Samsung Launch Event: రెండు కొత్త డివైస్‌లు లాంచ్ చేయనున్న శాంసంగ్ - ఈసారి మరింత టఫ్‌గా!
శాంసంగ్ గెలాక్సీ ఎక్స్‌కవర్ 6 ప్రో, ట్యాబ్ యాక్టివ్ 4 ప్రోలను త్వరలో లాంచ్ చేయనుంది.
![Samsung Launch Event: రెండు కొత్త డివైస్‌లు లాంచ్ చేయనున్న శాంసంగ్ - ఈసారి మరింత టఫ్‌గా! Samsung May Launch Galaxy XCover 6 Pro Tab Active 4 Pro on July 13th Samsung Launch Event: రెండు కొత్త డివైస్‌లు లాంచ్ చేయనున్న శాంసంగ్ - ఈసారి మరింత టఫ్‌గా!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/26/b46b7442e7e83d6058e788fbd087be5e_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
శాంసంగ్ కొత్త లాంచ్ ఈవెంట్‌ను జులై 13వ తేదీన నిర్వహించనుంది. ఈ ఈవెంట్లో రెండు రగ్డ్ డివైసెస్‌ను కంపెనీ లాంచ్ చేయనుంది. ఇందులో గెలాక్సీ ఎక్స్‌కవర్ 6 ప్రో, ట్యాబ్ యాక్టివ్ 4 ప్రో ఉండనున్నాయి. ఇవి గ్లోబల్ లాంచ్ కానున్నాయి. రఫ్‌గా ఉండే ఫోన్లు ఉపయోగించాలనుకునే వారే లక్ష్యంగా ఈ ఫోన్లు రూపొందించనున్నారు.
ఈ రెండు డివైస్‌లకు సంబంధించిన లాంచ్ పోస్టర్‌ను కూడా కంపెనీ టీజ్ చేసింది. వీటి అంచులు కొంచెం మందంగా ఉన్నాయి. దీంతోపాటే స్టైలస్ కూడా ఉంది. కాబట్టి ఇది స్టైలస్‌ను కూడా సపోర్ట్ చేసే అవకాశం ఉంది. ఇక స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే... దీని డిజైన్, స్పెసిఫికేషన్లు గతంలోనే లీకయ్యాయి.
శాంసంగ్ గెలాక్సీ ఎక్స్‌కవర్ 6 ప్రో స్పెసిఫికేషన్లు
ఈ స్మార్ట్ ఫోన్‌ను హార్డ్ ప్లాస్టిక్‌తో రూపొందించారు. వెనకవైపు టెక్స్చర్డ్ ప్యానెల్ అందించారు. ఇది ఒక 5జీని సపోర్ట్ చేసే రగ్డ్ ఫోన్. ఇందులో 6.6 అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లేను అందించారు. ఇది ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే కాగా... 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఫీచర్ కూడా ఉంది. 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అందించారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.
6 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ కూడా ఇందులో ఉండనుంది. ఆండ్రాయిడ్ 12 ఆధారిత వన్‌యూఐ 4.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 8 మెగాపిక్సెల్ లేదా 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కూడా అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 4050 ఎంఏహెచ్‌గా ఉంది.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)