By: ABP Desam | Updated at : 30 Apr 2022 04:44 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
టెక్నో ఫాంటం ఎక్స్ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది.
టెక్నో ఫాంటం ఎక్స్ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న కర్వ్‌డ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లే, డ్యూయల్ సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి. 33W ఫాస్ట్ చార్జింగ్‌ను కూడా ఈ స్మార్ట్ ఫోన్ సపోర్ట్ చేయనుంది. వివో వీ23ఈ 5జీ, ఒప్పో ఎఫ్21 ప్రో, శాంసంగ్ గెలాక్సీ ఎం53 5జీలతో ఈ ఫోన్ పోటీ పడనుంది.
టెక్నో ఫాంటం ఎక్స్ ధర
ఈ స్మార్ట్ ఫోన్‌లో ఒక్క వేరియంట్ మాత్రమే లాంచ్ అయింది. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.25,999గా ఉంది. ఐస్‌ల్యాండ్ బ్లూ, సమ్మర్ సన్‌సెట్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. మే 4వ తేదీ నుంచి దీని సేల్ జరగనుంది. ఈ ఫోన్ కొనుగోలు చేస్తే రూ.2,999 విలువైన బ్లూటూత్ స్పీకర్ ఉచితంగా లభించనుంది.
టెక్నో ఫాంటం ఎక్స్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఆండ్రాయిడ్ 11 ఆధారిత హైఓఎస్ 8.0 ఆపరేటింగ్ సిస్టంపై టెక్నో ఫాంటం ఎక్స్ పనిచేయనుంది. 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ కర్వ్‌డ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను ఈ స్మార్ట్ ఫోన్‌లో అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 19.5:9గానూ, రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గానూ ఉంది. డిస్‌ప్లే ప్రొటెక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్యానెల్ కూడా అందించారు.
దీని బ్యాటరీ సామర్థ్యం 4700 ఎంఏహెచ్ కాగా... 33W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. కేవలం 20 నిమిషాల్లోనే 50 శాతం చార్జింగ్ ఎక్కనుంది. మీడియాటెక్ హీలియో జీ95 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. దీని మందం 0.87 సెంటీమీటర్లుగా ఉంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్, 8 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు రెండు కెమెరాలు అందించారు. 48 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి.
12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 512 జీబీ వరకు పెంచుకోవచ్చు. 4జీ వోల్టే, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5.0, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు కూడా ఇందులో ఉన్నాయి.
Also Read: OnePlus 10: వన్‌ప్లస్ 10 ఫీచర్లు లీక్ - లాంచ్ ఎప్పుడంటే?
Also Read: Realme GT 2: రియల్‌మీ కొత్త 5జీ ఫోన్ వచ్చేసింది - రూ.ఐదు వేల వరకు ఆఫర్ - ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Infinix Hot 12 Play: 7 జీబీ ర్యామ్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్న ఫోన్ రూ.9 వేలలోపే - సూపర్ ఫీచర్లు కదా!
Moto G52j: మోటొరోలా కొత్త ఫోన్ వచ్చేసింది - అదిరిపోయే ఫీచర్లు - ఫోన్ ఎలా ఉందో చూశారా?
Lava Z3 Pro: రూ.8 వేలలోపే లావా కొత్త ఫోన్ - ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Redmi Note 11T: రెడ్మీ నోట్ 11టీ సిరీస్ వచ్చేస్తుంది - బడ్జెట్ ధరలోనే సూపర్ 5జీ ఫోన్లు!
Vivo Y75: వివో కొత్త ఫోన్ వచ్చేసింది - అదిరిపోయే ఫీచర్లు - ధర ఎంతంటే?
Konaseema Police Intelligence Failure : మరోసారి ఏపీ పోలీస్ ఇంటలిజెన్స్ ఫెయిల్ అయిందా ! కోనసీమ ఆందోళనలను లైట్ తీసుకున్నారా ?
Babu Pawan Reaction : పాలనా వైఫల్యాన్ని మా మీద నెడతారా ? ప్రభుత్వంపై పవన్, చంద్రబాబు ఆగ్రహం!
Quad Meet Tension : క్వాడ్ దేశాధినేతలను రెచ్చగొడుతున్న చైనా, రష్యా - మీటింగ్ సమీపంలో యుద్ధ విన్యాసాలు !
Cooking Oil Prices: వంట నూనెలపై గుడ్ న్యూస్ చెప్పనున్న కేంద్రం! సన్‌ఫ్లవర్ ఆయిల్ ధరపై..!