News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Samsung Price Cut: ఈ శాంసంగ్ బడ్జెట్ ఫోన్‌పై భారీ తగ్గింపు - 6000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ తన గెలాక్సీ ఎం32 స్మార్ట్ ఫోన్‌పై రూ.2,000 ధర తగ్గింపును అందించింది.

FOLLOW US: 
Share:

శాంసంగ్ గెలాక్సీ ఎం32 ధర మనదేశంలో రూ.2,000 మేర తగ్గింది. ఈ గెలాక్సీ ఎం-సిరీస్ మనదేశంలో గతేడాది జూన్‌లో లాంచ్ అయింది. ఇందులో 6000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీని అందించారు. రెండు కలర్ ఆప్షన్లు, రెండు స్టోరేజ్ వేరియంట్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. ఫోన్ వెనకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి.

శాంసంగ్ గెలాక్సీ ఎం32 ధర
ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999 నుంచి రూ.12,999కు తగ్గింది. ఇక 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999 నుంచి రూ.14,999కు తగ్గింది. బ్లాక్, లైట్ బ్లూ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ ఎం32 స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 ఆధారిత వన్ యూఐ 3.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ కాగా, పీక్ బ్రైట్‌నెస్ 800 నిట్స్‌గా ఉంది. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ80 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 6 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా పెంచుకునే అవకాశం ఉంది.

ఈ ఫోన్ వెనకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 20 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.

6000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ కూడా ఇందులో ఉంది. 25W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ కూడా ఇందులో ఉన్నాయి.

Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?

Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!

View this post on Instagram
 
A post shared by MOBILE & MORE (@mobileandmore_official)

Published at : 29 Jun 2022 11:53 PM (IST) Tags: Samsung Offers Samsung Galaxy M32 Price Cut Samsung Galaxy M32 Samsung Galaxy M32 Offer Samsung Galaxy M32 Price Drop

ఇవి కూడా చూడండి

Infinix Smart 8 HD: రూ.ఆరు వేలకే స్మార్ట్ ఫోన్ - భారీ బ్యాటరీ, పెద్ద డిస్‌ప్లే - ఇన్‌ఫీనిక్స్ కొత్త ఫోన్ వచ్చేసింది!

Infinix Smart 8 HD: రూ.ఆరు వేలకే స్మార్ట్ ఫోన్ - భారీ బ్యాటరీ, పెద్ద డిస్‌ప్లే - ఇన్‌ఫీనిక్స్ కొత్త ఫోన్ వచ్చేసింది!

Indian Smartphone Brands: భారతీయ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ల పతనానికి కారణం ఇదే - చైనా కంపెనీలు చేశాయా? చేజేతులా చంపేసుకున్నారా?

Indian Smartphone Brands: భారతీయ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ల పతనానికి కారణం ఇదే - చైనా కంపెనీలు చేశాయా? చేజేతులా చంపేసుకున్నారా?

Smartphone Hacking Signs: మీ ఫోన్ ఇలా ప్రవర్తిస్తుందా? - అయితే హ్యాక్ అయినట్లే - రీసెట్ చేయాల్సిందే!

Smartphone Hacking Signs: మీ ఫోన్ ఇలా ప్రవర్తిస్తుందా? - అయితే హ్యాక్ అయినట్లే - రీసెట్ చేయాల్సిందే!

Smartphone Charging Tips: ఫోన్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? - పేలిపోయే అవకాశం ఉంది జాగ్రత్త!

Smartphone Charging Tips: ఫోన్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? - పేలిపోయే అవకాశం ఉంది జాగ్రత్త!

Upcoming Smartphones: డిసెంబర్ మొదటి వారంలో ఏకంగా ఐదు ఫోన్లు లాంచ్ - ఏమేం వస్తున్నాయి? - వీటి కోసం వెయిట్ చేయవచ్చా?

Upcoming Smartphones: డిసెంబర్ మొదటి వారంలో ఏకంగా ఐదు ఫోన్లు లాంచ్ - ఏమేం వస్తున్నాయి? - వీటి కోసం వెయిట్ చేయవచ్చా?

టాప్ స్టోరీస్

Bhatti Vikramarka: లక్షల కోట్ల అప్పుల్లో తెలంగాణ, ఛాలెంజ్ గా ఆర్థికశాఖ తీసుకున్నాను: భట్టి విక్రమార్క

Bhatti Vikramarka: లక్షల కోట్ల అప్పుల్లో తెలంగాణ, ఛాలెంజ్ గా ఆర్థికశాఖ తీసుకున్నాను: భట్టి విక్రమార్క

Look Back 2023: భారీ సక్సెస్‌ కొట్టిన చిన్న సినిమాలు - ఈ ఏడాది టాలీవుడ్‌లో క్రేజీ సిక్సర్!

Look Back 2023: భారీ సక్సెస్‌ కొట్టిన చిన్న సినిమాలు - ఈ ఏడాది టాలీవుడ్‌లో క్రేజీ సిక్సర్!

2024 TVS Apache RTR 160 4V: సూపర్ డిజైన్, అదిరిపోయే లుక్‌తో వచ్చిన కొత్త అపాచీ - ధర ఎంతో తెలుసా?

2024 TVS Apache RTR 160 4V: సూపర్ డిజైన్, అదిరిపోయే లుక్‌తో వచ్చిన కొత్త అపాచీ - ధర ఎంతో తెలుసా?

Mahalaxmi Scheme: రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం - ప్రభుత్వ నిర్ణయంపై మహిళల హర్షం

Mahalaxmi Scheme: రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం - ప్రభుత్వ నిర్ణయంపై మహిళల హర్షం