News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

200 మెగాపిక్సెల్ కెమెరాతో శాంసంగ్ కొత్త ఫోన్ - లాంచ్ ఎప్పుడంటే?

శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా స్మార్ట్ ఫోన్ 200 మెగాపిక్సెల్ కెమెరాతో లాంచ్ కానుందని వార్తలు వస్తున్నాయి.

FOLLOW US: 
Share:

శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రాలో 200 మెగాపిక్సెల్ కెమెరా ఉండనున్నట్లు తెలుస్తోంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్22 అల్ట్రాకు తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ కానుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్ ఈ సంవత్సరం ప్రారంభంలో లాంచ్ అయింది. అలాగే శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా వచ్చే సంవత్సరం ప్రారంభంలో లాంచ్ కానుంది. అయితే ఈ విషయాన్ని శాంసంగ్ అధికారికంగా ప్రకటించలేదు.

కొరియా ఐటీ న్యూస్ అందించిన నివేదిక ప్రకారం... శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా స్మార్ట్ ఫోన్‌లో 200 మెగాపిక్సెల్ కెమెరా అందించనున్నారు. శాంసంగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్‌లో కేవలం అల్ట్రా వేరియంట్‌లో మాత్రం ఈ కెమెరా ఉండనుంది.

శాంసంగ్ ఇటీవలే గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4 స్మార్ట్ ఫోన్‌ను గ్లోబల్‌గా లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్‌లో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,799.99 డాలర్లుగా (సుమారు రూ.1,42,700) ఉంది. 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్, 12 జీబీ ర్యామ్ + 1 టీబీ స్టోరేజ్ వేరియంట్ల ధరలు కంపెనీ ఇంకా అఫీషియల్‌గా ప్రకటించలేదు. బీజ్, గ్రేగ్రీన్, ఫాంటం బ్లాక్ రంగుల్లో ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. శాంసంగ్.కాం వెబ్‌సైట్లో ఎక్స్‌క్లూజివ్‌గా బర్గండీ కలర్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.

శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4 స్పెసిఫికేషన్లు
ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ల కోసం శాంసంగ్ ప్రత్యేకంగా రూపొందించిన ఆండ్రాయిడ్ 12ఎస్ ఆధారిత వన్ యూఐ 4.1.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఈ ఆపరేటింగ్ సిస్టంతో లాంచ్ అయిన మొదటి ఫోన్ శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్4నే. 7.6 అంగుళాల డైనమిక్ అమోఎల్ఈడీ 2ఎక్స్ ఇన్‌ఫినిటీ ఫ్లెక్స్ డిస్‌ప్లేను ప్రధాన స్క్రీన్‌గా అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 21.6:18గా ఉంది. కవర్ డిస్‌ప్లేగా 6.2 అంగుళాల హెచ్‌డీ+ డైనమిక్ అమోఎల్ఈడీ 2ఎక్స్ డిస్‌ప్లేను శాంసంగ్ అందించింది. దీని యాస్పెక్ట్ రేషియో 23.1:9గా ఉంది.

క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 12 జీబీ ర్యామ్, 1 టీబీ వరకు స్టోరేజ్‌ను ఈ ఫోన్‌లో అందించారు. వన్ యూఐ సాఫ్ట్ వేర్ ద్వారా మల్టీ టాస్కింగ్‌కు ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ను అందించారు.

ఈ స్మార్ట్ ఫోన్‌లో మొత్తంగా ఐదు కెమెరాలు ఉన్నాయి. ఒకటి కవర్ డిస్‌ప్లే పైన,  ఒకటి మెయిన్ స్క్రీన్ పైన అండర్ డిస్‌ప్లేలో అందించగా, వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. ఫోన్ వెనక ఉన్న కెమెరాల్లో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 10 మెగాపిక్సెల్ టెలిఫొటో లెన్స్ అందించారు. మెయిన్ స్క్రీన్ మీద 4 మెగాపిక్సెల్, కవర్ డిస్‌ప్లేపై 10 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.

5జీ, 4జీ, వైఫై 6ఈ, బ్లూటూత్ వీ5.2, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 4400 ఎంఏహెచ్‌గా ఉంది. 25W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.63 సెంటీమీటర్లు కాగా, బరువు 263 గ్రాములుగా ఉంది.

Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!

Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!

Published at : 22 Aug 2022 11:53 PM (IST) Tags: samsung Samsung New Phone Samsung Galaxy S23 Ultra Samsung Galaxy S23 Ultra Launch Samsung Galaxy S23 Ultra Features

ఇవి కూడా చూడండి

Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్‌లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?

Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్‌లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?

Amazon Vs Flipkart: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్స్‌లో ఏ కార్డులపై ఆఫర్లు ఉన్నాయి? - వీటి ద్వారా మరింత తగ్గనున్న ధరలు!

Amazon Vs Flipkart: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్స్‌లో ఏ కార్డులపై ఆఫర్లు ఉన్నాయి? - వీటి ద్వారా మరింత తగ్గనున్న ధరలు!

Big Billion Days Sale 2023: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో స్మార్ట్ ఫోన్లపై బంపర్ ఆఫర్లు - టాప్-10 డీల్స్ ఇవే!

Big Billion Days Sale 2023: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో స్మార్ట్ ఫోన్లపై బంపర్ ఆఫర్లు - టాప్-10 డీల్స్ ఇవే!

Vivo Price Cut: రెండు ఫోన్ల ధరలు తగ్గించిన వివో - ఇప్పుడు రూ.12 వేల లోపుకే!

Vivo Price Cut: రెండు ఫోన్ల ధరలు తగ్గించిన వివో - ఇప్పుడు రూ.12 వేల లోపుకే!

Itel P55: దేశంలోనే అత్యంత చవకైన 5జీ ఫోన్ - రూ.10 వేలలోపే 8 జీబీ + 128 జీబీ - ఐటెల్ పీ55 వచ్చేసింది!

Itel P55: దేశంలోనే అత్యంత చవకైన 5జీ ఫోన్ - రూ.10 వేలలోపే 8 జీబీ + 128 జీబీ - ఐటెల్ పీ55 వచ్చేసింది!

టాప్ స్టోరీస్

Tamilsai : ఎంత అవమానించినా వెనక్కి తగ్గను -గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు !

Tamilsai : ఎంత అవమానించినా వెనక్కి తగ్గను -గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు !

మేనిఫెస్టోతో మ్యాజిక్ చేయనున్న బీఆర్‌ఎస్‌- హింట్ ఇచ్చిన హరీష్

మేనిఫెస్టోతో మ్యాజిక్ చేయనున్న బీఆర్‌ఎస్‌- హింట్ ఇచ్చిన హరీష్

Esha Gupta Casting Couch : ట్రాప్ చేయాలని చూశారు, మేకప్ ఆర్టిస్ట్‌ను నా రూమ్‌కు పిలిచి నిద్రపోయా

Esha Gupta Casting Couch : ట్రాప్ చేయాలని చూశారు, మేకప్ ఆర్టిస్ట్‌ను నా రూమ్‌కు పిలిచి నిద్రపోయా

బీజేపీ వైఖరి నచ్చకే NDA నుంచి బయటకు వచ్చేశాం, AIDMK నేత కీలక వ్యాఖ్యలు

బీజేపీ వైఖరి నచ్చకే NDA నుంచి బయటకు వచ్చేశాం, AIDMK నేత కీలక వ్యాఖ్యలు