అన్వేషించండి

Redmi A1: ప్యూర్ ఆండ్రాయిడ్ ఓఎస్‌తో రెడ్‌మీ కొత్త ఫోన్ - ధర కూడా తక్కువగానే?

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షావోమీ తన కొత్త ఫోన్ రెడ్‌మీ ఏ1ను సెప్టెంబర్ 6వ తేదీన లాంచ్ చేయనుంది.

రెడ్‌మీ ఏ1 స్మార్ట్ ఫోన్ మనదేశంలో సెప్టెంబర్ 6వ తేదీన లాంచ్ కానుంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. రెడ్‌మీ ఏ1లో మీడియాటెక్ ప్రాసెసర్ ఉండనుంది. కానీ దాని పేరు మాత్రం అనౌన్స్ చేయలేదు. అయితే ఈ ఫోన్ ద్వారా ‘క్లీన్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్’ అందించనుందని షావోమీ ప్రకటించింది. అంటే ఎటువంటి యూజర్ ఇంటర్ ఫేస్ లేకుండా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంతో ఈ ఫోన్ లాంచ్ కానుందన్న మాట.

సెప్టెంబర్ 6వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్ మార్కెట్లో లాంచ్ కానుంది. దీనికి సంబంధించిన లాండింగ్ పేజ్ కూడా కంపెనీ వెబ్‌సైట్లో చూడవచ్చు. ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉండనున్నాయి. కనీసం మూడు కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. గతంలో ఎంఐ ఏ-సిరీస్‌లో ప్యూర్ ఆండ్రాయిడ్ ఫోన్లు వచ్చేవి. ఇప్పుడు రెడ్‌మీ ఏ-సిరీస్‌లో వస్తున్నాయి.

రెడ్‌మీ కొత్త బడ్జెట్ ఫోన్ నోట్ 11ఎస్ఈ మనదేశంలో ఇటీవలే లాంచ్ అయింది. ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే ఉంది. 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధరను రూ.13,499గా నిర్ణయించారు. బైఫ్రాస్ట్ బ్లూ, కాస్మిక్ వైట్, స్పేస్ బ్లాక్, థండర్ పర్పుల్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ 12.5 ఆపరేటింగ్ సిస్టంపై ఈ స్మార్ట్ ఫోన్ పని చేయనుంది. 6.43 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లేను ఇందులో అందించారు. మీడియాటెక్ హీలియో జీ95 ప్రాసెసర్‌‌ను రెడ్‌మీ నోట్ 11ఎస్ఈలో అందించారు . 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 512 జీబీ వరకు పెంచుకోవచ్చు.

ఫోన్ వెనకవైపు నాలుగు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 13 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది.

రూ.10,999 ధరలో రెడ్‌మీ 10ఏ స్పోర్ట్ కూడా ఇటీవలే మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో 6.53 అంగుళాల వాటర్ డ్రాప్ నాచ్ తరహా హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. మీడియాటెక్ హీలియో జీ25 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఫోన్ వెనకవైపు 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరా అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 10W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ 12.5 ఆపరేటింగ్ సిస్టంపైనే ఈ ఫోన్ కూడా పనిచేయనుంది.

Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!

Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Secunderabad To Goa Train: హైదరాబాద్ నుంచి గోవా వెళ్లేవారికి గుడ్ న్యూస్- కొత్త రైలు ప్రారంభించిన కిషన్ రెడ్డి
హైదరాబాద్ నుంచి గోవా వెళ్లేవారికి గుడ్ న్యూస్- కొత్త రైలు ప్రారంభించిన కిషన్ రెడ్డి
Prakash Raj: డిప్యూటీ సీఎం అంటే ఉదయనిధి స్టాలిన్‌లా ఉండాలి - పవన్ కళ్యాణ్‌కు ప్రకాష్ రాజ్ మరో కౌంటర్
డిప్యూటీ సీఎం అంటే ఉదయనిధి స్టాలిన్‌లా ఉండాలి - పవన్ కళ్యాణ్‌కు ప్రకాష్ రాజ్ మరో కౌంటర్
Sobhita Dhulipala: సమంత నా సోల్‌మేట్‌ - నాగార్జునకు కాబోయే కోడలు శోభితా ధూళిపాళ కామెంట్స్ వైరల్!
సమంత నా సోల్‌మేట్‌ - నాగార్జునకు కాబోయే కోడలు శోభితా ధూళిపాళ కామెంట్స్ వైరల్!
Revanth Reddy : వైఎస్, కేసీఆర్ చేతకాక వదిలేశారు - రేవంత్‌కూ ఎన్నో సమస్యలు - సాధించగలరా  ?
వైఎస్, కేసీఆర్ చేతకాక వదిలేశారు - రేవంత్‌కూ ఎన్నో సమస్యలు - సాధించగలరా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Prakash Raj Counters Pawan Kalyan | తమిళనాడులో పవన్ కళ్యాణ్ పరువు తీసిన ప్రకాశ్ రాజ్ | ABP Desamపసిపాపకి పాలు పట్టేందుకు అవస్థలు పడుతున్న తల్లిNirmal Man Returned from Kuwait: కువైట్‌లో గోట్‌లైఫ్ బతుకు! ఒక్క పోస్ట్‌తో సేఫ్‌గా సొంతూరికిRajendra Prasad: నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Secunderabad To Goa Train: హైదరాబాద్ నుంచి గోవా వెళ్లేవారికి గుడ్ న్యూస్- కొత్త రైలు ప్రారంభించిన కిషన్ రెడ్డి
హైదరాబాద్ నుంచి గోవా వెళ్లేవారికి గుడ్ న్యూస్- కొత్త రైలు ప్రారంభించిన కిషన్ రెడ్డి
Prakash Raj: డిప్యూటీ సీఎం అంటే ఉదయనిధి స్టాలిన్‌లా ఉండాలి - పవన్ కళ్యాణ్‌కు ప్రకాష్ రాజ్ మరో కౌంటర్
డిప్యూటీ సీఎం అంటే ఉదయనిధి స్టాలిన్‌లా ఉండాలి - పవన్ కళ్యాణ్‌కు ప్రకాష్ రాజ్ మరో కౌంటర్
Sobhita Dhulipala: సమంత నా సోల్‌మేట్‌ - నాగార్జునకు కాబోయే కోడలు శోభితా ధూళిపాళ కామెంట్స్ వైరల్!
సమంత నా సోల్‌మేట్‌ - నాగార్జునకు కాబోయే కోడలు శోభితా ధూళిపాళ కామెంట్స్ వైరల్!
Revanth Reddy : వైఎస్, కేసీఆర్ చేతకాక వదిలేశారు - రేవంత్‌కూ ఎన్నో సమస్యలు - సాధించగలరా  ?
వైఎస్, కేసీఆర్ చేతకాక వదిలేశారు - రేవంత్‌కూ ఎన్నో సమస్యలు - సాధించగలరా ?
AP Politics: క్రిస్టియన్ తో పెళ్లి, హిందూ మతం పేరుతో రాజకీయాలా?- పవన్ కళ్యాణ్‌పై గోరంట్ల మాధవ్ ఫైర్
క్రిస్టియన్ తో పెళ్లి, హిందూ మతం పేరుతో రాజకీయాలా?- పవన్ కళ్యాణ్‌పై గోరంట్ల మాధవ్ ఫైర్
Viswam Trailer: యాక్షన్, ఫన్‌తో నిండిపోయిన ‘విశ్వం’ ట్రైలర్ - బ్లాక్‌బస్టర్ వైబ్స్ కనిపిస్తున్నాయా?
యాక్షన్, ఫన్‌తో నిండిపోయిన ‘విశ్వం’ ట్రైలర్ - బ్లాక్‌బస్టర్ వైబ్స్ కనిపిస్తున్నాయా?
Israel Strikes Beirut: లెబనాన్‌పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం - ప్రాణాలు దక్కాలంటే పారిపోవాలని ప్రజలకు వార్నింగ్
లెబనాన్‌పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం - ప్రాణాలు దక్కాలంటే పారిపోవాలని ప్రజలకు వార్నింగ్
Chandrababu News: ఉచిత ఇసుకపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తే కఠిన చర్యలు - ఏపీ సీఎం చంద్రబాబు
ఉచిత ఇసుకపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తే కఠిన చర్యలు - ఏపీ సీఎం చంద్రబాబు
Embed widget