అన్వేషించండి

Redmi K50i 5G: రెడ్‌మీ కే50ఐ 5జీ వచ్చేసింది - సూపర్ ఫాస్ట్ ప్రాసెసర్‌తో!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షావోమీ మనదేశంలో రెడ్‌మీ కే50ఐ 5జీని లాంచ్ చేసింది.

రెడ్‌మీ కే50ఐ 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో బుధవారం లాంచ్ అయింది. ఇందులో 144 హెర్ట్జ్ డిస్‌ప్లే, వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8100 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.

రెడ్‌మీ కే50ఐ 5జీ ధర
ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.25,999 కాగా, 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.28,999గా నిర్ణయించారు. క్విక్ సిల్వర్, ఫాంటం బ్లూ, స్టెల్త్ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

ఐసీఐసీఐ బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.3,000 డిస్కౌంట్ లభించనుంది. దీంతోపాటు రూ.2,500 ఎక్స్‌చేంజ్ బోనస్ కూడా ఉంది. అంటే ఈ కారును రూ.22,999కే కొనుగోలు చేయవచ్చన్న మాట.

రెడ్‌మీ కే50ఐ 5జీ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎంఐయూఐ 13 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. డాల్బీ విజన్ సర్టిఫికేషన్, హెచ్‌డీఆర్10 సపోర్ట్ కూడా ఇందులో ఉంది. 144 హెర్ట్జ్ డైనమిక్ రిఫ్రెష్ రేట్ ఫీచర్ ఇందులో అందించారు. టచ్ శాంప్లింగ్ రేట్ 270 హెర్ట్జ్‌గా ఉంది.

8 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256 జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ ఇందులో ఉంది. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8100 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. దీని మందం 0.88 సెంటీమీటర్లు కాగా, బరువు 200 గ్రాములుగా ఉంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా.. దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్‌లను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.

5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్, జీపీఎస్, ఏ-జీపీఎస్, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 5080 ఎంఏహెచ్‌గా ఉంది. 67W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. ఐపీ53 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్ ఇందులో ఉంది.

Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!

Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Vijayawada Durga Temple: విజయవాడ దుర్గమ్మ దసరా ఉత్సవాల వేళ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ మార్పు
విజయవాడ దుర్గమ్మ దసరా ఉత్సవాల వేళ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ మార్పు
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
Software Engineer Suicide: ముఖానికి కవర్ చుట్టుకుని, హీలియం గ్యాస్ పీల్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్.. హైదరాబాద్‌లో ఘటన
ముఖానికి కవర్ చుట్టుకుని, హీలియం గ్యాస్ పీల్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్.. హైదరాబాద్‌లో ఘటన

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Vijayawada Durga Temple: విజయవాడ దుర్గమ్మ దసరా ఉత్సవాల వేళ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ మార్పు
విజయవాడ దుర్గమ్మ దసరా ఉత్సవాల వేళ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ మార్పు
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
Software Engineer Suicide: ముఖానికి కవర్ చుట్టుకుని, హీలియం గ్యాస్ పీల్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్.. హైదరాబాద్‌లో ఘటన
ముఖానికి కవర్ చుట్టుకుని, హీలియం గ్యాస్ పీల్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్.. హైదరాబాద్‌లో ఘటన
Air Fryer : ఎయిర్ ఫ్రైయర్ మొదటిసారి ఉపయోగిస్తుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. చేయకూడని తప్పులుఇవే
ఎయిర్ ఫ్రైయర్ మొదటిసారి ఉపయోగిస్తుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. చేయకూడని తప్పులుఇవే
39hp పవర్‌తో కవాసాకి కొత్త బైక్‌ Kawasaki Z300.. రూ.3 లక్షల లోపే! ఇందులో ప్రత్యేకతలు ఏంటంటే?
నింజా 300 ఇంజిన్‌తో కొత్త స్ట్రీట్ ఫైటర్.. Kawasaki Z300 లుక్‌ ఇదే - KTM డ్యూక్‌కు గట్టి పోటీ!
Abhishek World Record: సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
Tiger Rescue Operation: దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
Embed widget