అన్వేషించండి

Samsung Galaxy A04: రూ.10 వేలలోపే శాంసంగ్ కొత్త ఫోన్? - ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ తన కొత్త ఫోన్ గెలాక్సీ ఏ04ను మార్కెట్లో లాంచ్ చేసింది.

శాంసంగ్ గెలాక్సీ ఏ04 బడ్జెట్ స్మార్ట్ ఫోన్ సైలెంట్‌గా మార్కెట్లో లాంచ్ అయింది. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. గతేడాది నవంబర్‌లో లాంచ్ అయిన గెలాక్సీ ఏ03కి తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది.

శాంసంగ్ గెలాక్సీ ఏ04 ధర
దీని ధరను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుతానికి ఈ ఫోన్ అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉంది. మనదేశంలో ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు. 8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఆప్షన్లు ఇందులో ఉన్నాయి. దీని ఫీచర్లను బట్టి ధర రూ.10 వేలలోపే ఉండనుంది.

శాంసంగ్ గెలాక్సీ ఏ04 స్పెసిఫికేషన్లు
ఇందులో 6.5 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. దీని ప్రాసెసర్ వివరాలను ఇంకా రివీల్ చేయలేదు. కానీ ఎక్సినోస్ 850 అయ్యే అవకాశం ఉంది. 4 జీబీ, 6 జీబీ, 8 జీబీ ర్యామ్ ఆప్షన్లు, 32 జీబీ, 64 జీబీ, 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో గెలాక్సీ ఏ04 లాంచ్ అయింది.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫోన్ ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది. డ్యూయల్ సిమ్ సపోర్ట్, 4జీ వోల్టే, వైఫై, బ్లూటూత్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

శాంసంగ్ ఇటీవలే గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4 స్మార్ట్ ఫోన్‌ను గ్లోబల్‌గా లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్‌లో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,799.99 డాలర్లుగా (సుమారు రూ.1,42,700) ఉంది. 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్, 12 జీబీ ర్యామ్ + 1 టీబీ స్టోరేజ్ వేరియంట్ల ధరలు కంపెనీ ఇంకా అఫీషియల్‌గా ప్రకటించలేదు. బీజ్, గ్రేగ్రీన్, ఫాంటం బ్లాక్ రంగుల్లో ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. శాంసంగ్.కాం వెబ్‌సైట్లో ఎక్స్‌క్లూజివ్‌గా బర్గండీ కలర్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.

శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4 స్పెసిఫికేషన్లు
ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ల కోసం శాంసంగ్ ప్రత్యేకంగా రూపొందించిన ఆండ్రాయిడ్ 12ఎస్ ఆధారిత వన్ యూఐ 4.1.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఈ ఆపరేటింగ్ సిస్టంతో లాంచ్ అయిన మొదటి ఫోన్ శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్4నే. 7.6 అంగుళాల డైనమిక్ అమోఎల్ఈడీ 2ఎక్స్ ఇన్‌ఫినిటీ ఫ్లెక్స్ డిస్‌ప్లేను ప్రధాన స్క్రీన్‌గా అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 21.6:18గా ఉంది. కవర్ డిస్‌ప్లేగా 6.2 అంగుళాల హెచ్‌డీ+ డైనమిక్ అమోఎల్ఈడీ 2ఎక్స్ డిస్‌ప్లేను శాంసంగ్ అందించింది. దీని యాస్పెక్ట్ రేషియో 23.1:9గా ఉంది.

క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 12 జీబీ ర్యామ్, 1 టీబీ వరకు స్టోరేజ్‌ను ఈ ఫోన్‌లో అందించారు. వన్ యూఐ సాఫ్ట్ వేర్ ద్వారా మల్టీ టాస్కింగ్‌కు ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ను అందించారు.

ఈ స్మార్ట్ ఫోన్‌లో మొత్తంగా ఐదు కెమెరాలు ఉన్నాయి. ఒకటి కవర్ డిస్‌ప్లే పైన,  ఒకటి మెయిన్ స్క్రీన్ పైన అండర్ డిస్‌ప్లేలో అందించగా, వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. ఫోన్ వెనక ఉన్న కెమెరాల్లో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 10 మెగాపిక్సెల్ టెలిఫొటో లెన్స్ అందించారు. మెయిన్ స్క్రీన్ మీద 4 మెగాపిక్సెల్, కవర్ డిస్‌ప్లేపై 10 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.

5జీ, 4జీ, వైఫై 6ఈ, బ్లూటూత్ వీ5.2, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 4400 ఎంఏహెచ్‌గా ఉంది. 25W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.63 సెంటీమీటర్లు కాగా, బరువు 263 గ్రాములుగా ఉంది.

Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!

Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!

టాప్ హెడ్ లైన్స్

Local Reservation In Telangana: తెలంగాణలో స్థానిక అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్
తెలంగాణలో స్థానిక అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్ అని తీర్పు
Revanth Reddy Sircilla Sabha: కేటీఆర్ కోటలో రేవంత్ వ్యూహం ఏంటి? 2028కు ముందే పొలిటికల్ వార్?
Revanth Reddy Sircilla Sabha: కేటీఆర్ కోటలో రేవంత్ వ్యూహం ఏంటి? 2028కు ముందే పొలిటికల్ వార్?
Amaravati ORR: 4 ప్యాకేజీలుగా, 2 బ్రిడ్జిలు, 3 టన్నెళ్లతో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు.. అంచనా వ్యయం 30,491 కోట్లు
4 ప్యాకేజీలుగా, 2 బ్రిడ్జిలు, 3 టన్నెళ్లతో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు.. అంచనా వ్యయం 30,491 కోట్లు
TMC Election Symbol: టీఎంసీ పార్టీ 2 గ్రూపుల ఎన్నికల గుర్తులపై ఈసీకి సుప్రీంకోర్టు డెడ్‌లైన్
టీఎంసీ పార్టీ 2 గ్రూపుల ఎన్నికల గుర్తులపై ఈసీకి సుప్రీంకోర్టు డెడ్‌లైన్

వీడియోలు

Shubman Gill After Win Over West Indies | విరాట్ పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్
King Kohli's Record 55th ODI Century | వన్డేల్లో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర
Kuldeep Yadav Magical Spell vs WI | వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం
Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Abhishek Vaibhav Weakness in International Pitches | అభిషేక్, వైభవ్ లపై సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Local Reservation In Telangana: తెలంగాణలో స్థానిక అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్
తెలంగాణలో స్థానిక అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్ అని తీర్పు
Revanth Reddy Sircilla Sabha: కేటీఆర్ కోటలో రేవంత్ వ్యూహం ఏంటి? 2028కు ముందే పొలిటికల్ వార్?
Revanth Reddy Sircilla Sabha: కేటీఆర్ కోటలో రేవంత్ వ్యూహం ఏంటి? 2028కు ముందే పొలిటికల్ వార్?
Amaravati ORR: 4 ప్యాకేజీలుగా, 2 బ్రిడ్జిలు, 3 టన్నెళ్లతో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు.. అంచనా వ్యయం 30,491 కోట్లు
4 ప్యాకేజీలుగా, 2 బ్రిడ్జిలు, 3 టన్నెళ్లతో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు.. అంచనా వ్యయం 30,491 కోట్లు
TMC Election Symbol: టీఎంసీ పార్టీ 2 గ్రూపుల ఎన్నికల గుర్తులపై ఈసీకి సుప్రీంకోర్టు డెడ్‌లైన్
టీఎంసీ పార్టీ 2 గ్రూపుల ఎన్నికల గుర్తులపై ఈసీకి సుప్రీంకోర్టు డెడ్‌లైన్
Sindhu Fires on Schedule: 18 గంటల్లో మూడు మ్యాచ్‌లు.. ఆ మూడు పాయింట్లే కొంపముంచాయి, ఆసియా క్రీడల క్వార్టర్స్ ఓటమిపై పీవీ సింధు ఫైర్
18 గంటల్లో మూడు మ్యాచ్‌లు.. ఆ మూడు పాయింట్లే కొంపముంచాయి, ఆసియా క్రీడల క్వార్టర్స్ ఓటమిపై పీవీ సింధు ఫైర్
This Week OTT Movies : అక్టోబర్ ఫస్ట్ వీక్ ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 8 సినిమాలు స్ట్రీమింగ్... 300 కోట్ల మూవీ కచ్చితంగా చూడాల్సిందే
అక్టోబర్ ఫస్ట్ వీక్ ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 8 సినిమాలు స్ట్రీమింగ్... 300 కోట్ల మూవీ కచ్చితంగా చూడాల్సిందే
Former MP Vijayasai Reddy: తెలంగాణలోని ఏపీ హోంగార్డులను స్వరాష్ట్రానికి కేటాయించాలి: మాజీ ఎంపీ సాయిరెడ్డి విజ్ఞప్తి
తెలంగాణలోని ఏపీ హోంగార్డులను స్వరాష్ట్రానికి కేటాయించాలి: మాజీ ఎంపీ సాయిరెడ్డి విజ్ఞప్తి
డ్రైవింగ్ లైసెన్స్‌కు ఫోన్ నంబర్ లింక్ చేయకపోతే లైసెన్స్‌ రద్దు అవుతుందా, లేదా? ఏది వాస్తవం?
డ్రైవింగ్ లైసెన్స్‌కు మొబైల్ నంబర్ లింక్‌పై వైరల్ ప్రచారం.. ఏది నిజం, ఏది అబద్ధం?
Embed widget