అన్వేషించండి

Tecno Pop 6 Pro: బడ్జెట్ ఫోన్ కొనాలనుకునేవారికి మంచి ఆప్షన్ - రూ.9 వేలలోపే టెక్నో కొత్త ఫోన్!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ టెక్నో తన కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. అదే టెక్నో పాప్ 6 ప్రో.

టెక్నో పాప్ 6 ప్రో స్మార్ట్ ఫోన్‌ను కంపెనీ లాంచ్ చేసింది. ఈ ఫోన్ మొదటగా బంగ్లాదేశ్‌లో లాంచ్ అయింది. ఇందులో 6.6 అంగుళాల హెచ్‌డీ+ డాట్ నాచ్ డిస్‌ప్లేను అందించారు. ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 8 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా ఉంది. ఈ సంవత్సరం ప్రారంభంలో మనదేశంలో లాంచ్ అయిన టెక్నో పాప్ 5 ప్రోకు తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ అయింది.

టెక్నో పాప్ 6 ప్రో ధర
ఈ ఫోన్ ధరను బంగ్లాదేశ్‌లో 10,490 టాకాలుగా (మనదేశ కరెన్సీలో సుమారు రూ.8,900) నిర్ణయించారు. పీస్‌ఫుల్ బ్లూ, పోలార్ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ త్వరలో మనదేశంలో కూడా లాంచ్ కానుంది. దీని భారతీయ వేరియంట్ ధర రూ.9 వేలలోపే ఉండే అవకాశం ఉంది.

టెక్నో పాప్ 6 ప్రో స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.6 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. ముందువైపు కెమెరా కోసం డాట్ నాచ్ ఉంది. వెనకవైపు డిజైనర్ ప్యానెల్‌ను అందించారు. ఆక్టాకోర్ ప్రాసెసర్‌పై టెక్నో పాప్ 6 ప్రో రన్ అవ్వనుంది. అయితే అది ఏ కంపెనీ ప్రాసెసర్ అన్నది తెలియరాలేదు. 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ ఈ ఫోన్‌లో ఉన్నాయి. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా పెంచుకోవచ్చు.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 8 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు ఏఐ సెన్సార్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.

4జీ, జీపీఎస్, వైఫై, బ్లూటూత్, ఎఫ్ఎం, ఓటీజీ సపోర్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు అందించారు. గైరో సెన్సార్, యాంబియంట్ లైట్ సెన్సార్లు ఉన్నాయి. ఇక ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫోన్ పక్కభాగంలో అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. దీని మందం 0.87 సెంటీమీటర్లుగా ఉంది.

టెక్నో కామోన్ 19 ప్రో మోండ్రియన్ ఎడిషన్ స్మార్ట్ ఫోన్ ఇటీవలే మనదేశంలో లాంచ్ అయింది. ఫోన్ వెనకవైపు కలర్ చేంజింగ్ డిజైన్‌ను కూడా అందించారు. ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే లాంచ్ అయింది. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధరను రూ.17,999గా నిర్ణయించారు.

ఇందులో 6.8 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్టీపీఎస్ డిస్‌ప్లేను అందించారు. మీడియాటెక్ హీలియో జీ96 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 8 జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. మెమొరీ ఫ్యూజన్ టెక్నాలజీ ద్వారా ర్యామ్‌ను 13 జీబీ వరకు పెంచుకోవచ్చు.

ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 50 మెగాపిక్సెల్ పొర్‌ట్రెయిట్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరాలు కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 33W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. ఆండ్రాయిడ్ 12 ఆధారిత హైఓఎస్ 8.6 ఆపరేటింగ్ సిస్టంపై టెక్నో కామోన్ 19 ప్రో మోండ్రియన్ ఎడిషన్ 5జీ పనిచేయనుంది.

Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?

Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Fire Accident: యాదాద్రి థర్మల్ పవర్‌ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు, దట్టమైన పొగ!
యాదాద్రి థర్మల్ పవర్‌ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు, దట్టమైన పొగ!
Vidadala Rajini: డీఎస్పీ ఆఫీసుకు వెళ్లి పాస్‌పోర్ట్ అప్పగించిన విడదల రజిని.. అసలేం జరిగిందంటే..
డీఎస్పీ ఆఫీసుకు వెళ్లి పాస్‌పోర్ట్ అప్పగించిన విడదల రజిని.. అసలేం జరిగిందంటే..
TG EAPCET 2026 Toppers List: తెలంగాణ ఎప్‌సెట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ ఫార్మసీ విభాగాల్లో టాప్ 10 ర్యాంకర్లు వీరే
తెలంగాణ ఎప్‌సెట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ ఫార్మసీ విభాగాల్లో టాప్ 10 ర్యాంకర్లు వీరే
Rajdhani Express Fire Accident: రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. కాశీ యాత్రకు వెళ్తున్న భక్తుల బస్సు శ్రీకాకుళంలో బోల్తా
రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. కాశీ యాత్రకు వెళ్తున్న భక్తుల బస్సు శ్రీకాకుళంలో బోల్తా

వీడియోలు

RTC Bus Overtake Shock సిరిసిల్ల ప్రమాదంలో ట్విస్ట్.. కొత్త CCTVలో బయటపడిన అసలు కారణం
“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Fire Accident: యాదాద్రి థర్మల్ పవర్‌ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు, దట్టమైన పొగ!
యాదాద్రి థర్మల్ పవర్‌ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు, దట్టమైన పొగ!
Vidadala Rajini: డీఎస్పీ ఆఫీసుకు వెళ్లి పాస్‌పోర్ట్ అప్పగించిన విడదల రజిని.. అసలేం జరిగిందంటే..
డీఎస్పీ ఆఫీసుకు వెళ్లి పాస్‌పోర్ట్ అప్పగించిన విడదల రజిని.. అసలేం జరిగిందంటే..
TG EAPCET 2026 Toppers List: తెలంగాణ ఎప్‌సెట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ ఫార్మసీ విభాగాల్లో టాప్ 10 ర్యాంకర్లు వీరే
తెలంగాణ ఎప్‌సెట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ ఫార్మసీ విభాగాల్లో టాప్ 10 ర్యాంకర్లు వీరే
Rajdhani Express Fire Accident: రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. కాశీ యాత్రకు వెళ్తున్న భక్తుల బస్సు శ్రీకాకుళంలో బోల్తా
రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. కాశీ యాత్రకు వెళ్తున్న భక్తుల బస్సు శ్రీకాకుళంలో బోల్తా
Bandi Bhageerath POCSO Case: నేరాన్ని అంగీకరించిన బండి భగీరథ్! ఇంతకీ లొంగిపోయాడా ! పోలీసులే పట్టుకున్నారా..?
నేరాన్ని అంగీకరించిన బండి భగీరథ్! ఇంతకీ లొంగిపోయాడా ! పోలీసులే పట్టుకున్నారా..?
Horror Thriller OTT : ఊరిలో చేతబడులతో వరుస హత్యలు - ఎవరూ ఊహించని క్లైమాక్స్... ఓటీటీలో వీకెండ్ హారర్ థ్రిల్లర్
ఊరిలో చేతబడులతో వరుస హత్యలు - ఎవరూ ఊహించని క్లైమాక్స్... ఓటీటీలో వీకెండ్ హారర్ థ్రిల్లర్
Fake Currency Case: జీడి నెల్లూరులో ఫేక్ కరెన్సీ కేసు.. వ్యాపారులను ముంచిన గ్యాంగ్.. ఖాకీలు కూడా ఖైదీలే!
జీడి నెల్లూరులో ఫేక్ కరెన్సీ కేసు.. వ్యాపారులను ముంచిన గ్యాంగ్.. ఖాకీలు కూడా ఖైదీలే!
Mouni Roy: విడాకుల విషయంలో యూ టర్న్... తూచ్ అంటూ మళ్ళీ కలుస్తారా?
విడాకుల విషయంలో యూ టర్న్... తూచ్ అంటూ మళ్ళీ కలుస్తారా?
Embed widget