ఫోన్ ఒక్క వేరియంట్‌లో మాత్రమే లాంచ్ అయింది. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధర రూ.21,999గా ఉంది. సెడార్ గ్రీన్, ఎకో బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 2 మెగాపిక్సెల్ పొర్‌ట్రెయిట్, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరాలు అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది.

Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!

Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!

టాప్ హెడ్ లైన్స్

Venezuela Earthquake: వెనిజులాలో భారీ భూకంపం! పెను విధ్వంసం! లక్ష మంది వరకు మృతి! 
వెనిజులాలో భారీ భూకంపం! పెను విధ్వంసం! లక్ష మంది వరకు మృతి! 
Modi Cabinet Reshuffle 2026: కేంద్ర కేబినెట్ విస్తరణ - విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అవుట్? జెన్‌జీని మోదీ చల్లబరుస్తారా?
కేంద్ర కేబినెట్ విస్తరణ - విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అవుట్? జెన్‌జీని మోదీ చల్లబరుస్తారా?
Gade Sai Krishna Lockup Death Case: సాయికృష్ణ కేసులో కీలక అప్డేట్! మరికొందరిపై సిట్ అనుమానం! మరిన్ని అరెస్టులు ఖాయమా?
సాయికృష్ణ కేసులో కీలక అప్డేట్! మరికొందరిపై సిట్ అనుమానం! మరిన్ని అరెస్టులు ఖాయమా?
Janasena Leaders Communication Gap: జనసేన ఎంపీలు, ఎమ్మెల్యేల వాయిస్ ఎందుకు వినిపించడం లేదు ? పవన్ ఆగ్రహం వెనుక అసలు కారణం ఏమిటి?
జనసేన ఎంపీలు, ఎమ్మెల్యేల వాయిస్ ఎందుకు వినిపించడం లేదు ? పవన్ ఆగ్రహం వెనుక అసలు కారణం ఏమిటి?

వీడియోలు

Vaibhav Suryavanshi World Record | లంక బౌలర్లను వణకించిన వండర్ కిడ్
FIFA World Cup 2026 Goal Milestone | ఫిఫా వరల్డ్ కప్ 2026లో సరికొత్త చరిత్ర
Kandula Durgesh Counter to YSRCP | కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదు
South Africa Beat India In T20WC | 200వ ల్యాండ్‌మార్క్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ వరల్డ్ రికార్డ్
India A Win Tri-Series Final vs Sri Lanka A | లంకపై భారత్ ఏ జట్టు ఘనవిజయం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Venezuela Earthquake: వెనిజులాలో భారీ భూకంపం! పెను విధ్వంసం! లక్ష మంది వరకు మృతి! 
వెనిజులాలో భారీ భూకంపం! పెను విధ్వంసం! లక్ష మంది వరకు మృతి! 
Modi Cabinet Reshuffle 2026: కేంద్ర కేబినెట్ విస్తరణ - విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అవుట్? జెన్‌జీని మోదీ చల్లబరుస్తారా?
కేంద్ర కేబినెట్ విస్తరణ - విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అవుట్? జెన్‌జీని మోదీ చల్లబరుస్తారా?
Gade Sai Krishna Lockup Death Case: సాయికృష్ణ కేసులో కీలక అప్డేట్! మరికొందరిపై సిట్ అనుమానం! మరిన్ని అరెస్టులు ఖాయమా?
సాయికృష్ణ కేసులో కీలక అప్డేట్! మరికొందరిపై సిట్ అనుమానం! మరిన్ని అరెస్టులు ఖాయమా?
Janasena Leaders Communication Gap: జనసేన ఎంపీలు, ఎమ్మెల్యేల వాయిస్ ఎందుకు వినిపించడం లేదు ? పవన్ ఆగ్రహం వెనుక అసలు కారణం ఏమిటి?
జనసేన ఎంపీలు, ఎమ్మెల్యేల వాయిస్ ఎందుకు వినిపించడం లేదు ? పవన్ ఆగ్రహం వెనుక అసలు కారణం ఏమిటి?
Varanasi : ఒక్క షాట్ కోసం 90 టేక్స్ - సీక్వెన్స్ వెరీ స్పెషల్... రణకుంభ చెప్పిన వారణాసి విశేషాలు
ఒక్క షాట్ కోసం 90 టేక్స్ - సీక్వెన్స్ వెరీ స్పెషల్... రణకుంభ చెప్పిన వారణాసి విశేషాలు
Dengue vs Viral Fever : డెంగ్యూ vs వైరల్ ఫీవర్.. రెండింటి మధ్య తేడాలు ఇవే, తెలుసుకోకుంటే ప్రమాదమే
డెంగ్యూ vs వైరల్ ఫీవర్.. రెండింటి మధ్య తేడాలు ఇవే, తెలుసుకోకుంటే ప్రమాదమే
Akarsh Byramudi: తెలుగు బుల్లితెర చాక్లెట్ బాయ్.. 'మామగారు' సీరియల్ హీరో గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
తెలుగు బుల్లితెర చాక్లెట్ బాయ్.. 'మామగారు' సీరియల్ హీరో గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
Nara Lokesh:
"నా భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే..!" అవనిగడ్డలో లోకేష్‌ ఆసక్తికర వ్యాఖ్యలు! వలవేసి చేపలు పట్టిన మంత్రి
Embed widget