(Source: ECI/ABP News/ABP Majha)
Redmi Note 11T: రెడ్‌మీ నోట్ 11టీ సిరీస్ వచ్చేస్తుంది - బడ్జెట్ ధరలోనే సూపర్ 5జీ ఫోన్లు!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ తన రెడ్‌మీ నోట్ 11టీ సిరీస్ స్మార్ట్ ఫోన్లను చైనాలో లాంచ్ చేయనుంది.
షియోమీ తన రెడ్‌మీ నోట్ 11టీ సిరీస్ స్మార్ట్ ఫోన్లను చైనాలో లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. మే 24వ తేదీన ఇవి లాంచ్ కానున్నాయి. ఈ సిరీస్‌లో రెడ్‌మీ నోట్ 11టీ ప్రో, రెడ్‌మీ నోట్ 11టీ ప్రో ప్లస్ స్మార్ట్ ఫోన్లు ఉండనున్నాయి.
మే 24వ తేదీన రాత్రి ఏడు గంటలకు ఈ సిరీస్ ఫోన్లు లాంచ్ కానున్నాయి. దీనికి సంబంధించిన రిజర్వేషన్లను కూడా కంపెనీ ప్రారంభించింది. దీని టీజర్‌లో ఫోన్ వెనకవైపు డిజైన్ చూడవచ్చు. మూడు కెమెరాలను ఇందులో వెనకవైపు అందించారు. ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉంది. బ్లూ, సిల్వర్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
రెడ్‌మీ నోట్ 11టీ సిరీస్ ఫోన్లలో ఏ స్పెసిఫికేషన్లు ఉండనున్నాయో తెలియరాలేదు. గతంలో రెండు రెడ్‌మీ డివైస్‌లు 22041216C, 22041216UC మోడల్ నంబర్లతో 3సీ చైనా సర్టిఫికేషన్ వెబ్‌సైట్లలో కనిపించింది. వీటిలో మొదటిది రెడ్‌మీ నోట్ 11టీ కాగా... రెండోది రెడ్‌మీ నోట్ 11టీ ప్రో స్మార్ట్ ఫోన్ అని వార్తలు వస్తున్నాయి.
రెడ్‌మీ నోట్ 11టీ సిరీస్ స్పెసిఫికేషన్లు (అంచనా)
గతంలో వచ్చిన కథనాల ప్రకారం... రెడ్‌మీ నోట్ 11టీలో 5000 ఎంఏహెచ్, రెడ్‌మీ నోట్ 11టీ ప్రోలో 4500 ఎంఏహెచ్ బ్యాటరీలు ఉండనున్నాయి. 11టీలో మీడియాటెక్ డైమెన్సిటీ 1300 ప్రాసెసర్‌ను, ప్రో మోడల్‌లో డైమెన్సిటీ 8000 ప్రాసెసర్‌ను అందించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ రెండిట్లోనూ 6.6 అంగుళాల డిస్‌ప్లే అందించనున్నట్లు తెలుస్తోంది. 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఇందులో ఉండనుంది. ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎంఐయూఐ 13 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఈ ఫోన్ ధర 1,599 యువాన్ల నుంచి రూ.2,500 యువాన్ల మధ్య (సుమారు రూ.17,400 నుంచి రూ.28,900) ఉండే అవకాశం ఉంది. దీని ఫీచర్లు త్వరలో తెలియనున్నాయి.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!
View this post on Instagram