Tecno Pova 5G Amazon Offer: రూ.15 వేలలోపే సూపర్ 5జీ ఫోన్ - 10000 ఎంఏహెచ్ పవర్‌బ్యాంక్ ఫ్రీ - అమెజాన్‌లో బంపర్ ఆఫర్
టెక్నో పోవా 5జీపై అమెజాన్‌లో సూపర్ ఆఫర్‌ను అందించారు. దీన్ని రూ.15 వేలలోపే కొనుగోలు చేయవచ్చు. పవర్ బ్యాంక్ కూడా ఉచితంగా అందించనున్నారు.
టెక్నో పోవా 5జీ స్మార్ట్ ఫోన్‌పై అమెజాన్‌లో సూపర్ ఆఫర్ అందుబాటులో ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్‌పైఈ ఫోన్ పనిచేయనుంది. ఫోన్ వెనకవైపు 50 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. 6000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఇందులో ఉంది.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఆఫర్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
టెక్నో పోవా 5జీ ధర
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధరను రూ.15,299గా నిర్ణయించారు. ఎస్‌బీఐ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.1,000 తగ్గింపు లభించనుంది. దీంతోపాటు ఫోన్ కొనుగోలుపై 10000 ఎంఏహెచ్ పవర్ బ్యాంక్‌ను ఉచితంగా అందించనున్నారు.
టెక్నో పోవా 5జీ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 ఆధారిత హైఓఎస్ 8.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.95 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గానూ, స్క్రీన్ టు బాడీ రేషియో 82.8 శాతంగానూ ఉంది. దీని స్క్రీన్ రిజల్యూషన్ 1080 x 2460 పిక్సెల్స్‌గా ఉంది.
మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్‌పై ఈ స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా ఇంకా పెంచుకునే అవకాశం ఉంది. 6000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించడం విశేషం. 18W ఫాస్ట్ చార్జింగ్‌ను టెక్నో పోవా 5జీ సపోర్ట్ చేయనుంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 13 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్, 2 మెగాపిక్సెల్ కెమెరాలు కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా అందించారు.
ప్రైవసీ కోసం ఫోన్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందించారు. ఫేస్ అన్‌లాక్ ఫీచర్ కూడా ఇందులో ఉండటం విశేషం. 5జీ, 4జీ, బ్లూటూత్ 5.0, జీపీఎస్, ఏ-జీపీఎస్, డ్యూయల్ సిమ్, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బైదు, గ్లోనాస్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.
టెక్నో పోవా 5జీని కొనుగోలు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
View this post on Instagram