Samsung Galaxy A73 5G Sale: 108 మెగాపిక్సెల్ కెమెరా, 5జీ ఫీచర్లతో శాంసంగ్ కొత్త ఫోన్ - సేల్ ప్రారంభం - రూ.3,000 క్యాష్ బ్యాక్, మరో సూపర్ ఆఫర్ కూడా!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ ఇటీవలే లాంచ్ చేసిన గెలాక్సీ ఏ73 5జీ స్మార్ట్ ఫోన్ సేల్‌ను మనదేశంలో ప్రారంభించింది.
Samsung Galaxy A73 5G India Sale: శాంసంగ్ మనదేశంలో ఇటీవలే లాంచ్ చేసిన గెలాక్సీ ఏ73 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778జీ 5జీ ప్రాసెసర్‌ను ఇందులో అందించారు. 8 జీబీ ర్యామ్ కూడా ఇందులో ఉంది. 6.7 అంగుళాల సూపర్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను ఇందులో అందించారు. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఫీచర్‌ను కూడా ఇందులో అందించారు. 108 మెగాపిక్సెల్ కెమెరాను శాంసంగ్ ఇందులో అందించింది.
శాంసంగ్ గెలాక్సీ ఏ73 5జీ ధర
ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.41,999గా ఉంది. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.44,999గా నిర్ణయించారు. దీనికి సంబంధించిన ఎర్లీ సేల్ శాంసంగ్ అధికారిక వెబ్ సైట్‌లో ప్రారంభం అయింది. ఏప్రిల్ 11వ తేదీన మిగతా వెబ్‌సైట్లలో కూడా ప్రారంభం కానుందని కంపెనీ ప్రకటించింది. శాంసంగ్ ఫైనాన్స్ ప్లస్, ఐసీఐసీఐ బ్యాంకు కార్డులు, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుల ద్వారా ఈ ఫోన్ కొనుగోలు చేస్తే రూ.3,000 క్యాష్ బ్యాక్ లభించనుంది. దీంతోపాటు రూ.6,990 విలువైన శాంసంగ్ గెలాక్సీ బడ్స్ లైవ్ ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌ను రూ.499కే కొనుగోలు చేయవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ ఏ73 5జీ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత వన్ యూఐ 4.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఏకంగా నాలుగు సంవత్సరాల పాటు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం అప్‌డేట్స్, ఐదు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తామని కంపెనీ తెలిపింది. ఇందులో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా... గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ కూడా ఇందులో ఉంది.
8 జీబీ ర్యామ్ ఇందులో ఉంది. 256 జీబీ వరకు స్టోరేజ్‌ను కూడా ఇందులో అందించారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 108 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 5 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా... 25W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. ఈ ఫోన్‌తో పాటు శాంసంగ్ అడాప్టర్‌ను అందించబోవడం లేదు. కాబట్టి వినియోగదారులు దాన్ని ప్రత్యేకంగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
Also Read: యాపిల్ అత్యంత చవకైన 5జీ ఫోన్ వచ్చేసింది - లేటెస్ట్ ప్రాసెసర్‌తో - ధర ఎంతంటే?
Also Read: కొత్త ఐప్యాడ్ వచ్చేసింది - అన్నీ లేటెస్ట్ ఫీచర్లే - ధర ఎంతంటే?